పిల్లలంటే పెద్దలకు ఎనలేని ఇష్టం. ఇప్పుడు ఉన్న చిన్న కుటుంబాల్లో పిల్లల్ని తల్లి దండ్రులు ప్రాణంగా చూసుకొంటున్నారు. చిన్నారులకు ఏమైనా అయితే తల్లిదండ్రులు ఏమాత్రం తట్టుకోలేరన్నది వాస్తవం.
పిల్లలకు స్నానం చేయించేటప్పుడు, మర్ధనా చేయించేటప్పుడు చేతికి గడ్డ తగులుతూ ఉంటుంది. చాలా సార్లు ఇది మామూలు గడ్డ కావచ్చును. అయితే అన్ని గడ్డలు సాధారణమైనవి కాకపోవచ్చు. కొన్ని సార్లు కాలేయంలో క్యాన్సర్ తలెత్తినప్పుడు ఇటువంటి గడ్డలు ఏర్పడతాయి.
కుడి వైపు ఉంటే మూత్ర పిండాల్లో, ఎడమ వైపు ఉంటే ప్లీహంలో సమస్య ఉండవచ్చు. ఇటువంటి క్యాన్సర్ ను ఇతర లక్షణాలతో పోల్చుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గిపోవటం, ఆకలి మందగించటం, కడుపులో ఎగువ భాగంలో నొప్పి ఉండటం, నీరసించి పోవటం, కాలేయం ప్రాంతంలో ఉబ్బరింపు, మలం రంగు మారటం వంటి లక్షణాల్ని చూసుకోవాలి. ఈ లక్షణాలకు తోడు కామెర్లు వంటి కాలేయ సమస్యలు ఉంటే త్వరగా మేలుకోవటం మేలు. గడ్డ ఉన్నప్పుడు సాధ్యమైనంత తొందరగా వైద్యుల్ని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. సీటీ స్కాన్ వంటి పరీక్షలతో సమస్యను గుర్తించేందుకు వీలవుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే ముప్పు నుంచి ముందే మేలుకోవచ్చు.

No comments:
Post a Comment