...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఒక్క రోజులో ఏమ‌వుతుంది..!

ఒక్క రోజు లో ఏమి మార్పు వ‌స్తుంది.. రెండు రోజుల్లో ఏమి మార్పు వ‌స్తుంది.. అని చాలామంది ఆరోగ్య అల‌వాట్ల లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు.
ఆధునిక కాలంలో చాలా అన‌ర్థాల‌కు ఆహార‌పు అల‌వాట్లే కార‌ణం అనుకోవాలి. మోడ‌ర్న్ లైఫ్ పేరుతో చాలామంది జంక్ ఫుడ్ ను ప్రిఫ‌ర్ చేస్తుంటారు. ఎప్పుడో ఒక‌ప్పుడు అయితే ఫ‌ర్వాలేదు కానీ అదే ప‌ని గా జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డితే అన‌ర్థం త‌ప్ప‌దు. దీని కార‌ణంగా ఆయిల్ నిల్వ‌లు పేరుకొని పోతాయి. దీని కార‌ణంగా శ‌రీరంలో స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌ల‌కు ఆటంకం క‌లుగుతుంది.

దీనికి తోడు ఆల్క‌హాల్ తీసుకొనే అల‌వాటు పెరుగుతోంది. ఆధునిక స‌మాజంలో ఉంటున్నాము అంటే ఆల్క‌హాల్ తీసుకోవాల్సిందే అన్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది ఏ మాత్రం స‌రి కాదు. ఒక్క రోజులో ఏమ‌వుతుంది, ప‌ర్వాలేదు తీసుకోవ‌చ్చు. అన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ చాలాసార్లు మాత్రం ఒక్క సారి అల‌వాటు ప‌డిన త‌ర్వాత ఆ అల‌వాటు రెగ్యుల‌ర్ గా మారుతుంది. అప్పుడు ఆల్క‌హాల్ కు బానిల అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. దీంతో స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి.
అందుచేత మంచి అల‌వాట్లు ఎప్పటినుంచైనా మొద‌లెట్ట‌వ‌చ్చు. చెడు అల‌వాట్లు మాత్రం ఏ ఒక్క రోజు ద‌గ్గ‌ర‌కు రానీయ‌కుండా ఉండాలి.

చిన్న పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్ర‌త్త ప‌డండి..!

చిన్న పిల్ల‌ల్లో త‌రుచూ క‌డుపు నొప్పి అంటూ ఉంటే కాస్త ఆలోచించాల్సిందే. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఉండే ఉప్పు నీటి గాలి త‌గిలే స‌ముద్ర తీర ప్రాంతాల్లో ట్రాపిక‌ల్  పాన్ క్రియాటైటిస్ అనే వ్యాధిని గ‌మ‌నించ‌డం జ‌రుగుతోంది.

శ‌రీరంలో జీర్ణ క్రియ‌కు స‌హ‌క‌రించే ఎంజైమ్ ల‌ను స్ర‌వించే పాన్ క్రియాటైటిస్ లో అడ్డంకి ఏర్ప‌డితే దాన్ని పాన్ క్రియాటైటిస్ గా అభివ‌ర్ణిస్తారు. ఇది ఎక్యూట్ పాన్ క్రియాటైటిస్ అని, క్రానిక్ పాన్ క్రియాటైటిస్ అని రెండు ర‌కాలు. సాగ‌ర ప్రాంతంలో ఉండే చిన్నారుల్లో ప్ర‌త్యేక ర‌క‌మైన పాన్ క్రియాటైటిస్ బ‌య‌ట ప‌డుతుంటుంది. తీవ్ర‌మైన నొప్పి దీని ప్రాథ‌మిక ల‌క్ష‌ణం అనుకోవ‌చ్చు. దీంతో పాటు జీర్ణంలో ఇబ్బంది, విరోచ‌నంలో ఇబ్బందిని గ‌మ‌నించ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, పుట్టుక‌తో వ‌చ్చే లోపాలు దీనికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. వైద్య ప‌రీక్ష‌ల‌తో దీన్ని నిర్ధారిస్తారు. ముందుగానే దీన్ని గ‌మ‌నిస్తే చికిత్స సుల‌భం అవుతుంది. స‌ర్జిక‌ల్ విధానాల‌తో చిన్నారుల‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే వాళ్లు పెద్ద వార‌య్యాక కూడా ఇబ్బంది లేకుండా జీవించ‌టం సాధ్యం అవుతుంది. అందుచేత ఈ ల‌క్ష‌ణాలు ఉంటే, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని చిన్నారుల్లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ముందుగానే వైద్యుల్ని సంప్ర‌దించాలి.

