ఇటువంటి ప్రశ్న అడగటం సభ్యతగా ఉండదు. ఎందుకంటే చిన్నతనం నుంచి అందరికీ అలవాటైన పని గురించి ప్రశ్నించటం తప్పు. అయినప్పటికీ, ఆరోగ్యకరంగా ఆహారాన్ని తీసుకోవటం అన్నది ముఖ్యం. తిన్నామంటే తినటం, తిరిగామంటే తిరగటం అన్నది సరైన విధానం కాదు. ఆహారం తీసుకొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..
1. ఆహారం తీసుకొనే ముందు ప్రశాంతత అవసరం. హడావుడి పడకుండా, నెమ్మదిగా భుజించాలి.దాదాపుగా 20 నిముషాల వ్యవధిలో ఆహారం తీసుకొంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీవీ చూస్తూ, సీరియల్స్, సినిమా్ల్లో లీనం అయి ఆహారం తీసుకోవటం సరికాదు. కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కలిసి కానీ ఆనందకరంగా ఆహారం తీసుకోవటం ఉత్తమం.
2. ఆహారం తీసుకొనేముందు ఒక గుక్క నీటిని తాగాలి. తర్వాత కనీసం రెండుసార్లు అయినా కొద్ది పాటి నీరు తాగాలి. దీని వల్ల ఆహారం చక్కగా మిశ్రమం అవుతుంది.
3. ఆహారంలో ఒకే రకమైన ఫుడ్ మంచిది కాదు. కూరలు, పచ్చడి, సాంబారు వంటి వెరైటీలు అనుకోవద్దు. పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి. విటమిన్స్, లవణాలు, సూక్ష్మ పోషకాలు కూడా తప్పనిసరి.
4. ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడకూడదు. విభిన్న రకాలు ఆహార పదార్థాలతో సమ్మిశ్రితంగా భుజించాలి.
5. నచ్చిన ఆహారం విపరీతంగా తినటం, నచ్చకపోతే దూరం పెట్టడం అంత మంచిది కాదు. ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి.
6. ఆహారం లో కడుపు నిండటం ముఖ్యం. అంటే కడుపులో సగం వరకు ఘన ఆహారం, పావు వంతు ద్రవం ఉండాలి. మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంటే చక్కగా జీర్ణం అవుతుంది.
7. భోజనంలో పండ్లు, కూరగాయలు ఉంచుకొంటే బాగుంటుంది.
8. ఆహారం ఒకే సారి ఎక్కువగా తీసుకోవద్దు. మితంగా నాలుగైదు విడతలుగా తీసుకోవటం మేలు.
9. భోజనం తర్వాత సరిపడినంత నీరు తీసుకోవాలి.
10. రాత్రి భోజనం తర్వాత కనీసం 100 నుంచి 200 అడుగులు నడవాలి. కనీసం అరగంట వ్యవధి తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
No comments:
Post a Comment