...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ రోజు ప్రాధాన్యం మీకు తెలుసా..!

ఏప్రిల్ 19 వ తేదీ కి ఒక ప్రాధాన్యం ఉంది. ప్ర‌తీ ఏటా ఏప్రిల్ 19న వైద్య రంగంలోని వారంతా గుర్తు చేసుకొంటారు. ఈ రోజుని వ‌ర‌ల్డ్ లివ‌ర్ డే గా పాటిస్తారు.


మాన‌వ శ‌రీరంలో లివ‌ర్ (కాలేయం) కు ప్రాధాన్యం ఉంది. శ‌రీరంలోని అతి పెద్ద గ్రంథిగా దీన్ని అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఇందులో నిర్దిష్ట‌మైన ఎంజైమ్ లు లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఇందులో ఉండే బైలిరూబిన్‌, బైలి విర్డిన్ అనే వ‌ర్ణ‌కాలు జీర్ణ ప్ర‌క్రియ‌లో చురుకైన పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్ల సంశ్లేష‌ణ‌, విష ప‌దార్థాల విచ్ఛిన్నంలో కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. అందుచేత ఈ కాలేయాన్ని ఆరోగ్యక‌రంగా చూసుకోవ‌టం మ‌న బాధ్య‌త‌. కాలేయంలో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల్ని హెప‌టైటిస్‌, స్టోన్స్, సిర్రోసిస్‌, క్యాన్స‌ర్ వంటి ర‌కాలుగా అభివర్ణించ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తకుండా చేసుకోవ‌టం మ‌న చేతిలో ఉంది. మ‌ద్య‌పానం వంటి దుర‌ల‌వాట్లతో కాలేయంలో చాలా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌తీ రోజు మ‌ద్యం తాగే వారిలో ఈ ఇబ్బంది మ‌రింత ఎక్కువ‌. దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉండి స‌రైన ఆహార నియామాలు పాటిస్తే కాలేయ స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

No comments:

Post a Comment