అప్పుడే పుట్టిన పసివాళ్లకు కామెర్లు వస్తుంటాయి. చాలా మందిలో ఇది కనిపిస్తుంటుంది. వీటిని బాల కామెర్లు అంటారు. చాలా సందర్భాల్లో ఇది 2,3 వారాల్లో తగ్గిపోతుంది. ఒక్కో సారి మాత్రం ఈ కామెర్లు తగ్గకుండా కొనసాగుతాయి. వాస్తవానికి అప్పుడే పుట్టిన పసివాళ్లలో అన్ని అవయవాలు పూర్తిగా విచ్చుకోవు. నిదానంగా ఆయా శరీర భాగాలు చురుగ్గా పుంజుకొంటాయి. ఈ విస్తరించే క్రమంలో కామెర్లు ఉంటే కాలేయం సక్రమంగా రూపు దిద్దుకోదు. అటువంటప్పుడు వెంటనే మేలుకోకపోతే ఇబ్బంది తప్పదు. దీన్ని ఎక్సట్రా హెపాటిక్ బిలియరీ అట్రాజియా అంటారు. ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా సరిదిద్దాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించాలి. లేదంటే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఇక్కడ స్పష్టం చేయాల్సి ఉంది. చిన్నారులకు వచ్చిన అన్ని కామెర్లు ఇంతటి ప్రమాదం కానే కాదు. చాలావరకు కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. ఒక వేళ కొనసాగితే మాత్రమే చికిత్స అవసరం అని గుర్తించాలి.
No comments:
Post a Comment