శని, ఆది వారాలు వచ్చాయంటే ఉద్యోగులకు ఊరట అనుకోవచ్చు. వారం మొత్తం కష్టపడి పనిచేస్తే వీకెండ్స్ లో హాయిగా గడపటం అన్నది పాశ్యాత్య దేశాల నుంచి దిగుమతి అయిన అలవాటు. అంత వరకు బాగానే ఉంది కానీ, హాయిగా గడపటం ఎలా అన్న చోటే అసలు చిక్కంతా..! విదేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి అలవాట్లు అక్కడివి. వాటిని మనం అనుకరించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఒక అద్యయనం ప్రకారం మన రాష్ట్రంలో శని, ఆది వారాల్లో మద్యం విపరీతంగా అమ్ముడవుతోందని తెలిసింది. వీకెండ్ పేరుతో మన ప్రజానీకం పీపాల కొద్దీ తాగేస్తోందన్న మాట. మద్యం తో వచ్చే అనర్థాల గురించి తెలుసుకొంటే భలే విషయాలు బయట పడతాయి. నోటిలో మద్యం ప్రవేశించిన చోట నుంచి అంతిమంగా పదార్థాలు బయటకు వెళ్లే దాకా నష్టం చేస్తూనే ఉంటుంది.
1.మద్య తాగటం మొదలెట్టగానే విష పదార్థాలు నోరంతా వ్యాపిస్తాయి. ఫలితంగా నోటి క్యాన్సర్ కు దారి తీయవచ్చు. పొగ తాగే అలవాటు తర్వాత ఎక్కువ నోటి క్యాన్సర్ మద్యం తో వస్తుందని తేలింది. ఒక వేళ ఈ రెండు అలవాట్లు ఉంటే మాత్రం నోటి క్యాన్సర్ అవకాశాలు బాగా విపరీతం అనుకోవచ్చు. కొంతమందిలో చిగుళ్ల సమస్యలకు దారి తీయవచ్చు.
2. గొంతు నొప్పి... మద్యం గొంతు లో ప్రవేశించాక స్వర పేటిక ద్వారా లోపలకు వెళుతుంది. ఆ సమయంలో ఆక్కడ ఉండే స్రావాల మీద ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు శ్వాస నాళాల్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు.
3. కడుపులోకి మద్యం దిగాక అది అక్కడ కొంత సేపు ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయానికి లోపల ఉండే స్రావకాల పొర ను దెబ్బ తీయవచ్చు. దీంతో గ్యాస్ట్రిటిస్ అనే సమస్య తలెత్తవచ్చు.
4. కొన్ని అధ్యయనాల ప్రకారం కడుపు క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ కు మద్యపానం ఒక కారణం అని చెబుతారు.
5. మద్యం కడుపులో ఉండటం తో ఆకలి మీద ప్రభావం చూపుతుంది. దీంతో అన్ని రకాల పోషకాల్ని తీసుకోవటం తగ్గిపోతుంది. ఇది అంతిమంగా అనారోగ్యానికి దారి తీస్తుంది.
6. జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉండే కాలేయం, క్లోమం మీద మద్యం విపరీతమైన దుష్ప్రభావాలు చూపుతుంది. ఈ వివరాలు చర్చించాం.
7. కొన్ని విష పదార్ధాలు పేగుల ద్వారా శరీర భాగాలకు చేరే అవకాశం ఏర్పడుతుంది. దీన్ని సాంకేతికంగా లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. దీంతో తీవ్ర అనారోగ్యం ఏర్పడవచ్చు.
8. మద్యం తాగటంతో విరోచనాలు, వాంతులు వంటి సాధారణ అనారోగ్యం తలెత్తవచ్చు.
మద్యం తాగే అలవాటు తో నాడీ వ్యవస్థ లో ఇబ్బంది ఏర్పడి ప్రవర్తన మారిపోతుందన్న సంగతి తెలిసిందే. దీని వల్ల తలెత్తే ఇబ్బందులు తెలిసినవే. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే మద్యం తాగేందుకు పూర్తిగా దూరంగా ఉండటం మేలు. వీక్ డేస్, వీకెండ్ అన్న తేడా లేకుండా పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం.

videshala nunchi manchi nerchukoka poyinaa mandu alavatu nerchukuntunnaru
ReplyDelete