పరీక్ష చేయటం ద్వారా విషయాన్ని నిర్ధారించటానికి వీలవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధుల విషయంలో నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి. ఇందుకోసం రక్త పరీక్ష, స్కానింగ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు బయాప్సీ చేయించటం మామూలే. బయాప్సీ అంటే అనుమానిస్తున్న శరీర భాగంలోంచి కొంత భాగాన్ని వేరు చేసి దీన్ని ల్యాబరేటరీ లో పరీక్షిస్తారు. క్యాన్సర్ కణజాలం ఉన్నదీ లేనిదీ నిర్ధారిస్తారు.
అయితే జీర్ణ కోశ వ్యవస్థ లోని భాగాల్లో క్యాన్సర్ అను మానించినప్పుడు మాత్రం బయాప్సీ తప్పనిసరి అని భావించరాదు. ఒక్కోసారి బయాప్సీ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోకపోతే ఈ కణజాలం ఇతర భాగాలకు సోకే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు బయాప్సీ మాట దేవుడెరుగు కానీ ఈ క్యాన్సర్ కణజాలం ఇతర భాగాల్లో స్థిరపడి అక్కడ క్యాన్సర్ కు దారి తీయవచ్చు. అందుచేత తగిన వైద్య సలహా మేరకు మాత్రమే బయాప్సీ చేయించటం మేలు.

No comments:
Post a Comment