నగర వాసులు అంటేనే ఉరుకులు పరుగుల జీవితం గడుపుతుంటారు ఒత్తి ళ్ల మధ్య తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడిల కారణంగా మెదడుపై భారం పడుతోంది. దీంతో శరీరంలో రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలోని ముఖ్యమైన వ్యవస్థల మీద చెడు ప్రబావం చూపుతుంటాయి. ఈ రాడికల్స్ తో దీర్ఘ కాలిక వ్యాధులు వస్తుంటాయి. అందులో క్యాన్సర్ ఒకటి.
ఫిబ్రవరి మొదటి వారంలో ప్రపంచ క్యాన్స్రర్ డే జరుపుకొన్నాం. ఈ సందర్భంగా అనేక చోట్ల అవగాహన శిబిరాలు జరిగాయి. క్యాన్సర్ కు నిర్దిష్‌టంగా కారణాలు చెప్పలేం. కానీ చెడు అలవాట్లు అంటే మద్యపానం, పొగతాగటం, గుట్కా వంటి అలవాటు ఉంటే ఇది వచ్చే అవకాశం ఎక్కువ. దీంతో పాటు వేళ పాళ లేని జీవన శైలి, ఒత్తిడితో కూడిన జీవనం కారఃణగా ఇది తలెత్త వచ్చు. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇది రావచ్చును. అందుచేత ఈ విషయంలోతగిన జాగ్రత్తలు అవసరం. క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తదుపరి పోస్ట్ లో చూద్దాం.
No comments:
Post a Comment