సాధారణంగా కడుపు నొప్పి అనే సమస్య ను ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి సమస్యలతో ఇది ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో కడుపు నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఇంట్లో వాడే చిట్కాలతో ఈ నొప్పి కి అడ్డుకట్ట వేయటానికి వీలవుతుంది. కానీ ఈ నొప్పి ని పూర్తిగా అశ్రద్ధ చేయటం మాత్రం కూడదు.
కొన్ని సార్లు కడుపు నొప్పితో పాటు విరేచనాలు ఉంటాయి. అందులో రంగు కనిపించవచ్చు. అటువంటప్పుడు ఈ నొప్పి విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇన్ ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లో ఈ రెండు లక్షణాలు ప్రధానమైనవి. అంటే వీటితో పాటు బరువు తగ్గటం, చిరాకు, వంటి లక్షణాలు ఉంటుంటాయి. అటువంటప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. తగిన వైద్య పరీక్షలు చేయించుకొంటే ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వీలవుతుంది. వ్యాధి ముదిరితే మాత్రం శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు కాలంలో మాత్రం సశాస్త్రీయంగా, సాఫీగా చేసేందుకు వీలవుతోంది. పేగుల్లో పూర్తిగా సమస్య ఏర్పడిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. దీన్ని కత్తిరించి ఆ భాగాన్ని తీసివేసి పేగుల్ని జత చేసేస్తారు. ఆ తర్వాత నుంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగిపోతుంది. అందుచేత సమస్య పదే పదే తలెత్తుతున్నప్పడు నిర్లక్ష్యం వహించకుండా ఉంటే బాగుంటుంది.
No comments:
Post a Comment