కొవ్వు అన్న పదం వాస్తవానికి నెగటివ్ షేడ్ లో వాడతారు. అందుచేతనే కొవ్వెక్కిందా.. అన్న మాట అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నిజానికి కొవ్వు పెరగటం అన్న ది అనారోగ్య సూచకం కాబట్టి ఈ రకమైన పద ప్రయోగం పుట్టి ఉండవచ్చు.
శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగితే.. అవి విభిన్న శరీర అవయవాల్లో డిపాజిట్ అయిపోతాయి. కాలేయంలో ఈ రకమైన కొవ్వు పదార్థాలు పేరుకొంటే ఫ్యాటీ లివర్స్ గా చెబుతారు. ఈ కొవ్వు కణజాలం కారణంగా కాలేయం పని తీరు దెబ్బతింటుంది. అంతే గాకుండా అక్కడ ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. కాలేయంలో కొవ్వులు పేరుకొన్నట్లు గుర్తిస్తే మాత్రం వెంటనే మేలుకోవాలి. తగిన చర్యలు తీసుకోవటం ద్వారా వీటిని వదిలించుకోవాలి. లేదంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నాలుగు దశలుగా చెబుతారు. గ్రేడ్ 1,2 దశల్లో ఉంటే మాత్రం శారీరక వ్యాయామంతో రిలీఫ్ ఏర్పడుతుంది. నూనెలు, వేపుళ్లు తగ్గించి వాడటం వంటి చర్యలు తీసుకోవాలి. గ్రేడ్ 3,4 దశలకు వెళితే మాత్రం మందులు వాడాల్సి ఉంటుంది. లేదంటే అవాంఛిత పదార్థాలుగా మారి ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది క్రమంగా లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి కి దారి తీస్తుంది. అప్పుడు మరింత చికిత్స అవసరం అవుతుంది.

No comments:
Post a Comment