క్యాన్సర్ అంటే అదో చికిత్స లేని పెద్ద వ్యాధి అన్న నానుడి ఉంది. వాస్తవానికి క్యాన్సర్ మొండి రోగం అనటంలో సందేహం లేదు. అంతమాత్రాన దీనికి చికిత్స లేదు అనుకొంటే మాత్రం పొరపాటే. క్యాన్సర్ కు మొదటి దశల్లో ర్యాడికల్ ఆపరేషన్ ద్వారా చికిత్స అందించవచ్చు. రెండో దశ, మూడో దశకు వెళితే మాత్రం ఆపరేషన్ తో పాటు కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్సలు అందించాల్సి ఉంటుంది. చివరి దశకు చేరుకొన్నా కూడా చికిత్స అందించినప్పుడు నాణ్యతతో కూడిన జీవితాన్ని అందించేందుకు వీలవుతుంది.
అయితే, క్యాన్సర్ కు ర్యాడికల్ ఆపరేషన్ చేస్తే ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది అన్న అపోహ ఉంది. ఇది సరి కాదు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ తో కూడిన ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. సమర్థుడైన సర్జన్ ను సంప్రదించి మెరుగైన చికిత్స చేయించుకోవచ్చు. అంతే కానీ ఆపరేషన్ చేయిస్తే ఏదో జరిగిపోతుంది అని భ్రమ పడి చికిత్స కు దూరంగా ఉండటం సరి కాదు.