వీకెండ్ వచ్చిందంటే బయటకు వెళ్లి ఫుడ్ తీసుకోవటం ఈ మధ్యకాలంలో పెరిగింది. వీకెండ్ సమయంలో ఇటువంటి అలవాట్ల లో తప్పు లేదు. కానీ, ఈ ఫుడ్ లోఏమి తీసుకొంటున్నామన్నది మాత్రం ముఖ్యం. ఇప్పుడు ఈ విషయమే గమనించ దగిన విషయం. ఈ మధ్య కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు.
బయటకు వెళితే చాలు ఆయిల్ తో కూడిన ఫుడ్‌ను తీసుకొంటున్నారు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండటం దురదృష్టకరం. పిజ్జాలు, బర్గర్లు రెగ్యులర్ గా తీసుకొంటున్నారు. ఇటువంటి జంక్ ఫుడ్ అప్పుడప్పుడు అయితే ఫర్వాలేదు కానీ క్రమం తప్పకుండా తినటం మాత్రం మంచిది కాదు. దీని వల్ల కడుపులో జీర్ణం కావటం కష్టం అవుతుంది.
పలితంగా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ కడుపు నొప్పి రక రకాల మందులు వాడేస్తుంటాం కానీ, అసలు సంగతి గుర్తించటం మరిచిపోతాం. ఈ జంకు ఫుడ్ ను ఆపగలిగితే కొన్ని కేసుల్లో కడపు నొప్పి మాయం అవుతుండటం గమనించటం జరిగింది. అందుచేత జంక్ పుడ్ ను అదుపు చేయంటం చాలా ముఖ్యం అని గుర్తించాలి.
No comments:
Post a Comment