చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లేప్పుడు టైమ్ టేబుల్ చెక్ చేసుకోవటం అందరికీ గుర్తుండే ఉంటుంది. టైమ్ టేబుల్ కు అనుగుణంగా బుక్స్ సర్దుకోవటం, హోమ్ వర్క్ వగైరా పూర్తి చేసుకోవటం అప్పట్లో తప్పనిసరి. ఇప్పుడు అదే టైమ్ టేబుల్ ను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో కూడా అంతర్గత అవయవాలకు ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఆయా భాగాలన్నీ ఒక టైమ్ ప్రకారం పని చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
ఆహారాన్ని తినటం మొదలు పెట్టగానే నోటిలో లాలాజలం ఊరుతుంది కదా. అప్పటి నుంచి లోపలకు ప్రవేశించాక, ఒక్కో అవయవాన్ని దాటుకొని వెళ్లేప్పుడు కొన్ని జీవ రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఇవన్నీ ఒక సమయానికి జరిగేట్లుగా లోపల బయో వాచ్ అమరి ఉంటుంది. ఆ సమయానికి ఆయా అవయవం అలర్టు గా ఉంటుంది. ఉదయం టిఫిన్ సమయం, మధ్యాహ్నం భోజన సమయం, సాయంత్రం స్నాక్స్ టైమ్, రాత్రి మళ్లీ ఆహారం తీసుకొనే సమయం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆహారం ఆయా అవయవంలో చేరుకొంటే చక్కగా జీర్ణం అవుతుంది. దీని వల్ల ఫలితం సక్రమంగా అందుతుంది.
ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో పడిన వారు ఈ సమయ పాలన పట్టించుకోరు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రక రకాల సమయాల్లో ఆహారం తీసుకొంటారు. దీని వల్ల ఈ బయో వాచ్ సమయ పాలన పాడవుతుంది. అటువంటి సమయాల్లో శరీరంలో జీవ రసాయన ప్రక్రియలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది ని తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఒకే సమయంలో ఆహారం తీసుకొనే అలవాటు చేసుకోవటం మేలు.
No comments:
Post a Comment