మారుతున్న జీవ‌న శైలితో పెరుగుతున్న స‌మ‌స్య‌లు


ఇటీవ‌ల కాలంలో పాన్ క్రియాస్ స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి.  మారుతున్న జీవ‌న శైలితో పాటు మ‌ద్య పానం వంటి అల‌వాట్లే ఇందుకు కార‌ణం. పాన్ క్రియాస్ గ్రంథిలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డితే ఇత‌ర ర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయి.
 పాన్ క్రియాస్ అనేది జీర్ణ వ్య‌వ‌స్థ లో ప్ర‌ధాన అనుబంధ అవ‌యవం.  ఆహారాన్ని జీర్ణం చేయటానికి అవ‌స‌ర‌మైన ఎంజైమ్ ల‌తో పాటు, గ్లూకోజ్ ను క్ర‌మ‌బ‌ద్దం చేసే హార్మోన్‌లను ఇది  స్ర‌విస్తుంది.

 పాన్ క్రియాస్ లో ఏర్ప‌డే ప్ర‌ధాన స‌మ‌స్యల్లో  వాపు ఏర్ప‌డ‌టం ( అక్యూట్‌ పాన్ క్రియాటైటిస్ ), రాళ్లు ఏర్ప‌డ‌టం (క్రానిక్ పాన్ క్రియాటైటిస్) ముఖ్య‌మైన‌వి. క‌డుపు పై భాగంలో తీవ్ర‌మైన నొప్పి ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఈ క‌డుపు నొప్పి వెన్నుపూస‌లోకి చొచ్చుకొని పోతున్న‌ట్లు ఉంటుంది. దీంతోపాటు  వాంతులు, విరోచ‌నంలో చ‌మురు క‌నిపిస్తుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ర‌క్త‌పు వాంతులు, ప‌సిరిక‌లు ఏర్ప‌డుతాయి. బ‌రువు త‌గ్గ‌టం,  డయాబెటిస్ ముద‌ర‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ వ్యాదుల్ని నిర్ధారించ‌టానికి ర‌క్త‌పు ప‌రీక్ష‌ల‌తో పాటు అల్ట్రా సౌండ్ ప‌రీక్ష‌లు చేయించాలి. సీటీ స్కాన్‌, ఎమ్ ఆర్ సీ పీ, ఈ ఆర్ సీ పీ ప‌రీక్ష‌ల‌తో నిర్ధారించ‌వ‌చ్చు.
స‌మ‌స్య తీవ్ర‌త ను బ‌ట్టి చికిత్స ఉంటుంది. మందుల‌తో త‌గ్గించ లేని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు ఎండో స్కోపీ విధానాల‌తో రాళ్ల‌ను కరిగించాలి (ఎండోస్కోపిక్‌ లిథోట్రిప్సీ). పాన్ క్రియాస్ నాళంలో స్టెంట్ లు అమ‌ర్చ‌టం ద్వారా కూడా ప‌రిష్కారం ల‌భిస్తుంది.ఈ విధానాల్లో ప‌రిష్కార దొర‌క‌న‌ప్పుడు ఆప‌రేష‌న్ అవ‌స‌రం. దీంతోపాటుగా ర‌క్త‌పు వాంతులు, ప‌సిరిక‌లు ముద‌ర‌టం, నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డ‌టం వంటివి జ‌రిగితే ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్బాల్లో పాన్ క్రియాస్ క్యాన్స‌ర్ సంభ‌విస్తే ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంది. పాన్‌క్రియాస్ లో క‌ణితులు ఏర్ప‌డి క్యాన్స‌ర్ కు దారి తీస్తుంది.
పాన్ క్రియాస్ లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా క్ర‌మ‌బ‌ద్ద‌మైన జీవ‌న శైలిని అనుస‌రించాలి.మ‌ద్య‌పానానికి దూరంగా ఉండ‌టం మేలు.

చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాలా..!

