వేసవి వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. ఎండల్లో తిరగక తప్పదు కదా. కానీ బాగా ఎండల్లో తిరిగినప్పుడు చాలా మంది చేసే చిన్న పొరపాటు ఏమిటంటే.. చల్లదనం కోసం వెంటనే బాగా కూల్ గాఉండే వాటర్ తాగేస్తారు. అప్పుడప్పుడ చల్లటి నీరు తీసుకోవటం వేరు.కానీ, బయట ఎండలో బాగా తిరిగినప్పుడు శరీరంలో ద్రవణ స్థితి తగ్గి ఉంటుంది. అప్పుడు బాగా కూల్ వాటర్ తాగితే అది మామూలు స్థితికి రావటానికి బాగా సమయం తీసుకొంటుంది. అందుకే బయట బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు మామూలు నీరు తీసుకోవటం మంచిది. నీళ్లు ఎక్కువ తాగటం అన్నది మంచిదే. చల్లటి నీరు తీసుకోవచ్చు. కానీ ఈ రెండు సూత్రాలు బాగా ఎక్కువైతే మాత్రం మంచిది కాదు. అదే పనిగా నీటిని లీటర్ల కొద్దీ పట్టించటం కూడా మంచిది కాదు. నియమితంగా కావలసిన నీరు తాగితే సరిపోతుంది. ఐస్ గడ్డలుఉన్న నీటిని తాగటం, రోజంతా కూల్ వాటర్ తాగుతూనే గడపటం అంత మంచిది కాదని గుర్తించుకోవాలి.
...
SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS
ఎండలు పెరిగాయిగా .. ఈ సంగతి మరిచిపోకండి..!
వేసవి వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. ఎండల్లో తిరగక తప్పదు కదా. కానీ బాగా ఎండల్లో తిరిగినప్పుడు చాలా మంది చేసే చిన్న పొరపాటు ఏమిటంటే.. చల్లదనం కోసం వెంటనే బాగా కూల్ గాఉండే వాటర్ తాగేస్తారు. అప్పుడప్పుడ చల్లటి నీరు తీసుకోవటం వేరు.కానీ, బయట ఎండలో బాగా తిరిగినప్పుడు శరీరంలో ద్రవణ స్థితి తగ్గి ఉంటుంది. అప్పుడు బాగా కూల్ వాటర్ తాగితే అది మామూలు స్థితికి రావటానికి బాగా సమయం తీసుకొంటుంది. అందుకే బయట బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు మామూలు నీరు తీసుకోవటం మంచిది. నీళ్లు ఎక్కువ తాగటం అన్నది మంచిదే. చల్లటి నీరు తీసుకోవచ్చు. కానీ ఈ రెండు సూత్రాలు బాగా ఎక్కువైతే మాత్రం మంచిది కాదు. అదే పనిగా నీటిని లీటర్ల కొద్దీ పట్టించటం కూడా మంచిది కాదు. నియమితంగా కావలసిన నీరు తాగితే సరిపోతుంది. ఐస్ గడ్డలుఉన్న నీటిని తాగటం, రోజంతా కూల్ వాటర్ తాగుతూనే గడపటం అంత మంచిది కాదని గుర్తించుకోవాలి.
క్యాన్సర్ అంటే భయమేలా..!
క్యాన్సర్ అంటే చాలా మందికి భయం. దీనికి మందు లేదని అనుకొంటారు. కానీ ఇది అపోహ. క్యాన్సర్ అనేది ప్రమాదకరం అనటంలో సందేహం లేదు. క్యాన్సర్ ముదిరిపోతే కాపాడటం కష్టం అనేది అంతే వాస్తవం. అయితే ఆధునిక వైద్య పరిశోధనల పుణ్యమా అని క్యాన్సర్ పై పరిశోధనలు బాగా పెరిగాయి. దీంతో చాలా వరకు క్యాన్సర్ కేసుల్లో చికిత్సలు సాధ్యం అవుతున్నాయి.
