...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ వ్యాధి ఇటీవ‌ల విస్త‌రిస్తోంది సుమా..!

 జీర్ణ వ్యవ‌స్థలో  చురుకైన పాత్ర పోషించే అవ‌య‌వం కాలేయం.  ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన  వంటి ప‌నులు చేస్తుంటుంది. దీనికి వ‌చ్చే ముఖ్య స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన‌ది కాలేయ క్యాన్స‌ర్‌. అవాంఛిత క‌ణ‌జాలం ఒక్క చోట పేరుకోవ‌టాన్ని క్యాన్స‌ర్ గా అభివ‌ర్ణిస్తాం. ప్రాథ‌మిక మైన క్యాన్స‌ర్ ను హెప‌టో సెల్యులార్ కార్సినోమా అంటారు.మ‌ద్య‌పానం అలవాటు, హెప‌టైటిస్ బీ, హెప‌టైటిస్ సీ వైర‌స్ ఇన్ ఫెక్ష‌న్‌, స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం, పుట్టుక‌తో ఉండే జ‌న్యులోపాలు వంటి కార‌ణాల‌తో క్యాన్స‌ర్ వ‌స్తుంది. కొంత‌మంది చిన్నారుల్లో కూడా క్యాన్స‌ర్ వ‌స్తుంటుంది. దీన్ని హెప‌టో బ్లాస్టోమా అంటారు. ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.కానే కాదు. హెమాంజియా, ఎఫ్‌.ఎన్‌.హెచ్‌, అడినోమా వంటి క‌ణితులు  క్యాన్స‌ర్ క‌ణితులు కాద‌ని గుర్తించుకోవాలి.

దుర‌దృష్ట‌వ‌శాత్తు కాలేయ క్యాన్స‌ర్  ముదిరిపోయే దాకా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. క‌డుపులో ఎగువ భాగంలో నొప్పి రావ‌టం, బ‌రువు త‌గ్గ‌టం, ఆక‌లి త‌గ్గ‌టం, బాగా నీర‌సంగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొన్ని సార్లు కామెర్లు సోకి శ‌రీరం, క‌ళ్లు రంగు మార‌తాయి. కాలేయం పెరిగిన‌ప్పుడు క‌డుపు ప్రాంతంలో వాపు క‌నిపిస్తుంది. చిన్న పిల్ల‌లకు స్నానం  చేయించేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు త‌డిమి చూస్తే చేతికి త‌గిలే అవ‌కాశం ఉంది.క్యాన్సర్ ను గుర్తించ‌టంలో జాగ్రత్త అవ‌స‌రం. సీటీ స్కాన్‌, ఎమ్ ఆర్ ఐ స్కాన్ ల‌తో పాటు త‌ప్పనిస‌రైతే బ‌యోప్సీ ప‌రీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తారు. సీర‌మ్ ఆల్ఫా ఫీటో ప్రోటీన్  వంటి ర‌క్త ప‌రీక్ష‌లు కూడా అవ‌స‌రం అవుతాయి. యాంజియోగ్రామ్‌, లాప‌రోస్కోపీ ప‌రీక్ష‌లు చేయించాల్సి ఉంటుంది. క్యాన్స‌ర్ క‌ణాలు సూటిగా నాశ‌నం చేసే ఆర్ ఎఫ్ ఏ చికిత్స‌, క్యాన్స‌ర్ క‌ణాల్ని గ‌డ్డ‌క‌ట్టే విధంగా క్ర‌యో చికిత్స వంటివి చేయవ‌చ్చు. క్యాన్స‌ర్ చికిత్స‌లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ (హెప‌టెక్ట‌మీ) అన్న‌ది ఉత్త‌మ చికిత్స. ముదిరిన ద‌శ‌లో కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ ప‌ద్ద‌తుల్ని అనుస‌రించాలి.

చిన్నారుల్లో త‌లెత్తుతున్న ప్ర‌మాద‌క‌ర‌మైన స‌మ‌స్య‌..!

ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ అంటే పెద్ద వాళ్ల‌లో వచ్చే తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య గా భావించేవారు. ఇప్పుటి కాలంలో మాత్రం ఈ పరిస్థితి మారింది. ముఖ్యంగా లివ‌ర్ క్యాన్స‌ర్ ఇటీవ‌ల కాలంలో చిన్నారుల్లో సైతం క‌నిపిస్తోంది. దీన్ని హెప‌టో బ్లాస్టోమా అంటారు. ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. వెంట‌నే దీన్ని గుర్తించ‌లేక పోవ‌చ్చు. ఇది సాధార‌ణంగా మూడేళ్ల లో పు చిన్నారుల్లో మాత్ర‌మే త‌లెత్తుతుంది. వ్యాధి త‌లెత్తిన వెంట‌నే గుర్తించ‌క పోతే స‌మ‌స్య తీవ్రం అవుతుంద‌ని గుర్తించుకోవాలి.

