ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటే నమ్మగలరా..! అచ్చంగా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చేతులే చక్కటి మార్గం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడేది చేతులే. ఆహారాన్ని తీసుకోటానికి, ఇతరులతో చేతులు కలుపుకోవటానికి, విసర్జన సమయంలోనూ అరచేతులు వాడుకొంటాం. ఆహారాన్ని తీసుకొనేటప్పుడు అర చేతులపై ఉండే సూక్ష్మజీవులు కూడా లోపలకు వెళ్లిపోతాయి. ఆహారం చేసే మేలు మాట దేవుడెరుగు కానీ, ఈ సూక్ష్మ జీవులు చేసే హాని మాత్రం ఎక్కువే. ఈ సూక్ష్మ జీవులు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తాయి. సెంటర్ ఫర్ డీసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధనల ప్రకారం వ్యాధికారక సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించటంలో చేతుల శుభ్రత కీలక పాత్ర పోషిస్తుంది. ఆటలమ్మ, క్షయ, కామెర్లు వంటి ఎయిర్ బోర్న్ వ్యాధుల వ్యాప్తి ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.
చేతులు శుభ్రపరచుకోవటంలో అనేక పద్దతులు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా సాధారణమైన పద్దతులు. సబ్బుతో నీరు ఉపయోగించుకొని కడుక్కోవటం ఉత్తమమైన పద్దతి. చేతులకు సబ్బు పట్టించి 20 సెకన్లుఆహారం తీసుకొనేముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రం చేసుకొంటే చాలా వ్యాధికారకాల వ్యాప్తిని నిరోధించవచ్చు. కొన్నిసార్లు నేరుగా వేడినీటితో చేతుల్ని కడుక్కోవచ్చు. సబ్సు సాలిడి కానీ, లిక్విడ్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇటీవల కాలంలో హ్యాండ్ వాష్ వాడకం పెరిగింది. ఇది కూడా అభిలషణీయమే. చేతులు శుభ్రంగా నీటితో కడుక్కోవటం ఎంత ముఖ్యమో, ఆ తర్వాత చేతుల్ని తుడుచుకొని పొడిగా ఉంచుకోవటం కూడా అంతే ముఖ్యం.
సాధారణ పౌరులకు చేతుల శుభ్రత అవసరం. కానీ, చేత్తో లేబర్ పని చేసే కార్మిక సోదరులు, మెకానిక్ లు, వర్కర్లు వంటి వారికి ఇది మరింత అవసరం. అపరిశుభ్ర పరిస్థితుల్లో పని చేసే వారంతా గుర్తుంచుకోవలసిన విషయం. ఎక్కువ మంది ఒకే కంప్యూటర్ మీద పనిచేసే పరిస్థితి ఉంటే కీ బోర్డ్ మీద ఉండే సూక్ష్మి క్రిములు చేతి వేళ్లకు అంటుకొంటాయి. వీటి ద్వారా క్రిములు శరీరంలోకి వ్యాపిస్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆఫీసులోనే లంచ్ చేసే సిబ్బంది దగ్గర హ్యాండ్ వాష్ ఉంచుకోవటం మేలు. హోటల్స్ లో భోజనానికి వెళ్లినప్పుడు అక్కడ మరింత శుభ్రత పాటించాల్సి ఉంటుంది.
మంచి సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదాలు మరియు అభినందనలు!
ReplyDelete