అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఒక్కో పరిస్థితి బయట పడుతుంది. దీన్ని బట్టి ఫలితం ఉంటుంది. కడుపు లో మంట పుట్టడానికి కారణాలు అనేకం ఉంటాయి. మంట లేక నొప్పి ఎందుకు వస్తోందో చూసుకోవాలి. అప్పుడే కడుపు మంట కు కారణం తెలుస్తుంది. సాధారణంగా అజీర్తి వలన, ఎక్కువ ఆహారం తినటం వలన, సరైన నిద్ర లేక పోవటం వలన, టెన్షన్ ఎక్కువగా పడటం వలన నొప్పి వస్తుంటుంది. ఇది తేలిక పాటి కడుపు నొప్పి. వంటింటి చిట్కాలతో ఈ నొప్పి కి నివారణ చేసుకోవచ్చు.
కడుపు మధ్య భాగంలో నొప్పి జనించి, కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే అపెండిక్సు నొప్పి గా చెబుతారు. ( చిన్న పేగు, పెద్ద పేగు కలిసే చోట చిన్న సంచీ మాదిరిగా ఉండే అవశేషావయవమే ఉండుకం. దీంట్లో ఇన్ ఫెక్షన్ వస్తే అది అపెండిక్సు నొప్పి.) సాధారణంగా ఈ నొప్పి వస్తే సాధ్యమైనంత తొందరగా చికిత్స చేయాల్సి ఉంటుంది.
కడుపు లో ఎడమ వైపు లో నొప్పి మొదలై కుడివైపు కింది భాగంలోకి వ్యాపిస్తుంటే దాన్ని పేగు నొప్పి గా చెబుతారు. మానవ శరీరంలో కిలోమీటర్ల పొడవు లో పేగులు చుట్ట బెట్టి ఉంటాయి. వీటిలో ఇన్ ఫెక్షన్ వలన నొప్పి జనిస్తుంది. ఇందుకు మందుల ద్వారా తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు.
కడుపు లో మధ్య భాగంలో నొప్పి మొదలై కుడి దిశగా పైకి కదులుతుంటే దీన్ని పిత్తాశయ నొప్పి గా చెబుతారు. కాలేయం నుంచి స్రవించే పైత్య రసం ఆంత్ర మూలానికి చేరే లోపు తాత్కాలికంగా పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడినప్పుడు నొప్పి జనిస్తుంది. ఇది అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇబ్బంది పెడుతు ఉంటుంది.
ఇదే గాకుండా మహిళల్లో రుతు స్రావం సంబంధిత నొప్పులు, గర్భ ధారణ సంబంధిత నొప్పులు ఉంటాయి.
కడుపు నొప్పి అన్నది చాలా చిన్న విషయం అని నిర్లక్ష్యం చేయటం ఎంత తప్పో, నొప్పి వచ్చిన ప్రతీ సారి గాభరా పడిపోవటమూ అంతే తప్పు. నొప్పి జనించిన వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే నొప్పికి తగిన కారణాన్ని గుర్తించి తగిన చికిత్స చేయిస్తారు.
This comment has been removed by a blog administrator.
ReplyDeletewhich type of stomach pain is serious. please explain
ReplyDelete