బ్లాగ్ పాఠకులందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఇంత కాలంగా బ్లాగు ను ఆదరిస్తున్న మీకు ఈ సంవత్సరం అన్నీ శుభాలు కలగాలని కోరుకొంటున్నా.
ఆధునిక కాలంలో జీర్ణ కోశ సమస్యలు పెరుగుతున్నాయి. త్రేన్పులు, అన్నం అరగక పోవటం వంటి చిన్న పాటి సమస్యల నుంచి పసిరికలు, అల్సర్ లు, రాళ్లు ఏర్పడటం వంటి సంక్లిష్ట సమస్యల దాకా చాలా కేసులు చూస్తూనే ఉన్నాం. చాలా వరకు జీర్ణ కోశ సమస్యలకు సరైన జీవన శైలి లేకపోవటం కారణంగా కనిపిస్తోంది. నియమిత సమయాల్లోనే ఆహారం తీసుకోవటం, పరిశుభ్రత పాటించటం, శుచి అయిన ఆహారాన్నే భుజించటం వంటి అలవాట్లు చేసుకోవాలి. మద్యపానం, పొగతాగటం, బాగా మసాలా పదార్థాల్ని అమితంగా స్వీకరించటం వంటి అలవాట్లను వదులుకోవాలి. కొత్త సంవత్సరంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకొని అమలు చేస్తే ఆరోగ్యాన్ని ఆనందాన్ని కాపాడుకోవచ్చు.

No comments:
Post a Comment