...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

స‌మైక్యంగా ఉంచ‌టం సాధ్యమేనా..! లాభ న‌ష్టాలు ఏమిటి..!

క‌లిపి ఉంటే స‌మైక్యం అని, విడివిడిగా ఉంచితే ప్రత్యేకం అని సూటిగా చెప్పుకోవ‌చ్చు. అందుకే స‌మైక్యం మేలా, ప్రత్యేకం మేలా అన్న దానిపై చ‌ర్చలు జ‌రుగుతుంటాయి. ఈ రెంటిని విడ‌దీసి చూడ‌లేం. అలాగ‌ని క‌లిపేసి ఆలోచించ‌లేం. దేని ప్రత్యేక‌త దానిదే.

మ‌నం రోజు తీసుకొనే ఆహారం విష‌యంలో కూడా ఈ కోణాన్ని ఆలోచించాలి. ఆహారంలో ప్రధానంగా కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు, కొవ్వు ప‌దార్థాలు ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ లు, ల‌వ‌ణాలు, పోష‌కాలు, నీరు మొ. కూడా ఉంటాయి. ప్రధానంగా ఉండే కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్ లు, కొవ్వులు వంటివి ఏ శాతంలో ఉండాలి అనేది నిర్ధిష్టంగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రోజుకి 2000 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌రం అనుకొందాం. ఇందులో కార్బొహైడ్రేట్ లు-225 గ్రా.లు, ప్రోటీన్ లు - 150 గ్రా.లు, కొవ్వులు-55 గ్రా.లు తీసుకొంటే మేలుగా ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ లు-900 క్యాల‌రీలు, ప్రోటీన్ లు - 600 క్యాల‌రీలు, కొవ్వులు- 500 క్యాల‌రీల శ‌క్తిని ఉత్పత్తి చేయాల‌న్న మాట‌. అందుచేత ఈ అంశాల‌న్నీ ఉండే మాదిరిగా స‌మ‌గ్రమైన ఆహారం తీసుకోవాలి. ఆహార సంబంధిత ప‌దార్థాల్ని స‌మైక్యంగా తీసుకోవ‌చ్చు. లేదా విడి విడిగా అయినా తీసుకోవ‌చ్చు. కానీ మొత్తం మీద స‌మ‌గ్ర ఆహారం తీసుకోవ‌ట‌మే ప్రధానం.

2 comments:

  1. heading tone interest create cheyinchi mothaniki motham chadivinchesaaru,,hats off

    ReplyDelete
  2. రాఘవేంద్ర రావు సినిమా పాట విలక్షణంగా చిత్రిమ్చినట్టు మీరు ఈ పోస్ట్ విలక్షణంగా రాసారు.
    ఏమీ తేల్చనందుకు డిసప్పాయింట్ చేసినా - నవ్వించింది ....కవ్వించింది.

    ReplyDelete