జీర్ణ వ్యవ‌స్థలో  చురుకైన పాత్ర పోషించే అవ‌య‌వం కాలేయం.  ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన తో పాటు ర‌క్త క‌ణాల్ని శిథిలం చేయ‌టం వంటి ప‌నులు చేస్తుంటుంది. దీనికి వ‌చ్చే ముఖ్య స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన‌ది కాలేయ క్యాన్స‌ర్‌. అవాంఛిత క‌ణ‌జాలం ఒక్క చోట పోగు ప‌డి అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టాన్ని క్యాన్స‌ర్ గా అభివ‌ర్ణిస్తాం. ప్రాథ‌మిక మైన క్యాన్స‌ర్ ను హెప‌టో సెల్యులార్ కార్సినోమా అంటారు. చిన్నారుల్లో దీన్ని హెప‌టో బ్లాస్టోమా అంటారు.
నిర్దిష్టమైన కార‌ణాల్ని దీనికి చెప్ప‌లేం. కొన్ని సార్లు కుటుంబ చ‌రిత్ర కొంత వ‌ర‌కు కార‌ణం కావ‌చ్చు.
దుర‌దృష్ట‌వ‌శాత్తు కాలేయ క్యాన్స‌ర్  ముదిరిపోయే దాకా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. కాలేయం పెరిగిన‌ప్పుడు క‌డుపు ప్రాంతంలో వాపు క‌నిపిస్తుంది. చిన్న పిల్ల‌లకు స్నానం  చేయించేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు త‌డిమి చూస్తే చేతికి త‌గిలే అవ‌కాశం ఉంది.
క్యాన్సర్ ను గుర్తించ‌టంలో జాగ్రత్త అవ‌స‌రం. సీటీ స్కాన్‌, ఎమ్ ఆర్ ఐ స్కాన్ ల‌తో పాటు త‌ప్పనిస‌రైతే బ‌యోప్సీ ప‌రీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఆల్ఫా ఫీటో ప్రోటీన్ సీర‌మ్ వంటి ర‌క్త ప‌రీక్ష‌లు కూడా అవ‌స‌రం అవుతాయి. యాంజియోగ్రామ్‌, లాప‌రోస్కోపీ ప‌రీక్ష‌లు చేయించాల్సి ఉంటుంది.
 క్యాన్స‌ర్ క‌ణాలు సూటిగా నాశ‌నం చేసే ఆర్ ఎఫ్ ఏ చికిత్స‌, క్యాన్స‌ర్ క‌ణాల్ని గ‌డ్డ‌క‌ట్టే విధంగా క్ర‌యో చికిత్స వంటివి చేయాల్సి రావ‌చ్చు.  క్యాన్స‌ర్ చికిత్స‌లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ అన్న‌ది ఉత్త‌మ చికిత్స అన్న‌ది నిపుణుల అభిప్రాయం. ముదిరిన ద‌శ‌లో కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ ప‌ద్ద‌తుల్ని అనుస‌రించాలి.

చిన్న పిల్ల‌ల‌తోచిన్న స‌మస్య‌..!

చిన్న పిల్ల‌లు ఉన్న ఇంట్లో ప‌రిస్థితులు కాస్త డిఫ‌రెంట్ గా ఉంటాయి. అక్క‌డ వాతావ‌ర‌ణం భ‌లే గ‌మ్మ‌తుగా ఉంటుంది. చిన్న‌పిల్ల‌ల మీద అంద‌రి దృష్టి ఉంటుంది. అటువంట‌ప్పుడ వాళ్లు తిండి తిన‌టం త‌గ్గించ‌టం, పేచీ పెట్ట‌డం వంటివి చేస్తుంటారు. అటువంటి సంద‌ర్భాల్ని తేలిగ్గా తీసుకోకూడ‌దు. అందుకు కార‌ణం ఏమిటో గ‌మ‌నించాలి.

పిల్ల‌లు మ‌ట్టిలో ఆడ‌టం, కింద తిరుగాడుతూ ఉండ‌టం సాధార‌ణం. అందుచేత‌నే ఇది కూడా చోటు చేసుకొంది అనుకొంటారు. కానీ పిల్ల‌లు మ‌ట్టిలో తిరుగుతున్న‌ప్పుడు ఆ మ‌ట్టిని తినే అవ‌కాశం ఉంది. దీనికి అల‌వాటు ప‌డిన చిన్నారులు ఏదో  ఒక‌లా మ‌ట్టిని తింటుంటారు. దీని కారణంగా క్రిములు, సూక్ష్మ‌మైన పాములు క‌డుపులో చేర‌తాయి. ఇవి శ‌రీర ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి. క్ర‌మంగా ఆక‌లి త‌గ్గిపోవ‌టం, నీర‌సం, చిరాకులు, పేచీలు పెట్ట‌డం వంటి ల‌క్ష‌ణాలు చోటు చేసుకొంటాయి. అందుచేత ఇటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యుల్ని సంప్ర‌దిస్తే మంచిది.