జీర్ణ వ్యవస్థలోని అనేక భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్ లతో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక క్యాన్సర్ అంటే అక్కడే పుట్టి, అక్కడే విస్తరించే క్యాన్సర్ లేదా ద్వితీయ క్యాన్సర్ అంటే వేరే చోట పుట్టి ఇక్కడకు వచ్చి తిష్ట వేసే క్యాన్సర్ లు ఉన్నాయి. అయితే ఈ క్యాన్సర్ లను ఫలానా లక్షణాలతో గుర్తించటం కష్టం. సాధారణంగా ఉండే లక్షణాలే కనిపిస్తాయి. కానీ రోగ నిర్ధారణ పరీక్షలతో గుర్తించవచ్చు.
అయితే క్యాన్సర్ నిర్ధారణ అయితే మాత్రం భయ పడిపోవాల్సిన అవసరం లేదు. నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే చికిత్స అందించేందుకు వీలవుతుంది. ఇటీవల కాలంలో ఆధునిక పరిశోధనలు, టెక్నాలజీ సాయంతో మెరుగైన చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు వీలవుతోంది. దీంతో క్యాన్సర్ ను అదుపు చేయటం వీలవుతోంది. మరీ ముదిరిపోయిన కేసుల్లో నాణ్యమైన శేష జీవితాన్ని అందించటం జరుగుతోంది.
మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!
వినటానికి అతి శయోక్తి
గా ఉన్నా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది.
చిన్న పాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం ముఖ్యం
అన్న మాట.
ఇవాళ వరల్డ్
హెల్త్ డే. ఈ సందర్భంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకొనే వారందరికీ శుభాకాంక్షలు.
ఇవాళ ఏడో తేదీ కాబట్టి ఏడు
ముఖ్య విషయాల్ని మననం చేసుకొందాం.
1. చేతుల శుభ్రత
చాలా ముఖ్యం. ఆహారం తినటం దగ్గర నుంచి రక రకాల పనులకు ఉపయోగిస్తాం. వీటిని
తరచుగా సబ్బు నీటితో శుభ్రం చేసుకొంటే వేలాదిక్రిములను దూరం పెట్టవచ్చు.
ముఖ్యంగా ఆహారం తీసుకొనే ముందు, మల మూత్ర విసర్జన
తర్వాత మరిచిపోకుండా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
2. గోళ్లను కత్తిరించుకోవటం
చాలా ముఖ్యం. లేదంటే క్రిములు అక్కడ స్థిరపడి, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
3. ఆహారం
తీసుకొనేందుకు సమయ పాలన పాటించాలి. అంటే ఉదయం టిఫిన్ తీసుకొనేందుకు, మధ్యాహ్నం మరియు రాత్రి ఆహారం తీసుకొనేందుకు
ఒకే రకమైన సమయాన్ని అనుసరించాలి.
4. ఆహారం సమతుల్యంగా
ఉండేలా చూసుకోవాలి. అంటే కేవలం పిండి పదార్థాలు,కొవ్వులేకాకుండా ప్రోటీన్స్ మరియు విటమిన్స్
ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి.
5. పని ఒత్తిడిలో
కొంత మంది విరేచనాన్ని వాయిదా వేస్తుంటారు. ఇది మంచిది కాదు, సకాలంలో తినటం, సక్రమంగా వ్యర్థాల్ని బయటకు పంపించండం
చాలా ముఖ్యం.
6. ఆహారం తిన్న తర్వాత
వెంటనే నిద్రకు ఉపక్రమించటం మంచిది కాదు. తేలికపాటి కదలికలతో ఆహారం సక్రమంగా
జీర్ణం అవుతుంది,కొవ్వులు
పేరుకోకుండా ఉంటాయి.
7. ఆహారంతో పాటు తగినంత
పరిణామంలో నీరు తాగుతూ ఉండాలి. మిగిలిన
వేళల్లో కూడా నీరు తాగటం మంచిది.
కావలిసిన వారికి కావలిసినంత..!
శరీరానికి శక్తి అందాలంటే ఆహారం తప్పనిసరి. అయితే ఆహారంలో అన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ దక్షిణ భారత దేశంలోని సాంప్రదాయిక కుటుంబాల్లో ఉదయం ఇడ్లీ, దోశ మధ్యాహ్నం అన్నం, సాయంత్రం కూడా అన్నం లేదా ఇడ్లీ లతో గడిపేస్తుంటారు. దీంతో చాలా మందిలో ప్రోటీన్ల లోపం ఉన్నట్లు చెబుతున్నారు.
