ఈ మధ్య కాలంలో రాళ్లు పడే సమస్య ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ పోకడ కనిపిస్తోంది. స్పష్టంగా కారణం చెప్పటం కష్టమైనా ఇందుకు దారి తీసే పరిస్థితుల్ని గమనించవచ్చు.
జీర్ణ వ్యవస్థ లో పిత్తాశయం (గాల్ బ్లాడర్), క్లోమం (పాన్ క్రియాసిస్) వంటి భాగాల్లో రాళ్లు పేరుకొంటాయి. ఆధునిక జీవన శైలి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఆహారం తీసుకోవటంలో సమయ పాలన పాటించక పోవటం, వంటి కారణాలు కొంత వరకు గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్యకు దారి తీస్తాయి. రాళ్లు ఏర్పడటం మొదలైన వెంటనే లక్షణాలు బయట పడక పోవచ్చు. ఈ రాళ్లు సైజ్ పెరిగే దాకా అంతర్గతంగా మార్పులు జరుగుతుంటాయి. ఒక్కసారి లక్షణాలు బయట పడ్డాక వరుసగా సమస్య పునరావృతం అవుతుంది. ఒక్క సారిగా కడుపులో నొప్పి వచ్చేస్తుంటుంది. ఇది తీవ్రంగా ఉండి, ఇబ్బంది పెట్టేస్తుంది. చాలా సార్లు అర్థ రాత్రి సమయంలో ఇది వస్తుంటుంది. నొప్పి కొన్ని సార్లు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. తాత్కాలికంగా మందులు వాడితే ఇది ఉపశమిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు లాపరోస్కోపిక్ విధానంలో చిన్న రంధ్రాలు చేసి ఆపరేషన్ ముగించవచ్చు. రెండు రోజుల్లో రోగి - ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇది సురక్షితం మాత్రమే గాకుండా సుఖవంతం అని చెప్పుకోవచ్చు. నిపుణులైన వైద్యుల చేత చికిత్స చేయించుకొంటే ఎటువంటి సైడ్ ఎపెక్ట్ లేకుండా చికిత్స పూర్తవుతుంది. పిత్తాశయంలో రాళ్లకు ఆపరేషన్ మాత్రమే శాశ్వత పరిష్కారం అని గుర్తుంచుకోవాలి.

Sir, Your posts are very informative and useful.
ReplyDeleteCan you please change the font color for your posts.I believe its very difficult to read with bright pink letters on blue back ground.
sure. will do. some technical issue. Thanks
ReplyDelete