చిన్న పాటి నిర్ల‌క్ష్యం - పెద్ద కీడునే త‌ల‌పెడుతుంది..!

ఆరోగ్యం విష‌యంలో చిన్న పాటి నిర్ల‌క్ష్యం చాలా మంది కి ఉంటుంది. ఒక్కోసారి చిన్న పాటి నిర్లిప్త‌త అలాగే కొన‌సాగుతూ ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు గోళ్లు క‌త్తిరించుకోవ‌టం ఆరోగ్యానికి సూచ‌న‌. చూసేందుకు ఆక‌ర్ష‌నీయంగా ఉండాల‌ని కొంద‌రు, క‌త్తిరించుకోవ‌టానికి బ‌ద్ద‌కించి మ‌రికొంద‌రు గోళ్ల‌ను అలాగే వ‌దిలేస్తుంటారు. వాస్త‌వానికి గోళ్ల‌కు ఉండే మొద‌ళ్ల‌లో మ‌ట్టి, ఇత‌ర క్రిములు పేరుకొని పోతాయి. కంటికి క‌నిపించని సూక్ష్మ క్రిములు ఆశ్ర‌యించుకొని ఉంటాయి. గోళ్ల‌ను క‌త్తిరించిన‌ట్ల‌యితే శుభ్రంగా వాష్ చేసుకొనేందుకు వీల‌వుతుంది. లేని ప‌క్షంలో మాత్రం క్రిములు అక్క‌డ ఉండిపోతాయి. త‌ర్వాత ఆహారం తినేట‌ప్పుడు ఈ క్రిములు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. ఆ త‌ర్వాత రోగాల‌కు కార‌ణం అవుతుంటాయి.

కాలేయ క్యాన్సర్ - అవ‌గాహ‌న‌

ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ అంటే పెద్ద‌ల్లో మాత్ర‌మే గ‌మ‌నించేవాళ్లం. ఇటీవ‌ల మాత్రం పిల్ల‌ల్లో కూడా క్యాన్స‌ర్ క‌నిపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. కాలేయ క్యాన్స‌ర్ విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో దీన్ని గుర్తిస్తూ ఉన్నాం.
మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. జీర్ణ వ్యవ‌స్థ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో  పాలు పంచుకొంటుంది. కాలేయానికి ఏర్ప‌డే స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో కాలేయ క్యాన్స‌ర్ ఒక‌టి. కాలేయంలో క‌ణితి ఏర్ప‌డి అది అవాంఛ‌నీయంగా పెరిగిపోతుంది. స‌జీవ క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసి విస్త‌రిస్తున్న క్ర‌మంలో క్యాన్స‌ర్ ను నిర్ధారిస్తారు. అన్ని క‌ణితులు క్యాన్స‌ర్ క‌ణితులు కాద‌ని మ‌నం గుర్తించుకోవాలి. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌, అధిక మ‌ద్య‌పానం అల‌వాటు, పుట్టుక‌తో వచ్చిన లోపాలు, సిర్రోసిస్ వంటి కార‌ణాల‌తో క్యాన్స‌ర్ త‌లెత్త‌వ‌చ్చు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు కాలేయ క్యాన్స‌ర్  ముదిరిపోయే దాకా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. క‌డుపులో ఎగువ భాగంలో నొప్పి రావ‌టం, బ‌రువు త‌గ్గ‌టం, ఆక‌లి త‌గ్గ‌టం, బాగా నీర‌సంగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొన్ని సార్లు కామెర్లు సోకి శ‌రీరం, క‌ళ్లు రంగు మార‌తాయి. కాలేయం పెరిగిన‌ప్పుడు క‌డుపు ప్రాంతంలో వాపు క‌నిపిస్తుంది. చిన్న పిల్ల‌లకు స్నానం  చేయించేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు త‌డిమి చూస్తే చేతికి త‌గిలే అవ‌కాశం ఉంది.
అందుచేత అటువంటి ఆన‌వాళ్లు ఉన్న‌ప్పుడు వెంట‌నే స్పందించాలి. అవ‌స‌ర‌మైతే స్కానింగ్ వంటి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌టంతో పాటు నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దించాలి. క్యాన్స‌ర్ ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత స‌మ‌ర్థంగా చికిత్స అందించేందుకు వీల‌వుతుంది.

మ‌హిళ‌లూ..! ముందే జాగ్ర‌త్త ప‌డండి..!

మ‌హిళ‌లు అనే కాదు, పురుషులు కూడా కొన్ని సార్లు చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఇందులో ర‌క్త హీన‌త ల‌క్ష‌ణాలు కూడా ఒక‌టి. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో ఎక్కువ ఉంటుంది అనుకొంటుంటారు. అంత‌కు మించి మ‌హిళ‌లు దీన్ని ఎక్కువ నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.

ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాలు త‌క్కువ‌గా ఉంటే దాన్ని ర‌క్త హీన‌త గా చెబుతారు. హీమో గ్లోబిన్ అనేది ఈ ఎర్ర ర‌క్త క‌ణాల్లో ప్ర‌ధాన వ‌ర్ణ‌క ప‌దార్థం. దీంతో ర‌క్తం త‌గ్గిన‌ట్లుగా భావిస్తారు. అదే ర‌క్త‌హీన‌త‌. దీంతో చాలా నీర‌సంగా క‌నిపిస్తారు. చిన్న పాటి ప‌నికే అలిసిపోయిన‌ట్లుగా క‌నిపిస్తారు. నిస్త్రాణ‌త ఉంటుంది. గ‌ర్భ‌వ‌తులు, వృద్దుల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. చాలా వ‌ర‌కు దీనికి పోష‌కాహార లోప‌మే కారణంగా భావిస్తు ఉంటారు. అందుచేత ఆహారాన్ని స‌మృద్దిగా తీసుకోమ‌ని చెబుతారు.
ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ అన్ని సార్లు పోష‌కాహార లోప‌మే ర‌క్త హీన‌త కు కార‌ణం కాక‌పోవ‌చ్చు. ఎర్ర ర‌క్త క‌ణాలు శిథిలం కావ‌టంలో స‌మ‌స్య కానీ, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిలో స‌మ‌స్య కానీ ఉండ‌వ‌చ్చు. అటువంట‌ప్పుడు పోష‌కాహార లోపం అనుకొని నిర్ల‌క్ష్యం చేస్తే స‌మ‌స్య త‌ప్ప‌దు. అందుచేత ర‌క్త హీన‌త ఉన్న‌ప్పుడు స‌రైన వైద్య స‌ల‌హా తీసుకొని ప‌రీక్ష‌లు చేయించుకొంటే మంచిది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో ఇబ్బందుల్ని త‌ప్పించుకోవ‌చ్చు.

అదే ప‌నిగా బ‌రువు త‌గ్గుతుంటే కాస్త స‌రి చూసుకోండి..!

బ‌రువు త‌గ్గ‌టం, పెర‌గ‌టం ఒక్కోసారి స‌హ‌జ సిద్దంగా జ‌రుగుతుంటాయి. బ‌రువు త‌గ్గితే సాధార‌ణ విష‌య‌మే అనుకోవ‌చ్చు. కానీ దీంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఆక‌లి త‌గ్గుతుండ‌టం, చిరాకు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే గ‌మ‌నించుకోవాలి.

ట్యుబ‌ర్ క్యులోసిస్‌, క‌ణితులు పెర‌గ‌టం వంటి కారణాల‌తో కూడా ఒక్కోసారి బ‌రువు త‌గ్గుతుంటారు. మాన‌సిక వ్య‌ధ వెంటాడుతున్నప్పుడు కూడా బ‌రువు త‌గ్గుతుంటారు. అందుచేత బ‌రువు త‌గ్గ‌టాన్ని అత్యంత స‌ర్వ సాధార‌ణ ల‌క్ష‌ణంగా మాత్రం భావించ‌కూడ‌దు. బ‌రువు త‌గ్గటం అన్న‌ది ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో కూడి ఉన్న‌ప్పుడు ఎల‌ర్ట్ కావ‌టం మంచిది. వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం ఉత్త‌మం. అదే ప‌నిగా నిర్ల‌క్ష్యం చేయ‌టం మంచిది కాదు. చాలా సార్లు అనారోగ్య సంబంధ‌మైన ల‌క్ష‌ణాలు ప్రారంభంలో క‌నిపించిన‌ప్పుడే అల‌ర్ట్ కావ‌టం మంచిది. లేదంటే ఈ ప‌రిస్థితి అన‌ర్థాల‌కు దారి తీస్తుంది.
ఆహారం తీసుకొనేట‌ప్పుడు ఈ సంగ‌తి గుర్తించుకోండి..!
ఆహారం అంద‌రికీ అవ‌స‌రం. స‌క‌ల జీవ‌కోటి ఆహారం తీసుకొనే బతుకుతుంది. మ‌నం తినే ఆహారం చ‌క్క‌గా ఉంటే మ‌న ఆరోగ్యం కూడా చ‌క్క‌గా నిలుస్తుంది. అందుచేత ఆహారం విష‌యంలో కాస్త జాగ్ర‌త్త అవ‌స‌రం.