కొత్త సంవ‌త్స‌రం ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకొనే అల‌వాటు ఉంటుంది. ఇటువంటప్పుడు మంచి నిర్ణ‌యం తీసుకొంటే ఏడాది మొత్తం మంచిగా ఉంటుంది. అందుకే ఈ కొత్త సంవ‌త్స‌రం ఒక కొత్త నిర్ణ‌యం తీసుకోండి.
ఆహారం తినేట‌ప్పుడు వేళా పాలా లేకుండా తీసుకోవటం కొంత మందికి అల‌వాటు. మ‌రి కొంత మంది ఆయిల్ ఫుడ్స్ విప‌రీతంగా తింటుంటారు. ఈ కొత్త సంవ‌త్స‌రం ఈ అల‌వాటుకి సెల‌వు ప్ర‌క‌టించండి. ప్ర‌తీ రోజూ ఒక నిర్ణీత స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌టం ముఖ్యం. దీని వ‌ల‌న ఆయా స‌మ‌యాల‌కు జీర్ణ వ్య‌వ‌స్థ ప్రిపేర్ అవుతుంది. అప్పుడే స‌జావుగా ఆహారం జీర్ణం అవుతుంది. ఆయిల్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ ఎక్కువ‌గా తిన‌టం త‌గ్గించండి. దీని వ‌ల‌న కొవ్వు ప‌దార్థాలు పేరుకొనే స‌మ‌స్య త‌గ్గుతుంది.
ఆహారంలో తాజా కూర‌గాయాల‌కు, తాజా పండ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వండి. సాధ్యమైనంత‌గా వీటిని తినేందుకు ప్ర‌య‌త్నించండి.

దీని క‌న్నా ప్ర‌ధాన స‌మ‌స్య సీటునే అంటిపెట్టుకొని ప‌ని చేసే వారికి స‌మ‌స్య‌లు పొంచి ఉంటాయి. స్థూల‌కాయ స‌మ‌స్య కానీ, ఫాటీ లివ‌ర్స్ స‌మ‌స్య కానీ వెంటాడుతుంది. అందుచేత ఇటువంటి జీవ‌న శైలి ఉన్న వారు రోజులో కొంత స‌మ‌యం అయినా వ్యాయామానికి వెచ్చిస్తే మేలు. ఇందుకోసం ఒక షెడ్యూల్ పెట్టుకొని అయినా ప‌నిచేయాలి. వ్యాయామం త‌ప్ప‌నిస‌రిగా చేయ‌టాన్ని అల‌వాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
తాగు నీటిని దూరం పెడుతుంటారు. క్ర‌మ ప‌ద్ద‌తిలో తాగునీటిని తీసుకోవ‌టం ముఖ్యం. అలాగ‌ని అదే ప‌నిగా నీరు తాగ‌టం కూడా మంచిది కూడా సుమా..
స‌రైన ఆహార పాల‌న గురించి కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోండి. ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో గుర్తించుకోండి..!

బ్లాగ్ పాఠ‌కులంద‌రికీ మొద‌ట‌గా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.. ఇంత కాలంగా బ్లాగు ను ఆద‌రిస్తున్న మీకు ఈ సంవ‌త్స‌రం అన్నీ శుభాలు క‌ల‌గాల‌ని కోరుకొంటున్నా.

ఆధునిక కాలంలో జీర్ణ కోశ స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి.  త్రేన్పులు, అన్నం అర‌గ‌క పోవ‌టం వంటి చిన్న పాటి స‌మ‌స్య‌ల నుంచి ప‌సిరిక‌లు, అల్స‌ర్ లు, రాళ్లు ఏర్ప‌డ‌టం వంటి సంక్లిష్ట స‌మ‌స్య‌ల దాకా చాలా కేసులు చూస్తూనే ఉన్నాం. చాలా వ‌ర‌కు జీర్ణ కోశ స‌మ‌స్య‌ల‌కు స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం కార‌ణంగా క‌నిపిస్తోంది. నియ‌మిత స‌మ‌యాల్లోనే ఆహారం తీసుకోవ‌టం, ప‌రిశుభ్ర‌త పాటించ‌టం, శుచి అయిన ఆహారాన్నే భుజించ‌టం వంటి అల‌వాట్లు చేసుకోవాలి. మ‌ద్య‌పానం, పొగ‌తాగ‌టం, బాగా మ‌సాలా ప‌దార్థాల్ని అమితంగా స్వీక‌రించ‌టం వంటి అల‌వాట్ల‌ను వదులుకోవాలి. కొత్త సంవ‌త్స‌రంలో ఇందుకు సంబంధించిన నిర్ణ‌యం తీసుకొని అమ‌లు చేస్తే ఆరోగ్యాన్ని ఆనందాన్ని కాపాడుకోవ‌చ్చు.