రాళ్లు అంటేనే నెగటివ్ పదం. అటువంటి రాళ్లు ఎక్కడ ఉన్నా వాటిని నెగటివ్ గానే చూస్తాం.. సరిగ్గా ఈ సూత్రం మనిషి కి వర్తిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్లు చేసే కీడు అంతా ఇంతా కాదు.
మానవ శరీరంలో కొన్ని భాగాల్లో రాళ్లు పేరుకొనే చాన్స్ ఉంటుంది. ఆహారంలో ఆయిల్ పుడ్స్, కొవ్వు కారకాలు ఎక్కువగా తీసుకొంటే వీటి వలన ఆయా ఉత్పన్నకాలు ఘన రూపంలోకి మారతాయి. వీటినే మామూలు భాషలో రాళ్లు పేరుకొన్నాయి అంటారు. మూత్రపిండాలు, పిత్తాశయం వంటి చోట్ల వీటిని మనం గమనించవచ్చు. ఇవి శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలకు అడ్డుగా నిలుస్తాయి. ఒక వైపు శరీరం తన మెటబాలిక్ క్రియల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కానీ ఈ రాళ్లు వాటికి అడ్డు పడుతుంటాయి. దీంతో నొప్పి జనిస్తుంది. మొదట్లో ఈ నొప్పి ఎందుకు వస్తోందో తెలీదు. కానీ తరచు ఈ నొప్పి వస్తుంటే అప్పుడు తీవ్రత తెలుస్తుంది. చాలామంది కడుపులో నొప్పి అంటే ఏదో మాత్రలు వేసుకొని, ఇంటి వైద్యం చేసుకొంటూ ఉంటారు.కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య తీవ్రం అవుతుంది. అంటే ఈ రాళ్లు పేరుకోవటం మొదట్లో అయితే సాధారణ మందులతో తగ్గిపోతుంది. అలా వదిలేస్తే శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది. ఆయిల్ ఫుడ్ తరచు తీసుకొనే వారికి మొదట్లో అంతా ఓకే అనిపిస్తుంది. కానీ తర్వాత కాలంలోనే రాళ్లు పడుతుంటాయి. అందుచేత ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త అవసరం.
No comments:
Post a Comment