ఎక్కువ‌గా వేపుళ్లు, నూనెలో అదే ప‌నిగా వేయించిన ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్,  స‌ముద్ర‌పు చేప‌లు, పీత‌లు వంటివి బాగా వేయించుకొని తినే అల‌వాటు కొంత‌మందిలో ఉంటుంది. అప్పుడ‌ప్పుడు అయితే ప‌ర్వాలేదు కానీ క్ర‌మం త‌ప్ప‌కుండా ఇదే ఆహారం తీసుకొంటుంటే మాత్రం మంచిది కాద‌ని చెప్పాలి. ఇటువంటి ఆహారం నుంచి విష ప‌దార్థాలు విడుద‌ల అవుతాయి. ఇవి శ‌రీరంలో పోగు ప‌డిన‌ట్ల‌యితే క‌ణితి మాదిరి త‌యారు అవుతాయి. ఒక వేళ ఆల్క‌హాల్ తీసుకొనే అల‌వాటు ఉంటే ఈ ప్ర‌మాదం మ‌రింత ఎక్కువ అవుతుంది. కొన్ని సార్లు ఇది క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. అందుచేత ఆహార‌పు అల‌వాట్లలో ఈ జాగ్ర‌త్త పాటించాలి సుమా..!

ర‌క్తం చిందితే ఆందోళ‌న చెందాల్సిందేనా..!

ర‌క్తం అంటే ఎవ‌రికైనా భ‌యం క‌లుగుతుంది. ముఖ్యంగా వాంతి అయిన‌ప్పుడు అందులో ర‌క్తం క‌నిపిస్తే గ‌బుక్కున భ‌యం వేస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ లోని ఎగువ భాగాలైన ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, పేగుల్లో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ర‌క్తం ప‌డే అవ‌కాశం ఉంది. కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్ష‌న్ ఉన్నా కూడా ర‌క్తం ప‌డుతుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ లో స‌మ‌స్య కార‌ణంగా ర‌క్తపు వాంతులు కావ‌టానికి అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి. విప‌రీత‌మైన క‌డుపు నొప్పి ఉండి త‌ర్వాత వాంతులు అయితే అల్స‌ర్ గా భావించాలి. అదే వాంతిలో ర‌క్తం, ఆహారం క‌లిసి ప‌డుతుంటే క్యాన్స‌ర్ గా అనుమానించాలి. కాలేయం పాడైతే మాత్రం ర‌క్త‌పు వాంతుల‌తో పాటు కామెర్లు కూడా ఉండ‌వ‌చ్చు. ర‌క్తపు వాంతులు అయినంత మాత్రాన కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా రోగికి ఈ విష‌యంలో ధైర్యం చెప్పాలి. ఆధునిక వైద్య శాస్త్రంలో చ‌క్క‌ని వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, చికిత్స‌లు దొరుకుతున్నాయి. ఈ స‌మ‌స్య‌కు కూడా వ్యాధి నిర్ధార‌ణ ద్వారా చికిత్స‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మందుల‌తో త‌గ్గితే స‌రే లేదంటే ఎండోస్కోపీ విధానంలో ఆప‌రేష‌న్ కూడా చేయాల్సి రావ‌చ్చు. నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దిస్తే మెరుగైన చికిత్స తీసుకోవ‌చ్చు.

శ‌రీరంలో ఒక భాగం తీసేసినా ఫ‌ర్వాలేదు..!

శరీరంలోని భాగాలన్నింటికీ నిర్దిష్ట‌మైన విధి, నిర్దిష్ట‌మైన స‌మ‌న్వయం ఉంటుంది. ఒక భాగం నుంచి వేరొక భాగానికి స‌మ‌న్వ‌యం ఉంటుంది. ఇదే క్ర‌మంలో కాలేయం నుంచి విడుద‌ల అయ్యే పైత్య ర‌సాన్ని తాత్కాలికంగా నిల్వ చేసేందుకు గాల్ బ్లాడ‌ర్ అనే చిన్న సంచీ వంటి భాగం ఉంటుంది. పైత్య ర‌సం ఇందులో తాత్కాలికంగా నిల్వ ఉండి, అవ‌స‌రం అయిన‌ప్పుడు పేగు లోకి స్రావితం అవుతుంది. అయితే స‌రైన ఆహార‌పు అలవాట్లు లేక‌పోయినా, ఆల్క‌హాల్ అల‌వాటు ఉన్నా..ఈ గాల్ బ్లాడ‌ర్ లోకి రాళ్లు చేర‌తాయి. దీని కార‌ణంగా తీవ్రమైన క‌డుపు నొప్పి వ‌స్తుంటుంది.

