ఎటో వెళ్లిపోయింది మనస్సు... ఈ పదబంధం భలే ఉంది కదా నిజంగానే మనస్సు అనే దానికి కళ్లెం ఉండదు. అది ఎటు కావాలంటే అటు పరిగెడుతుంటుంది.దీన్ని ఎంత ఆహ్లాదంగా ఉంచుకొంటే అంత చక్కగా పనులు చక్కబెట్టుకోవచ్చు. దీన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం అన్నది మన చేతిలో పని.
ఈ మధ్య కాలంలో మనుషుల మీద ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఆధునిక జీవనశైలి, వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్ లు, ప్రయాణం వంటి పనుల్లో చికాకు పెరిగి పోతున్నాయి. వాస్తవానికి ఈ విధంగా టెన్షన్ పడినప్పుడల్లా శరీరంలో ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ రాడికల్స్ క్రమంగా నెగటివ్ ప్రబావాన్ని చూపుతుంటాయి. టెన్షన్ పెరిగే కొద్దీ వీటి సంఖ్య పెరిగిపోయి మెదడు మీద అంటే మనస్సు మీద ప్రభావం చూపుతుంటాయి. దీన్ని తట్టుకోలేక పగటి పూట టీ విపరీతంగా తాగే వారు కొందరైతే సాయంత్రానికల్లా మద్యాన్ని ఆశ్రయించే వారు మరికొందరు. ఈ టీలు తాగటం, మద్యం తాగటం వలన ఏర్పడే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఈ డ్యామేజీ కి అడ్డుకట్ట వేయాలంటే టెన్సన్ పడటాన్ని తగ్గించుకోవాలి. ఇందు కోసం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మనస్సు ఎటూ వెళ్లి పోకుండా ఉంటుంది.
సార్ మీరు ఇలా ఆరోగ్య విషయాల గురించి బ్లాగ్ లో రాయడం చాలా ఆనంధంగా ఉంది.
ReplyDelete