వినటానికి గమ్మతుగా ఉన్నా ఈ విషయం ఆలోచించి తీరాల్సిందే. రోజూ అలవాటుగా చేసే పనికి శరీరం అలవాటు పడిపోయి ఉంటుంది. అది మంచి పని అయినా, చెడ్డ పని అయినా బాడీ - ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అటువంటి పనిని సడెన్ గా వదిలేస్తే శరీరం అంతా వేగంగా ఆ అలవాటుని వదిలేసుకోలేదు.
ఉదాహరణకు రోజూ విపరీతంగా మద్యం తాగే వ్యక్తి లో ఇటువంటి సమస్య తలెత్తుతుంది. చాలా కాలం మద్యం తాగే వారిలో ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాలకు శరీరం అలవాటు పడిపోయి ఉంటుంది. అటువంటి అంత్య ఉత్పన్నాలు ఒక్కసారిగా ఆగిపోతే శరీరంలో రివర్స్ చర్యలు మొదలవుతాయి. ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాలను పోలిన కణజాలాన్ని శరీరం రూపొందిస్తుంది. ఈ పదార్థంతో కొత్త రకం సమస్యలు పుట్టుకొని వస్తాయి. అందుచేత రోజూ విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా బ్రేక్ వేయకుండా కొంచెం క్రమంగా ఈ అలవాటునుంచి బయట పడటం మంచిది. ఏది ఏమైనా ఈ అలవాటుని పూర్తిగా వదులుకోవటమే ఉత్తమం అని గుర్తుంచుకోవాలి.
మద్యం తాగే వారిలో ఉన్న మరో అపోహ ఏమిటంటే తక్కువ మోతాదులో తాగుతున్నాను కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదని వాదిస్తుంటారు. ఇది సరి కాదు. ఎందుచేతనంటే మద్యం తాగేందుకు ఇంత పరిమితి ఉంది అన్న నిర్ధారణ ఏమాత్రం లేదు అనవసరంగా అటువంటి ప్రమాణాలు పెట్టుకోకపోవటం మేలు. ఎంత మోతాదులో తీసుకొన్నా జరగాల్సిన అనర్థం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. పైగా అప్పుడప్పుడు తాగినా కూడా ఆల్కహాలిక్ విష పదార్థాలు చెడు ప్రభావమే చూపుతాయని గుర్తెరగాలి.
No comments:
Post a Comment