స్పీడ్ ఎక్కువగా ఉండటం కొన్ని విషయాల్లో మంచిది కావచ్చు. కానీ ఆహారం తీసుకొనే విషయంలో మాత్రం మంచిది కాదు. చాలామంది ఉదయం పూట ఉరుకులు పరుగులతో పని చేస్తుంటారు. మధ్యాహ్న సమయంలో కూడా ఇదే పంథా అనుసరిస్తారు. బిజీ షెడ్యూల్ ఉన్న వారికి ఇది తప్పనిసరి కావచ్చు. అంతమాత్రాన ఆహారం తీసుకొనేటప్పుడు ఉరుకులు పరుగులు మంచిది కాదు. ఇతర విషయాలు ఆలోచిస్తూ గబ గబ నోటిలో కుక్కుకుంటే సరైన ఆహారం లోపలకు వెళ్లదు.
సాధారణంగా ఆహారంలో అనేక కాంపోనెంట్స్ ఉంచుకొంటారు. హడావుడిగా ఉన్నప్పుడు మాత్రం మొదటి కాంపొనెంట్ నే ఎక్కువగా తీసేసుకొంటాం. తర్వాత మిగిలిన దాన్ని వదిలేస్తారు. 1అంతే కాకుండా జీర్ణ కోశాన్ని చేరుకొనే ఆహారం కూడా సమపాళ్ల లో ఉండదు. దీని ఫలితంగా సజావుగా జీర్ణం అవటానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇతర విషయాల మీద మనస్సు పెట్టినప్పుడు చాలా మంది ఎంత తింటున్నారో గమనించుకోరు. పిల్లల్లో ఈ విషయాన్ని ఎక్కువగా గమనించవచ్చు. ఇటీవల కాలంలో పిల్లలు టీవీ చూస్తూ, లేదా కంప్యూటర్ చూస్తూనో ఆహారం తీసుకొంటున్నారు. దీని కారణంగా ఎంత ఆహారం తీసుకొనేది చూసుకోరు. ఇది మంచి అలవాటు కాదు. ఆహారం తీసుకొనేటప్పుడు దృష్టి దాని మీదే ఉంచాలి. అప్పుడు ఆ ఫుడ్ సమపాళ్ల లో తీసుకొనేందుకు వీలవుతుంది.

Very good suggestion sir. Thank you very much.
ReplyDelete