డమరుకం ఎందుకు ఆగిపోతోందంటే..!
డమరుకం అన్న పదం వింటేనే శక్తి జనిస్తుంది. సమాజంలో శక్తిని జ్వలింప చేసేందుకు పూర్వకాలంలో డమరుకాన్ని వాడే వారు. డమరుకం మోగుతుంటే ఆ చుట్టుపక్కల అందరిలో ఉత్తేజం కలుగుతుంది. డమరుకం అనేది శక్తి కి కేంద్ర బిందువు అని కూడా అనుకోవచ్చు.
సరిగ్గా శరీరంలో కూడా ఇటువంటి శక్తిని అందించే అవయవం ఒకటి ఉంది. అదే కాలేయం. శరీరంలోని అన్ని భాగాలకు శక్తిని ప్రసరింప చేయటంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. అటువంటి ముఖ్యమైన భాగాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ పాయింట్ అర్థం కావాలంటే ఎటువంటి పనుల వల్ల కాలేయం చెడిపోతుందో తెలుసుకోవాలి. మద్యం కాలేయానికి ప్రధాన శత్రువు. ఆల్కహాల్ తీసుకోవటం వలన కాలేయ కణాలు పాడై పోతాయి. కలుషిత నీటిని తాగటం, సురక్షితం కాని రక్తాన్ని తీసుకోవటం వంటివి కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. వీటి వలన వ్యాధి కారక వైరస్ లు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్ లు శరీరంలోకి చేరాక కాలేయ కణాల మీద దాడి చేస్తాయి.
కాలేయానికి జరిగే అనర్థాన్ని నాలుగు దశల్లో చెబుతారు. కాలేయ ఇన్ ప్లమేషన్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, క్యాన్సర్. మొదటి రెండు దశల్లో కాలేయం పని తీరు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. అటువంటప్పుడు మందులతో చికిత్స చేయటం సాధ్యం అవుతుంది. కానీ సిర్రోసిస్ దశకు, క్యాన్సర్ దశకు చేరితే మాత్రం కాలేయం రూపం మారిపోతుంది.ఇటువంటి దశలో మందుల కన్నా కీమో థెరపీ, రేడియో థెరపీ వంటి చికిత్స లతో పాటు శస్త్ర చికిత్స అవసరం అవుతుంది. వ్యాధి ముదిరిపోతే కాలేయాన్ని మార్చాల్సి ఉంటుంది. (దీని వివరాలు తర్వాత పోస్ట్ లో చూద్దాం..)రోగం ముదరక ముందే నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొంటే శరీరంలో డమరుకం అనదగ్గ పవర్ హౌస్ కాలేయాన్ని ఆగకుండా పని చేయించుకోవచ్చు.

No comments:
Post a Comment