ఈ నొప్పి తో బాధ‌పడుతుండే వారికి డ‌యాగ్న‌సిస్ టెస్టు ల ద్వారా స‌మ‌స్య‌ను నిర్ధార‌ణ చేస్తారు. అటువంట‌ప్పుడు మందుల‌తో లేదా అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆప‌రేష‌న్ ద్వారా ఈ రాళ్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంది. ఒక్కో సారి రాళ్లు ఎక్కువ‌గా ఉంటే మాత్రం మొత్తం గాల్ బ్లాడ‌ర్ ను తొల‌గించాల్సి ఉంటుంది. అయితే ఈ గాల్ బ్లాడ‌ర్ తొల‌గించినంత మాత్రాన కంగారు ప‌డాల్సిందేమీ లేదు. ఎందుకంటే పైత్య ర‌సం విడుద‌ల‌లో కానీ, స‌ర‌ఫ‌రాలో కానీ పెద్ద‌గా ఇబ్బంది ఏర్ప‌డ‌దు. త్వ‌ర‌గానే శ‌రీరంలో ఈ స‌ర్దుబాటును ఇమిడ్చుకొంటుంది. అందుచేత నిపుణులైన స‌ర్జ‌న్ గాల్ బ్లాడ‌ర్ తొల‌గించినా కానీ కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

క్యాన్స‌ర్ చికిత్స‌లో అపోహ‌లు వ‌ద్దు..!

క్యాన్స‌ర్ అంటే అదో చికిత్స లేని పెద్ద వ్యాధి అన్న నానుడి ఉంది. వాస్త‌వానికి క్యాన్స‌ర్ మొండి రోగం అన‌టంలో సందేహం లేదు. అంత‌మాత్రాన దీనికి చికిత్స లేదు అనుకొంటే మాత్రం పొర‌పాటే. క్యాన్స‌ర్ కు మొద‌టి ద‌శ‌ల్లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ ద్వారా చికిత్స అందించ‌వ‌చ్చు. రెండో ద‌శ‌, మూడో ద‌శ‌కు వెళితే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ చికిత్స‌లు అందించాల్సి ఉంటుంది. చివ‌రి ద‌శ‌కు చేరుకొన్నా కూడా చికిత్స అందించిన‌ప్పుడు నాణ్య‌త‌తో కూడిన జీవితాన్ని అందించేందుకు వీలవుతుంది.

 అయితే, క్యాన్స‌ర్ కు ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేస్తే ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుంది అన్న అపోహ ఉంది. ఇది స‌రి కాదు. ప్ర‌స్తుతం ఆధునిక టెక్నాల‌జీ తో కూడిన ఆసుప‌త్రులు అందుబాటులో ఉన్నాయి. స‌మ‌ర్థుడైన స‌ర్జ‌న్ ను సంప్ర‌దించి మెరుగైన చికిత్స చేయించుకోవ‌చ్చు. అంతే కానీ ఆప‌రేష‌న్ చేయిస్తే ఏదో జ‌రిగిపోతుంది అని భ్ర‌మ ప‌డి చికిత్స కు దూరంగా ఉండ‌టం స‌రి కాదు.

అన్ని సంద‌ర్భాల్లో ప‌రీక్ష చేయ‌టం స‌రి కాదు..!

ప‌రీక్ష చేయ‌టం ద్వారా విష‌యాన్ని నిర్ధారించ‌టానికి వీల‌వుతుంది. ముఖ్యంగా క్యాన్స‌ర్ వంటి సంక్లిష్ట‌మైన వ్యాధుల విష‌యంలో నిర్ధార‌ణ పరీక్ష‌లు త‌ప్పనిస‌రి. ఇందుకోసం ర‌క్త ప‌రీక్ష‌, స్కానింగ్ వంటి సాధార‌ణ ప‌రీక్ష‌ల‌తో పాటు బ‌యాప్సీ చేయించ‌టం మామూలే. బ‌యాప్సీ అంటే అనుమానిస్తున్న శ‌రీర భాగంలోంచి కొంత భాగాన్ని వేరు చేసి దీన్ని ల్యాబ‌రేట‌రీ లో ప‌రీక్షిస్తారు. క్యాన్స‌ర్ క‌ణ‌జాలం ఉన్న‌దీ లేనిదీ నిర్ధారిస్తారు.

అయితే జీర్ణ కోశ వ్య‌వ‌స్థ లోని భాగాల్లో క్యాన్స‌ర్ అను మానించిన‌ప్పుడు మాత్రం బ‌యాప్సీ త‌ప్ప‌నిస‌రి అని భావించ‌రాదు. ఒక్కోసారి బ‌యాప్సీ చేసేట‌ప్పుడు స‌రిగ్గా చూసుకోక‌పోతే ఈ క‌ణ‌జాలం ఇత‌ర భాగాల‌కు సోకే అవ‌కాశం ఉంటుంది. అటువంట‌ప్పుడు బ‌యాప్సీ మాట దేవుడెరుగు కానీ ఈ క్యాన్స‌ర్ క‌ణ‌జాలం ఇత‌ర భాగాల్లో స్థిర‌ప‌డి అక్క‌డ క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. అందుచేత త‌గిన వైద్య స‌ల‌హా మేరకు మాత్ర‌మే బ‌యాప్సీ చేయించ‌టం మేలు.

ప‌సిరిక‌ల తో పాటు ఈ స‌మ‌స్య‌లు ఉంటే జాగ్ర‌త్త‌..!

