స్థూలకాయాన్ని గుర్తించటానికి ప్రధానంగా బాడీ మాస్ ఇండెక్స్ మీద ఆధారపడతారు. మనిషి బరువు ని కిలోగ్రాముల్లో గణించాలి. ఎత్తుని మీటర్ల లో కొలిచి దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ ఫలితంతో బరువు ని భాగించాలి. ఫలితాన్ని బాడీ మాస్ ఇండెక్సుగా చెబుతారు. ఈ బాడీ మాస్ ఇండెక్సు ఎంత ఉంది అనే దానిపై స్థూలకాయం గణించి చెప్పవచ్చు. ఈ బాడీ మాస్ ఇండెక్సు 18.5 కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు కలిగి ఉన్నట్లు లెక్క. 18.5 నుంచి 25 పాయింట్ల దాకా ఉంటే సక్రమమైన బరువు ఉన్నట్లు లెక్క. 25 నుంచి 30 దాకా ఉంటే ఎక్కువ బరువు ఉన్నట్లన్న మాట. 30 నుంచి 35 దాకా ఉంటే టైప్-ఒన్ స్థూలకాయం, 35 నుంచి 40 దాకా ఉంటే టైప్-టూ స్థూలకాయం, 40 దాటి ఉంటే టైప్ - త్రీ స్థూలకాయం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
స్థూల కాయాన్ని నడుము కొలతను బట్టి కూడా చెబుతారు. ఆరోగ్యవంతుడైన పురుషుల్లో నడుము కొలత 90 సెం.మీ., మహిళల్లో 80 సెం.మీ. వరకు ఉండవచ్చు. పురుషుల్లో 102 సెం.మీ. దాటితే ప్రమాదం అనీ, మహిళల్లో 88 సెం.మీ. దాటితే మాత్రం ప్రమాదం అని చెబుతారు.
స్తూల కాయం అన్నది ఎవరికి వారు లెక్క చూసుకోవచ్చు. బరువు కాస్త ఎక్కువగా ఉంటే వ్యాయామం, ఆహార జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. మరీ ఎక్కవ ఉంటే మాత్రం వైద్యుల సలహాతో సర్జరీ, నాన్ సర్జరీ ట్రీట్ మెంట్ లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో సురక్షితమైన చికిత్సను పొంది, బరువు ను తగ్గించుకొని చక్కటి శరీర ఆకృతి ని పొందవచ్చు.
No comments:
Post a Comment