...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

"ఢమరుకం" లో అంత సీన్ ఉందా..?

ఢ‌మ‌రుకం గురించి విన్నప్పుడు భ‌లే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత‌టి శ‌క్తి మంత‌మైన‌దా అనిపిస్తుంది కూడా..! అస‌లు డ‌మ‌రుకం అన్న ప‌ద‌మే చ‌క్కటి ఉత్సాహ‌క‌రంగా ఉంటుంది. శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు గుర్తుగా దీన్ని జ్ఞప్తికి ఉంచుకోవ‌చ్చును. ఎందుకంటే శ‌క్తినంత‌టినీ ఒక్క చోట‌కు చేర్చితే త‌ప్ప  ఢ‌మ‌రుకం ప్రజ్ఞ మ‌న‌కు అర్థం కాదు. శ‌రీరంలో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. శ‌రీరంలో డ‌మ‌రుకం అని చెప్పదగిన కాలేయానికి ఉన్న శ‌క్తి అంతా ఇంతా కాదు. ఎందుచేత‌నంటే శ‌క్తిని సంశ్లేషించి, శ‌రీర బాగాల‌కు అందించ‌టంలో ఇది చాలా ప్రధానం. ఇక్కడ నుంచి అనేక భాగాల‌కు శ‌క్తి నేరుగా అందించ‌టానికి వీల‌వుతుంది. అంతేగాకుండా నిల్వ శ‌క్తి కార‌కాల్ని కూడా రూపొందిస్తుంది. అవ‌స‌రమైన‌ప్పుడు ఒక్కసారిగా శ‌క్తి వివిధ రూపాల్లో అందించ గ‌లుగుతుంది కాబ‌ట్టే కాలేయాన్ని డ‌మ‌రుకంతో పోలుస్తారు. 

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన‌మైన గ్రంథి. ఆహారంలోని ముఖ్య ప‌దార్థాల సంశ్లేష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించును. ఇది అతి బ‌రువైన గ్రంథిగా పేరు తెచ్చుకొంది. దీనికి ఉన్న మ‌రో విశేషం ఏమిటంటే.. శ‌రీరంలోప‌లి అవ‌యవాల్లో కాలేయం మాత్రం పున‌రుజ్జీవం (రీజ‌న‌రేష‌న్) పొందే శ‌క్తిని క‌లిగి ఉంటుంది. దాదాపు నాలుగో వంతు కాలేయానికి కూడా పూర్తిగా పున‌ర్ నిర్మించుకోగ‌ల స‌త్తా ఉంటుంది. కాలేయ క‌ణాలు మ‌ళ్లీ క‌ణ‌చ‌క్రం లోకి ప్రవేశించ‌టం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అందుచేత‌నే కాలేయం పాడైన‌ప్పుడు స‌రైన వైద్యుల ద‌గ్గర చికిత్స తీసుకోవాలి. అప్పుడు సక్రమ‌మైన ప‌ద్దతిలో శ‌స్త్ర చికిత్స చేయించటానికి వీల‌వుతుంది. దీని ఫ‌లితంగా కాలేయం నుంచి పూర్తి శాతం ప‌నిత‌నాన్ని ఆశించ‌గ‌లుగుతాం. శ‌రీరానికి కావ‌లిసిన శ‌క్తిని అందించ‌గ‌లుగుతుంది. డ‌మ‌రుకం మాదిరిగా ఒక్కసారిగా ప‌ని త‌నాన్ని చూప‌గలుగుతుంది. కాలేయం కు మాత్రమే ఉన్న ఈ అద్భుత శ‌క్తి గురించి తెలుసుకొంటే మాత్రం భ‌లే ఆశ్చర్యంగా ఉంటుంది క‌దా..!

3 comments:

  1. దెబ్బ కొట్టారు డాట్రు బాబు, నేనేదో ఢమరుకం సినిమా గురించనుకోని ....

    ReplyDelete
  2. మీ బ్లాగు చాలా బాగుంది. సింపుల్ గా ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తున్నారు. కృతజ్ఞతలు.


    మా ఫ్రెండ్ కి కాలేయ కాన్సర్ వచ్చింది. వెరీ రేర్ కాన్సర్ అన్నారు. దాదాపు మొత్తం పాడైంది, బయట భాగాలకూ వ్యాపిస్తోంది అన్నారు. ఇద్దరి ముగ్గురిని కలిసాక డాక్టర్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అన్నారు. ఒకరు చేయాలన్నారు, ఇంకొకరు వద్దన్నారు. ఆ తరువాత పూర్తి వీగన్ ఫుడ్స్ తినాలంటే, ఒక ఆరు నెలల నుంచి పూర్తి వీగన్ ఫుడ్స్ పైనే ఉంటున్నాడు. పరీక్షల్లో కాన్సర్ ప్రస్తుతం నిలకడగా ఉంది అన్నారు. ఆరు నెలలైనా వీళ్ళు ఆపరేషన్ గురించి ఏమీ చెప్పట్లేదు. కాన్సర్ వ్యాపించిన కాలేయం పూర్తిగా మందులూ, ఆహారం ద్వారా పునరుజ్జీవం కాగలదా ?

    ReplyDelete
  3. Dear Friend, treatment depends on the stage of cancer. some times Liver operation (hepatectomy ) or liver transplantation can cure the problem. I can give better opinion if you can scan all the reports and scans and send to my mail drrvrrao@gmail.com.

    ReplyDelete