తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే. ఈ మాట ఎవరూ కాదనరు. కానీ శిక్ష దాకా వచ్చే దాకా పరిస్థితి తెచ్చుకోవటం మాత్రం సరికాదు. ఇందుకు ఆరోగ్యం కూడా మినహాయింపు కాదు. ఆరోగ్య విషయంలో కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మానవ శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణక్రియలో దోహద పడటంతో పాటు, రక్తం పునర్ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రోటీన్ ల సంశ్లేషణలో ఉపకరిస్తుంది. కానీ, మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో ఈ ముఖ్యమైన అవయవం పాడై పోతుంది. మొదట్లో ఇది కొద్ది గా మొదలవుతుంది. రోజూ కొంచెం తాగుతున్నాం కదా, అప్పుడప్పుడు తాగుతున్నాం కదా అని కొందరు భావిస్తారు. కానీ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించాక అది అసిటాల్డిహైడ్ అనే విష పదార్థ రూపంలో కి మారిపోతుంది. అటువంటప్పుడు కాలేయ కణాల్ని ఈ విషం నాశనం చేస్తుంది. మొదట్లో ఇది కొంచెంగా ప్రారంభం అవుతుంది. అటువంటప్పుడే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. చికిత్స తో పాటు మద్యం తాగే అలవాటు వెంటనే మానుకోవాలి. అప్పుడే మందులు సక్రమంగా పని చేయగలుగుతాయి. లేదంటే కాలేయం కణాలు పాడవటం మొదలైతే, క్రమంగా కొంత భాగం కాలేయం నిర్వీర్యం కావచ్చు. ఈ స్థితిని సిర్రోసిస్ అని పిలుస్తారు.ఈ దశకు కాలేయం చేరుకొంటే చికిత్స చాలా కష్టం. శస్త్ర చికిత్స మార్గాల్ని అనుసరించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు మాత్రమే ఈ ఆపరేషన్ లు చేయగలుగుతారు. పరిస్థితి అంత దాకావస్తే మాత్రం కఠిన శిక్షగానే భావించాలి. అంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం మేలు.
నమస్కారం! మంచి ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వృత్తులలోని వారు మరింత ఎక్కువ మంది తెలుగు బ్లాగులు రాయాలని మనసారా కోరు కునేనాకు మీ బ్లాగు చూసి చాలా సంతోషం కలిగింది. డాక్టర్లు ఎక్కువ మంది తెలుగు బ్లాగులలో అందుబాటులో లేరు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మరింత ఎక్కువమందిని బ్లాగు వేదిక పైకి తీసుకు వచ్చేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
ReplyDelete