లావు పెరుగుతుంటే ఎవరికైనా ఇబ్బందే. దీన్ని ముందుగానే గుర్తించక పోతే తర్వాత కాలంలో సమస్యలు తలెత్తుతాయి. చాలామంది స్తూల కాయం వలన చూపరులకు ఇబ్బంది ఉంటుంది అని భావిస్తారు. అది మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. స్థూల కాయుల్లో కొవ్వు పేరుకొని పోవటం వలన రక్త ప్రసరణ, జీర్న క్రియ వంటి జీవన క్రియలు సక్రమంగా పని చేయవు.
కొవ్వు పేరుకోవటం వలన కొలెస్టిరాల్ శాతం పెరుగుతుంది. దీని వలన రక్తం సరఫరా సక్రమంగా జరగదు. అందాల్సిన ప్రాంతంలో రక్తం సక్రమంగా అందక పోవటం వలన అక్కడకు శక్తి సరిగ్గా అందదు. అందుకే స్థూల కాయులు కాస్త ఎక్కువ పని చేసినా, కాస్త ఎక్కువ దూరం నడిచినా అలసి పోతారు. ఆయాస పడతారు. ఎందుచేతనంటే ఆ పనుల కోసం కావాల్సిన శక్తి ఉత్పత్తి కాదు. మరో వైపు నాళాలు మందంగా తయారవటం అన్నది స్థూల కాయుల్లో తలెత్తే మరో సమస్య. దీంతో ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది.
స్థూల కాయులకు మధుమేహం పొంచి ఉంటుంది. శరీరంలో సక్రమంగా గ్లూకోజ్ ప్రసరణ లేక పోవటం వలన దీన్ని గుర్తిస్తారు. కొ్వ్వులు పేరుకొని పోవటం వలన క్లోమం పనితీరు దెబ్బ తింటుంది. దీని కారణంగా ఇన్సులిన్ స్రావంలో సమస్య తలెత్తి అంతిమంగా మధుమేహానికి గురి కావాల్సి వస్తుంది. ఒక్క సారి మధుమేహం తలెత్తితే అది శాశ్వత సమస్య అని తెలసుకోవాలి. జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవటం తో పాటు మందులు వాడాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు.
స్థూల కాయులకు శరీర భాగాల్లో కొవ్వు పేరుకొని పోతుంది. రక్త ప్రసరణ అన్నది చురుగ్గా జరగాల్సిన ప్రక్రియ. కానీ అనవసరపు పదార్థాల నిల్వలు పేరుకొని పోవటం వలన గుండె కు సంబంధించిన రక్త నాళాల్లో సమస్య తలెత్తుతుంది. దీంతో ఆయా నాళాల్లో రక్తపు పంపింగ్ కోసం ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తి డి అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే కరోనరీ సంబంధిత సమస్యలతో పాటు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
శరీర ఆకృతికి మూలంగా ఎముకలతో కూడిన అస్థి పంజర వ్యవస్థ ను చెప్పవచ్చు. ఈ అస్థి పంజరం తగిన బరువును మోసేందుకు డిజైన్ చేయబడి ఉంటుంది. కానీ బరువు అదే పని గా పెరిగిపోతుంటే మాత్రం ఈ ఎముకల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అటు నాడుల పని తీరు మీద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.
ఇన్ని సమస్యలకు కారణమైన స్థూల కాయం అన్నది చాలావరకు స్వయంకృతం. ఎక్కువ ఫుడ్ తీసుకోవటం వలన ఈ సమస్య తలెత్తుతుంది. అందుచేత స్థూల కాయాన్ని తగ్గించుకొనేందుకు ఎవరికి వారు ప్రయత్నించాలి. అప్పుడే పైన చెప్పిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడేందుకు వీలవుతుంది.

No comments:
Post a Comment