పిల్లలు కుటుంబంలో చాలా ముఖ్యం. ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల్లో ఒకరు లేక ఇద్దరు పిల్లలే ఉండటంతో పిల్లల్ని బాగా గారాబం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుచేత పిల్లలు అడిగింది కాదనకుండా ఇచ్చేస్తుంటాం.
ఇప్పటి పిల్లల్లో బిస్కట్లు, చిప్స్ తినే అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కొంతవరకు ఫర్వాలేదు. కానీ అదేపనిగా బిస్కట్లు, చిప్స్ తినటం మాత్రం మంచిది కాదని గుర్తించుకోవాలి.
భోజనం తినే ముందు, టీవీ చూస్తున్నప్పుడు అదే పనిగా తింటుంటారు. దీని కారణంగా భోజనం సరిగ్గా తినక పోవటాన్ని మనం గమనించవచ్చు. ఇక, టీవీ, కంప్యూటర్ చూస్తున్నప్పుడు ఎంత తింటున్నదీ, ఏం తింటున్నదీ గమనించరు. దీని కారణంగా ఎక్కువ కొవ్వు పదార్థాలు శరీరంలోకి వెళ్లతాయి. ఫలితంగా చైల్డ్ ఓబేసిటీ కి దారి తీయవచ్చు. పిల్లల్లో స్థూలకాయం ఎంత మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దు చేయవచ్చు. పరిమితికి మించితే మాత్రం అనర్థం తప్పదని గుర్తుంచుకోవాలి. అందుచేత పరిమితంగా బిస్కట్లు చిప్స్ ను అనుమతించవచ్చు.

No comments:
Post a Comment