రక్తం శరీరంలో చాలా ముఖ్యమైనది. ఇది ప్రసరణ వ్యవస్థ కు బాధ్యత వహిస్తుంది. రక్తం ద్వారా శక్తి ఒక చోట నుంచి ఒక చోటకు అందుతుంది. అయితే కొంతమందికి మలంలో రక్తం పడుతుంటుంది. ఇది పైల్స్ సమస్య కానీ, జీర్ణం లో లోపం కానీ అనుకొని వదిలేస్తుంటారు. కొంతవరకు ఈ విషయాన్ని కొట్టి పారేయలేం కానీ అన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడదు. తరుచు రక్తం పడుతుంటే అనుమానించాల్సిందే. రక్తం ఎరుపుగా కానీ, నలుపుగా కానీ ఉండవచ్చు. రక్త ప్రసరణ లో ఎక్కడో లోపం ఏర్పడుట వలన ఈ ఇబ్బంది తలెత్తినట్లు గుర్తించాలి. దీంతో పాటు కడుపులో నొప్పి ఉండటం, కడుపు బిగపట్టి నట్లు ఉండటం వంటి లక్షణాల్ని గమనించుకోవాలి. రక్తం బయటకు పోతుండటం కారణంగా బలహీనం అయిపోతారు. నిస్త్రాణంగా ఉండిపోతారు. అంతేగాకుండా ఇటువంటి వారిలో నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందుచేత కోపం , చిరాకు పెరిగిపోతాయి. అందుచేత ఇటువంటి లక్షణాలు ఉంటే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. రోగం ముదరక ముందే వైద్యం చేయించుకోవాలి.
ఇలాంటి సమస్య అనే అనుమానం ఉంటె Gastroenterologist ను కలవాలా ? ఎవరిని కలవాలి సూచించ గలరు . మీ ఆస్పత్రిలో అయితే సమయం ఏమిటి ?
ReplyDeleteDear Friend, its better to meet a Gastroenterologist. I am available from 8AM to 8pm for consultation on all working days at my hospital. Email-drrvrrao@gmail.com
ReplyDeleteDear Friend, its better to meet a Gastroenterologist. I am available from 8AM to 8pm for consultation on all working days at my hospital. Email-drrvrrao@gmail.com
ReplyDelete