సెలబ్రిటీస్ ఏ పని చేసినా ఆసక్తి దాయకంగా ఉంటుంది. అందుకే ప్రముఖుల అలవాట్లు, ప్రముఖులు చేసే పనుల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ, సినీ క్రీడా రంగ ప్రముఖులు ఎక్కడ ఉన్నా జనం బాగా గమనిస్తూ ఉంటారు.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ బాగా మంచి నీరు తాగుతున్నారు. బహిరంగ సమావేశాలు, ఓపెన్ డిబేట్స్ లో ఈ విషయం బాగా గమనిస్తున్నాం. ముఖ్యంగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగుతున్నారు. ఎందుకంటే ఆరోగ్య వంతుడైన మానవునికి రోజుకి 2-2.5 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఈ మేర నీటిని తాగటం వలన జీవన క్రియలు బాగా జరుగుతాయి. అసలు శరీరంలో 60 నుంచి 75 శాతం దాకా నీరు ఉంటుంది. మొత్తంగా చూస్తే నీరు అనేది శరీర నిర్మాణంలో ఎక్కువ వాటా ఆక్రమించే అంశం గా చెప్పవచ్చు. కండరాల్లో 75శాతం, మెదడులో 90 శాతం, ఎముకల్లో 20 శాతం, రక్తంలో 85శాతం వరకు నీరు ఉంటుంది. నిర్మాణంలోనే కాదు విధుల్లో కూడా నీరు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కణాల్లోపల ఆక్సిజన్, ఇతర పోషకాల్ని ఒక చోట నుంచి ఒక చోటకు చేర్చటం, ఊపిరితి్త్తులు, శ్వాస గొట్టాల్లో శ్లేష్మం చేర్చటం, వ్యాధి నిరోధక శక్తిని ఉపయోగించటం, ఉష్ణోగ్రతను క్రమ బద్దీకరించటం, వ్యర్థాల్ని బయటకు పంపించటం వంటి అనేక పనుల్లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుచేత క్రమం తప్పకుండా అవసరమైనంత నీటిని తాగటం సెలబ్రిటీలను చూసి మనం నేర్చుకోదగిన అంశం. అదే సమయంలో అతి సర్వత్రా వర్జయేత్ అని తెలుసు కదా.. అంటే ఎక్కువగా అదే పనిగా నీటిని తాగటం కూడా మంచిది కాదు సుమా..!

No comments:
Post a Comment