ప‌సిరిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది చిన్న పాటి చికిత్స‌ల‌తో స‌రి పెడుతుంటారు. సాధార‌ణంగా మందుల‌తో కామెర్లు త‌గ్గిపోతాయి. శాస్త్రీయ‌మైన వైద్యం చేయించుకోవ‌టం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప‌సిరిక‌ల తో పాటు క‌డుపు నొప్పి, బ‌రువు త‌గ్గ‌టం, దుర‌ద‌లు, చ‌లి జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటే ప్ర‌మాదాన్ని శంకించాలి. మ‌లంలో బూడిద‌రంగు ఉండ‌టం లేదా న‌లుపు రంగులో మ‌లం ఏర్ప‌డ‌టం వంటి ల‌క్ష‌ణాల్ని ప‌రిశీలించాలి.

ఇటువంటి ల‌క్ష‌ణాలు ఉంటే శ‌రీరంలో ఇత‌ర ర‌కాల ఇబ్బందులు కూడా ఉన్నాయ‌ని గ‌మ‌నించుకోవాలి. అటువంట‌ప్పుడు త‌గిన వైద్య స‌ల‌హా వెంట‌నే తీసుకోవాలి. నిపుణులైన గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు ను సంప్ర‌దించి వైద్య చికిత్స తీసుకోవాలి. అందుచేత ప‌సిరిక‌ల‌తో పాటు ఉండే ఇత‌ర స‌మ‌స్య‌ల్ని కూడా గమ‌నించి మెల‌గాలి.

ప్ర‌తిష్టాత్మ‌క స‌మావేశాలు..!

అసోసియేష‌న్ ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియా వార్షిక స‌మావేశాలు ఈ సారి మ‌న రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. కాకినాడ‌లోని రంగరాయ వైద్య క‌ళాశాల‌లో APASICON XXXVI ANNUAL STATE CONFERENCE జ‌రుగుతోంది. దీనికి ఇప్పటికే 600 కి పైగా డెలిగేట్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది. దేశ వ్యాప్తంగా ఉన్న స‌ర్జ‌న్ లు హాజ‌ర‌య్యే ఈ స‌మావేశంలో ప్ర‌తిష్టాత్మ‌క లెక్చ‌ర్ 20వ తేదీ ఉన్న‌ది. ఉద‌యం 11 గం.ల‌కు చారి ఎండోమెంట్ లెక్చ‌ర్ నేను ఇవ్వ‌బోతున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి ఆస‌క్తి గ‌ల వారికి ఆహ్వానం.

అతిగా వేపుడు ప‌దార్థాలు తింటే ఏమ‌వుతుంది..!

అతిగా వేపుడు ప‌దార్థాల్ని కొంద‌రు ఇష్ట ప‌డ‌తారు. ఎర్ర‌గా కాల్చిన మాంస‌పు వంట‌ల్ని ఆస్వాదించేవారి సంఖ్య ఇటీవ‌ల పెరుగుతోంది. సాల్ట్ రెడ్ మీట్ వంటి ప‌దార్థాలు తినేట‌ప్పుడు ఇష్టంగా అనిపిస్తాయి. కానీ ఇవి శ‌రీరంలోకి ప్ర‌వేశించాక జీర్ణ ప్ర‌క్రియ స‌మ‌యంలో ఇబ్బంది పెడ‌తాయి.

వాస్త‌వానికి ఆహార ప‌దార్థాలు నోటిలోకొంత‌, క‌డుపులో కొంత‌, చిన్న పేగులో కొంత‌, చివ‌ర‌గా పెద్ద పేగు ప్రారంభంలో మ‌రికొంత జీర్ణం అవుతాయి.చివ‌ర‌గా మిగిలి పోయిన ప‌దార్థాల పునః శోష‌ణ అన్న‌ది పెద్ద పేగులో జ‌రుగుతుంది. ఈ అతిగా వేయించిన పదార్థాలు పేగు గోడ‌ల మీద ప్ర‌భావం చూపుతాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ప‌దార్థాల్ని తీసుకోవ‌టంతో పేగులో దుష్ప‌రిణామాలు చోటు చేసుకొంటాయి. కొన్ని సార్లు క్యాన్స‌ర్ కు దారి తీస్తాయి. ఒక వేళ ఈ అల‌వాటు తో పాటు మ‌ద్యం తాగే అల‌వాటు ఉంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి. అందుచేత ఈ అల‌వాట్ల‌కు దూరంగా ఉంటే మంచిది. మ‌ద్యం అల‌వాటు ఉంటే పూర్తిగా మాన‌టం మేలు.

చిన్న విష‌యాల్లో నిర్ల‌క్ష్య‌మే పెద్ద స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెడుతుంది..!

