మంట అనే పదమే కొంత విచిత్రంగా ఉంటుంది. మండే స్వభావాన్ని వ్యక్తీకరించే పదం ఇది. ఈ పదం వినగానే దాని స్వభావం అర్థం అయిపోతుంది.
ఈ మంట పుట్టడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. ఒకే నిర్దిష్ట కారణాన్ని మనం చెప్పలేం కానీ, ప్రధానంగా ఆధునిక జీవన శైలిలో ఉండే ఒత్తిళ్లతో మంట పుట్టడం అన్నది కామన్ గా మారింది.
శరీరంలో ఆహార పదార్థాలు ప్రవేశించగానే జీర్ణాశయంలోని గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. వీటి నుంచి ఎంజైమ్ లతో పాటు హైడ్రో క్లోరిక్ ఆమ్లం స్రావితం అవుతుంది. ఇది ఆహారాన్ని ఖైమ్ గా మార్చేందుకు అవసరమైన ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. అప్పుడు మాత్రమే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పని చేస్తాయి. కానీ, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోతే సమస్య తలెత్తుతుంది. ఆధునిక లైఫ్ స్టయిల్ లో ఒక టైమ్ కు తిండి తినటం అన్నది మరిచిపోతున్నారు. దీంతో ఏదో ఒక టైమ్ లో ఏదో ఒక ఫుడ్ తినటం ఎక్కువ అయింది. దీని వలన ఎప్పుడు గ్రంథులు స్రవించాలో తెలీక, సమయం వచ్చినప్పుడల్లా ఎంజైమ్‌లు, ఆసిడ్స్ బయటకు వస్తుంటాయి. కానీ, జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోతే మాత్రం ఈ ఏసిడ్ కు తగినంత పని ఉండదు. అప్పుడు ఈ ఆమ్లం జీర్ణాశయ గోడల మీదనే ప్రభావం చూపుతుంది. సరిగ్గా ఈ కారణం వల్లనే ఈ మధ్య కాలంలో చాలామందిలో కడుపు మంట సమస్యను గుర్తించటం జరిగింది.
దీన్ని అరికట్టాలంటే ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. సరైన టైమ్ కు సరైన ఆహారం తీసుకొనేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం టైమ్ షెడ్యూల్ ఫాలో అయితే మంచిది. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఎసిడిటీ కి విరుగుడు మందుల్ని వాడే ముందు వైద్య సలహా తీసుకోవటం మేలు.
No comments:
Post a Comment