మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకొంది. ఇప్పటికే కోట్లాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. చివరి 4,5 రోజుల్లో అనేక మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ వారు వెరైటీ ప్రచారం చేస్తున్నారు. అక్కడ తినే రొట్టెలు, చపాతీల కవర్ ల మీద హ్యాండ్ వాష్ కు సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. దయచేసి చేతుల్ని శుభ్రంగా కడుక్కొన్నాకే ఆహారం తినండి అని సూచిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన ప్రచారం. ఎందుకంటే లక్షల మంది యాత్రికులు వచ్చే కుంభ మేళా వంటి చోట్ల వ్యక్తిగత శుభ్రత ను పాటించటం కొంత వరకు కష్టమైన విషయం. పైగా చాలా మంది దీన్ని అశ్రద్ద చేస్తుంటారు. అందుచేత ఇటువంటి సమయంలో వ్యక్తి గత శుభ్రత మీద ప్రచారం చేయటం మంచి పరిణామం. వాస్తవానికి చేతిని అంటుకొని అనేక వేల క్రిములు ఉంటాయి. వీటిని తొలగించుకోకుండా అదే చేతులతో ఆహారం తీసుకొంటే కడుపు లోకి ఈ క్రిములు చేరే చాన్సు ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ ఏ సమయాల్లో చేతుల్ని శుభ్రం చేసుకోవాలో తెలుసుకొందాం..
ఆహారాన్ని తయారుచేసేటప్పుడు లేక తినేటప్పుడు, గాయాల్ని శుభ్రం చేసుకొనేటప్పుడు, కళ్లకు ఉండే లెన్స్ ను తీసుకొనేటప్పుడు కచ్చితంగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు మాంసాహారపు వంటలు వండాక, టాయ్ లెట్ కు వెళ్లి వచ్చాక, జంతువులతో ఆటలాడాక, బయట ప్రధేశాల్లో ఆడుకొన్నాక, రొంప సమయంలో ముక్కు చీదిన తర్వాత, గాయాల్ని శుభ్రం చేశాక తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకొనుట మేలు. అందుచేత మహా కుంభ మేళా వంటి చోట్ల వ్యక్తిగత శుభ్రత మీద ప్రచారం మంచిదే అనుకోవచ్చు.

No comments:
Post a Comment