...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాలా..!

కొత్త సంవ‌త్స‌రం ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకొనే అల‌వాటు ఉంటుంది. ఇటువంటప్పుడు మంచి నిర్ణ‌యం తీసుకొంటే ఏడాది మొత్తం మంచిగా ఉంటుంది. అందుకే ఈ కొత్త సంవ‌త్స‌రం ఒక కొత్త నిర్ణ‌యం తీసుకోండి.
ఆహారం తినేట‌ప్పుడు వేళా పాలా లేకుండా తీసుకోవటం కొంత మందికి అల‌వాటు. మ‌రి కొంత మంది ఆయిల్ ఫుడ్స్ విప‌రీతంగా తింటుంటారు. ఈ కొత్త సంవ‌త్స‌రం ఈ అల‌వాటుకి సెల‌వు ప్ర‌క‌టించండి. ప్ర‌తీ రోజూ ఒక నిర్ణీత స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌టం ముఖ్యం. దీని వ‌ల‌న ఆయా స‌మ‌యాల‌కు జీర్ణ వ్య‌వ‌స్థ ప్రిపేర్ అవుతుంది. అప్పుడే స‌జావుగా ఆహారం జీర్ణం అవుతుంది. ఆయిల్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ ఎక్కువ‌గా తిన‌టం త‌గ్గించండి. దీని వ‌ల‌న కొవ్వు ప‌దార్థాలు పేరుకొనే స‌మ‌స్య త‌గ్గుతుంది.
ఆహారంలో తాజా కూర‌గాయాల‌కు, తాజా పండ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వండి. సాధ్యమైనంత‌గా వీటిని తినేందుకు ప్ర‌య‌త్నించండి.

దీని క‌న్నా ప్ర‌ధాన స‌మ‌స్య సీటునే అంటిపెట్టుకొని ప‌ని చేసే వారికి స‌మ‌స్య‌లు పొంచి ఉంటాయి. స్థూల‌కాయ స‌మ‌స్య కానీ, ఫాటీ లివ‌ర్స్ స‌మ‌స్య కానీ వెంటాడుతుంది. అందుచేత ఇటువంటి జీవ‌న శైలి ఉన్న వారు రోజులో కొంత స‌మ‌యం అయినా వ్యాయామానికి వెచ్చిస్తే మేలు. ఇందుకోసం ఒక షెడ్యూల్ పెట్టుకొని అయినా ప‌నిచేయాలి. వ్యాయామం త‌ప్ప‌నిస‌రిగా చేయ‌టాన్ని అల‌వాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
తాగు నీటిని దూరం పెడుతుంటారు. క్ర‌మ ప‌ద్ద‌తిలో తాగునీటిని తీసుకోవ‌టం ముఖ్యం. అలాగ‌ని అదే ప‌నిగా నీరు తాగ‌టం కూడా మంచిది కూడా సుమా..
స‌రైన ఆహార పాల‌న గురించి కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోండి. ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

No comments:

Post a Comment