శరీరానికి పిండి పదార్థాలు ఎంత అవసరమో, ప్రోటీన్లు కూడా అంతే అవసరం. శరీరంలో కండరాల పటిష్టతకు, అవయవ భాగాల పటిష్టతకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. శరీర బరువుకు తగినట్లుగా ప్రోటీన్లు తీసుకోవటం చాలా అవసరం. కానీ మనలో చాలా మంది ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో కొవ్వులు పేరుకొని పోయి ఊబకాయం రావటం, శరీర భాగాలు పటిష్టంగా లేకపోవటం సంభవిస్తుంటుంది. ఒక లెక్క ప్రకారం శరీరం ఎంత బరువు అంటే అన్ని గ్రాముల ప్రోటీన్లు ప్రతీ రోజు తీసుకోవాలని చెబుతారు. అంటే ఒక వ్యక్తి 60 కిలోల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్లు, లేదంటే కనీసం 50 గ్రాముల ప్రోటీన్లు అయినా తీసుకోవాలి.
మనం తీసుకొనే ఆహారంలో కోడి గుడ్డు లో అత్యధికంగా ప్రోటీన్లు లభిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా గుడ్డు ఇవ్వాలని చెబుతారు. పాలలో కూడా సమృద్ధిగా ప్రోటీన్లు లభిస్తాయి. మాంసం, చేపల్లో చిక్కటి ప్రోటీన్లు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకొంటే ప్రోటీన్లు పుష్కలంగా దొరకుతాయి. శాకాహారులైతే సోయా, చిక్కుళ్లు, బీన్స్ వంటి పీచు పదార్థాలు ఉండే కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. ప్రతీ రోజు కాకపోయినా వారం లో వీటి సంఖ్య అధికంగా ఉండేట్లు చూసుకొంటే మంచిది.
మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష..!
జాగ్రత్త ను మించిన తరుణోపాయం ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా సామాజిక అంశాల్లో చిన్న పాటి జాగ్రత్తలు కూడా భలే ఉపయోగ పడతాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ గురించి చర్చ బాగా జరుగుతోంది. వందల సంఖ్యలో కేసులు నమోదు కావటం, వేల సంఖ్యలో అనుమానాస్పద కేసులు ఉండటంతో ఇది కలకలం రేపుతోంది.
స్వైన్ ఫ్లూ అనేది వైరస్ ద్వారా వచ్చే రోగం. ఇది అంటు వ్యాధి. ప్రధానంగా పందులు సంచరించే చోట, వాటి నుంచి మనుషులు సంక్రమిస్తుంది. కానీ, స్వైన్ ఫ్లూ సోకిన రోగి దగ్గినా, తుమ్మినా .. వాటి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుచేత ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం మంచిది. అయితే దీని నివారణ కోసం చాలా మంది రక రకాల మాస్క్ లు ముక్కుకు ధరించి తిరిగేస్తున్నారు. నాణ్యత కలిగిన మాస్క్ లు అయితే బాగా పనిచేస్తాయి. దీన్ని ఎప్పటికప్పుడు మార్చేయటం మేలు. లేనిపక్షంలో చేతి రుమాలును 4 మడతలుగా వేసుకొని ధరించవచ్చు.
అంతకు మించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం చాలా ముఖ్యం. రోజుకి నాలుగైదు సార్లు చేతిని సబ్బుతో కడుక్కోండి. వ్యాధి కారక ప్రదేశాలు,అందరు వాడే బటన్స్ మీద ఎక్కువ వేళ్లను ఉపయోగించకండి. అపరిశుభ్ర ప్రాంతాల్లో ఆహారం తీసుకోవడాన్ని సాధ్యమైనంత దూరం పెట్టండి. సామాజిక శుభ్రత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి.
స్వైన్ ఫ్లూ కు ప్రస్తుతం టీకాలు దొరకుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మాత్రం కాదు. అవగాహన కలిగి ఉండే సరిపోతుంది.
