అతిగా వేపుడు పదార్థాల్ని కొందరు ఇష్ట పడతారు. ఎర్రగా కాల్చిన మాంసపు వంటల్ని ఆస్వాదించేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. సాల్ట్ రెడ్ మీట్ వంటి పదార్థాలు తినేటప్పుడు ఇష్టంగా అనిపిస్తాయి. కానీ ఇవి శరీరంలోకి ప్రవేశించాక జీర్ణ ప్రక్రియ సమయంలో ఇబ్బంది పెడతాయి.
వాస్తవానికి ఆహార పదార్థాలు నోటిలోకొంత, కడుపులో కొంత, చిన్న పేగులో కొంత, చివరగా పెద్ద పేగు ప్రారంభంలో మరికొంత జీర్ణం అవుతాయి.చివరగా మిగిలి పోయిన పదార్థాల పునః శోషణ అన్నది పెద్ద పేగులో జరుగుతుంది. ఈ అతిగా వేయించిన పదార్థాలు పేగు గోడల మీద ప్రభావం చూపుతాయి. క్రమం తప్పకుండా ఈ పదార్థాల్ని తీసుకోవటంతో పేగులో దుష్పరిణామాలు చోటు చేసుకొంటాయి. కొన్ని సార్లు క్యాన్సర్ కు దారి తీస్తాయి. ఒక వేళ ఈ అలవాటు తో పాటు మద్యం తాగే అలవాటు ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అందుచేత ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. మద్యం అలవాటు ఉంటే పూర్తిగా మానటం మేలు.

No comments:
Post a Comment