ఆహారంలో ఐదు రకాల అమృతాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా..ఆహారం చక్కగా జీర్ణం అయి, శరీరంలో చక్కగా శక్తి కలిసి పోతే అది అమృతమే అవుతుంది కదా..దీన్ని బట్టి చూస్తే ఐదు రకాల ఆహారాలు తేలిగ్గా జీర్ణం అవుతాయని గుర్తించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
1. అన్నం.. చూడటానికి సాదా సీదాగా ఉన్నా అన్నం .. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం. కూరలు, సాంబారు వంటివే గాకుండా పాలు, పెరుగు వంటి వాటితో కలుపుకొని అన్నం తింటూ ఉంటారు. అయితే ఏ పదార్థంతో కలిపినా కానీ, అన్నం స్వభావ రీత్యా తేలిగ్గా జీర్ణం అయ్యే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సూక్తి జనించి ఉంటుంది. అన్నం ద్వారా ఎక్కువగా పోషక పదార్థాలు శరీరానికి సమకూరతాయి.
2. చికెన్.. మాంసాహారంలో చికెన్ త్వరగా జీర్ణం అయ్యే లక్షణం కలిగి ఉంటుంది. మటన్, చేపలు, పీతలు వంటి వాటికి గట్టి జీర్ణ స్వభావం ఉంటుంది. చికెన్ ను తేలిగ్గా జీర్ణించుకోవచ్చు. పైగా భారత్ వంటి దేశాల్లో ఇది కామన్ గా ఉండే నాన్ వెజ్ డిష్. పల్లెల్లో, పట్టణాల్లో కూడా విరివిగా దొరికే మాంసాహారం ఇది.
3. సూప్.. బోజనంలో చారు, రసం వంటివి జోడించుకోవటం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆహారానికి మొదటగా కొంచెం సూప్ తీసుకోవటం మోడర్న్ మెనూ లో తప్పనిసరి. రుచిగా ఉండటంతో పాటు ఇందులో ఇంకో పరమార్థం కూడా ఉంది. కొంచెం కారం, కొంచెం ఉప్పగా ఉండే సూప్ తీసుకోవటంతో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు క్రియాశీలకంగా మారతాయి. దీంతో తర్వాత తీసుకొనే ఆహారంలోని అన్ని రుచులు చక్కగా తెలుస్తాయి. ఫలితంగా అన్ని రుచుల్ని ఆస్వాదించేందుకు వీలవుతుంది.
4. పండ్లు.. ఆహారంలో పండ్లు, పండ్ల ముక్కలు వంటివి జోడిస్తే చక్కగా జీర్నం అవుతాయి. అంతే గాకుండా పండ్లను తీసుకొంటే జీర్ణాశయం శుభ్ర పరచుకొనేందుకు వీలవుతుంది. పండ్ల లో ఉంటే కొన్ని రకాల జీవ రసాయనాలు యాక్టివేటర్స్ గా ఉపకరిస్తాయి. పండ్లను సలాడ్ గా, పండ్ల రసాలుగా, చిన్న ముక్కలుగా తీసుకొనే అలవాటు ఉన్నది.
5. ఆకు కూరలు... ఆకు కూరలు, ఆకులతో కూడిన క్యాబేజీ వంటివి పోషక విలువలు కలిగి ఉంటాయి. అంతేగాకుండా త్వరగా పచనం అవుతాయి. ఈ ఆకు కూరలను జోడించటంతో ఆహారం చక్కటి పోషక సమతుల్యత కలిగి ఉంటుంది.
No comments:
Post a Comment