రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈ పరీక్షకు హాజరు అవుతున్నారు. మార్చి నెల వచ్చిందంటే పిల్లలకు పరీక్షల సీజన్ వచ్చేసిందనుకోవచ్చు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులంతా యాన్యువల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాయి. నేషనల్ కరిక్యులమ్ ఫాలో అయ్యే స్కూల్స్ తప్పించి స్టేట్ బోర్డ్ లో చదివే పిల్లలకు పరీక్షల టెన్షన్ బలంగా ఉంది.
పరీక్షల వేళ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం పెద్దలుగా మన బాధ్యత. ఈ సమయంలో పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వండి. బయట తిండిని ఎలవ్ చేయటం మంచిది కాదు. తగినంత నిద్ర అవసరం అని గుర్తుంచుకోవాలి. నిద్ర మానేసి చదివితే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చదువుకొన్నది కూడా మరిచిపోయే అవకాశం ఉంది. నిద్ర ను మానటానికి లేదా ఎక్కువ సేపు చదివేందుకు ఎక్కువగా టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఇది మంచిది కాదని గుర్తించుకోవాలి. టీ, కాఫీల కారణంగా తాత్కాలికంగా ఉత్తేజం పొందినట్లు అనిపించినా అది అప్పటికే. అందుచేత తగినంత విశ్రాంతి తో కూడిన ప్రిపరేషన్ మేలు చేస్తుందని గుర్తించుకోవాలి. పరీక్ష కేంద్రంలో హైరానా పడటం మంచిది కాదు. అందుచేత అక్కడి వాతావరణం గురించి పెద్దలు వివరించి చెప్పాలి. పరీక్షల సమయంలో పెద్దలు వెంట వెళుతుంటారు. కనీసం మొదటి పరీక్షకు అయినా పరీక్ష కేంద్రానికి కూడా వెళ్లటం మంచిది. అంత మాత్రాన మార్కుల గురించి పదే పదే పిల్లల చెవిలో పోరు పెట్టడం సరి కాదు సుమా..!

No comments:
Post a Comment