ఈ రోజు ప్రాధాన్యం మీకు తెలుసు కదా..!
ఏ అంశం మీదనైనా అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ఆరోగ్య విషయాల్లో ఇది చాలా వాస్తవం. అందుకే అవగాహన కోసం ఇటువంటి ఆర్టికల్స్ ఎక్కువగా రాయటం జరుగుతోంది.
ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ అవగాహన రోజుగా పాటిస్తున్నాం. ఆకస్మిక మరణాలకు దారి తీస్తున్న క్యాన్సర్ నుంచి మానవాళిని సంరక్షించేందుకు, క్యాన్సర్ ముప్పును సాధ్యమైనంత తగ్గించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా దీన్ని పాటించటం జరుగుతోంది. దీన్ని మొదటగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ సంస్థ దీనికి నాంది పలికింది. 2008 లో దీనికి పూర్తి స్థాయిలో సాధికారత ఏర్పడింది. అప్పటి నుంచి క్యాన్సర్ అవగాహన రోజును పాటించటం జరుగుతోంది. 2020 నాటికల్లా సాధ్యమైనంత వరకు క్యాన్సర్ మరణాలు, క్యాన్సర్ ప్రాణాంతక పరిస్థితుల్ని తగ్గించే లక్ష్యంతో దీన్ని పాటిస్తున్నారు.
క్యాన్సర్ అంటే శరీరంలోని ఏదైనా భాగంలో పెరిగిపోతున్న అవాంఛిత కణజాలం అన్న మాట. అంటే శరీరంలో ఉండే సజీవ కణజాలాన్ని క్రమంగా నాశనంచేస్తూ ఆ ప్రాంతంలో ఈ కణజాలం తిష్ట వేస్తుంది. క్రమంగా ఇది కణితి గా మారి ఆ అవయవాన్ని కబళించి వేస్తుంది. ఫలితంగా అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. ఇది ఎముకలు, చర్మం, మూత్ర పిండాలు, గొంతు వంటి భాగాలతో పాటు జీర్ణ వ్యవస్థలోని ఆహార వాహిక, కడుపు, పేగులు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్పడుతుంటుంది.
జీర్ణ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్ లకు నిర్దిష్టంగా కారణం చెప్పలేం. దురలవాట్లు, ఇతర వ్యాధులు ముదరటం, జన్యు పరంగా లోపాలు, ఇతర కారణాలతో తలెత్తుతుంటుంది. దీనికి లక్షణాలు కూడా రక రకాలుగా ఉంటాయి. ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, నీరసం, చేతికి ఎత్తుగా తగలటం వంటి వాటితో పాటు గుర్తించాల్సిన సంకేతాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ లను స్కానింగ్,ఎక్సురే, బయాప్సీవంటి పరీక్షల తో గుర్తిస్తారు.
క్యాన్సర్ నిర్ధారణ అయితే చికిత్స వేగంగా ప్రారంభించాల్సి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్ లకు ర్యాడికల్ ఆపరేషన్ అవసరం అవుతుంది. అంటే స్పష్టంగా క్యాన్సర్ నిర్ధారణ అయిన భాగాన్ని గుర్తించి అక్కడి క్యాన్సర్ కణితిని పూర్తిగా తొలగించాలి. ముదిరిన దశలో ఆపరేషన్ తో పాటు కీమో థెరపీ, రేడియో థెరపీ వంటి చికిత్సలు అవసరం అవుతుంటాయి.
ఆధునిక వైద్య శాస్త్రం ద్వారా క్యాన్సర్ కు మందులు లభ్యం అవుతున్నాయి. ఇది ప్రాణాంతకం అనో, క్యాన్సర్ వస్తే మరణం ఖాయం అనో భయపడాల్సిన పని లేదు. చాలా వరకు క్యాన్సర్ కేసులు ఆపరేషన్ తర్వాత నయం అవుతున్నాయి. మరీ ముదిరి పోయిన కేసు్లో కూడానాణ్యమైన శేష జీవితాన్ని ఇచ్చేందుకు వీలవుతుంది. అందుచేత క్యాన్సర్ మీద అందరూ అవగాహన పెంచుకోవటం అవసరం.

Subscribe to:
Posts (Atom)