ఆధారం అనే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ విషయంలో అయినా ఆధారం ఉంటేనే నమ్మ గలుగుతాం. లేదంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాం. అందుకే ఆధారానికి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రీయమైన అంశాల్ని ఆధారం ఉంటేనే పరిగణించగలుగుతాం.
రెడ్ మీట్ తినే అలవాటుతో అనర్థం ఉందనేది ఎప్పటినుంచో చెబుతున్న విషయం. కానీ దీనికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ఆధారాలు సంపాదించారు. దాదాపు ఒక లక్షా 20వేల మందిలో పరిశోధనలు జరిపిన తర్వాత రెడ్ మీట్ ఎక్కువగా తినే వారికి క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తాయని తేల్చి చెప్పారు. ద బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ఈ ఆధారాల్ని ధ్రువీకరించింది. ఇటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నవారికి మరణాల రేటు 13 శాతం, గుండె సంబంధిత తీవ్ర రోగాల శాతం 18శాతం, క్యాన్సర్ సోకే చాన్స్ 10 శాతం అధికంగా ఉంటాయని నిర్ధారించారు. రెడ్ మీట్ లో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులు, అదికంగా ఉండే సోడియం ఇందుకు కారణం అవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాల్ని ఇంటర్నల్ మెడిసిన్ ఆర్కైవ్స్ లో ప్రచురించారు. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకొనే అలవాటు ఉన్న వారు ఆ అలవాటు ని తగ్గించుకొంటే మంచిదని సూచించారు. శుభ్రం చేసిన ఇతర మాంసాహారాల్ని అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. కోడి, చేప, బీన్స్ వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆధారాలు దొరికాక, ఆరోగ్యకరమైన సలహాని పాటించేందుకు ప్రయత్నించాలి.
అబ్బ..! డాక్టర్ గారు, మీరు భలే హెడింగ్ లు పెట్టి జనాన్ని ఆకర్షిస్తున్నారు. మీరు ఆధారాలు దొరికాయి అంటే ఏదో అనుకొని ఈ బ్లాగులోకి వచ్చేశాను. గతంలో కూడా ఇలాగే రప్పించారు, ఎనీ హౌ మీరు ఇస్తున్న సమాచారం చాలా బాగా ఉంటోంది. మంచి ప్రయత్నం..!
ReplyDelete