ఆపరేషన్ అనేది ఆధునిక వైద్య శాస్త్రంలో ముఖ్యమైన చికిత్స విధానం. నిపుణులైన సర్జన్ లు సునిశితంగా చేసే శస్త్ర చికిత్సల ద్వారా ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధుల్నినయం చేస్తున్నారు. అయితే క్యాన్సర్ కు కూడా అనేక సందర్భాల్లో ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ, క్యాన్సర్ కు ఆపరేషన్ చేస్తే వ్యాధి కారక కణజాలం పగిలిపోయి ఇతరభాగాలకు వ్యాపిస్తాయని, అందుచేత ఆపరేషన్ చేయకూడదన్న అపోహ ఉంది.
ఇది ఏమాత్రం సరి కాదు. నిపుణులైన సర్జన్ ను సంప్రదించి క్యాన్సర్ కు ఆపరేషన్ చేయించుకొంటే ఇటువంటి పరిస్థితి తలెత్తదు. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ విషయంలో ఉత్తమ చికిత్స విధానాల్లో ఆపరేషన్ కూడా ఒకటి. ఈ ఆపరేషన్ ద్వారా ప్రాథమిక దశలో ఉండే క్యాన్సర్ ను నయం చేయటానికి వీలవుతుంది.దీని ద్వారా క్యాన్సర్ కారక కణ జాలం ఇతర ప్రాంతాలకు వ్యాపించటం జరగదు. క్యాన్సర్ అంటేనే అవాంఛనీయ కణజాలం పేరుకొని పోవటం అని చెబుతారు. దీన్ని ముందుగానే పసిగట్టి అడ్డు కట్ట వేయకపోతే ఈ కణజాలం విస్తారంగా పెరిగిపోతుంది. అప్పుడు దీన్ని నివారణ చాలా కష్టంగా మారుతుంది. అందుచేత ముందుగానే దీనికి ఆపరేషన్ ద్వారా అడ్డుకట్ట వేయటానికి వీలవుతుంది.

డాక్టరుగారూ,
ReplyDeleteచాలామందిలో ఉండే అపోహలు తొలగించడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగిస్తోంది...