నిర్లక్ష్యం అన్న‌ది ఎంత చిన్న‌దిగా ఉన్నా ఇబ్బందే. ఒక్కోసారి పెద్ద స‌మస్య‌ల‌కు ఇది కార‌ణం అవుతుంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు గోళ్లు క‌త్తిరించుకోవటం శ‌రీర స‌హ‌జ శుభ్ర‌త లో భాగం. దీన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా చేసుకోవాలి అని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ విష‌యంలో బ‌ద్ద‌కించేస్తుంటారు.

 ఆహారం తినేముందు చేతులు శుభ్రం చేసుకొన్నాం క‌దా అని అనుకొంటారు. కానీ గోళ్లు ఉన్న‌ప్పుడు మాత్రం గోళ్ల మొద‌ళ్ల‌లో శుభ్రం చేసుకోవటం కుద‌ర‌దు. స‌బ్బు ప‌ట్టించినా కూడా ఈ ప్రాంతంలో శుభ్రం చేయటం కుద‌ర‌దు. అక్క‌డ క్రిములు ఇరుక్కొంటే అవి ఆహారం తినేట‌ప్పుడు ఆ క్రిములు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. చెడు చేయ‌టానికి బోలెడు బోలెడు క్రిములు అవ‌స‌రం లేదు. అందుచేత చేతి శుభ్రత‌లో ఎంతో ప్రాధాన్యం దాగి ఉంది. అందుచేత ఎప్ప‌టిక‌ప్పుడు చేతి గోళ్ల‌ను క‌త్తిరించుకొంటూ శుభ్ర‌త పాటించ‌టం మేలు.

పండ‌గ నాడు హెవీగా తినేస్తున్నారా...! శ‌రీరం పెర‌గ‌టానికి అది కూడా కార‌ణ‌మా..!

శ‌రీరం పెరుగుతోంద‌న్న కంప్ల‌యింట్ ఈమ‌ద్య ఎక్కువ‌గా వినిపిస్తోంది. కుర్చీకు అతుక్కొని పోయి ప‌నిచేసే క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో  ఈ స‌మ‌స్య అనేక మంది నుంచి వినిపిస్తోంది.

సాధార‌ణంగా శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకొని పోవ‌టం వ‌ల్ల ఈ స‌మస్య ఏర్ప‌డుతుంది. అందుచేత నిరంత‌ర వ్యాయామం, క్ర‌మ‌బ‌ద్దీక‌రించిన జీవ‌న శైలి తో ఈ స‌మస్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. కొన్ని సార్లు మాత్రం కాలేయంలో స‌మ‌స్య ఏర్ప‌డితే ఈ ఇబ్బంది ఏర్ప‌డుతుంది. చాలామంది ఈ సంద‌ర్భంలో కూడా కొవ్వు ఏర్ప‌డటమే కార‌ణంగా భావించి బ‌ద్ద‌కించేస్తుంటారు. ఇది మాత్రం స‌రి కాదు. కొన్ని రోజుల‌కు ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయితే స‌రి.. లేదంటే మాత్రం ముందుగానే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. అవ‌స‌రమైతే కాలేయ ఫంక్ష‌న్ టెస్ట్ (ఎల్ ఎఫ్ టీ) అనే చిన్న పాటి ప‌రీక్ష చేయించుకోవ‌టం ద్వారా దీన్ని నిర్ధారించుకోవ‌చ్చు. కాలేయంలో స‌మ‌స్య‌ను గుర్తిస్తే మాత్రం దీనికి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అందుచేత జాగ్ర‌త్త ప‌డ‌టం ముఖ్యం.

టీచ‌ర్స్ ను అంతా గుర్తుంచుకొనాలి స‌రే, టీచ‌ర్లు గుర్తుంచుకొనాల్సిందేమిటి..!

అంద‌రికీ ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. స‌మాజానికి దిశా నిర్దేశం చేసే మ‌హోన్న‌త వృత్తిలోఉన్న గురువులంద‌రికీ శుభాభివంద‌నాలు.
వృత్తి ప‌ట్ల మ‌మ‌కారం క‌లిగిన వారిగా టీచ‌ర్ల‌ను చెప్పుకోవ‌చ్చు. నూటికి 90శాతం టీచ‌ర్లు శ్ర‌ద్ధా భ‌క్తుల‌తో విధులు నిర్వ‌హిస్తుంటారు. అయితే ఉద‌య‌మే స్కూల్స్ కు, కాలేజీల‌కు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లు ప‌రిగెత్తుతూ ఉంటారు. ఉద‌య‌మే ఠంచ‌న్‌గా వెళ్లిపోవాల‌ని, క్లాసులు తీసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.

కానీ ఈ హ‌డావుడిలో ఉద‌య‌మే బ్రేక్ ఫాస్ట్ చేయ‌టాన్ని కొంద‌రు ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఇది మంచిది కాదు. రాత్రి ఎప్పుడో తీసుకొన్న ఆహారం నుంచి విడుద‌లైన శ‌క్తి ఉద‌యానికి స‌రిపోతుంది. ఆ త‌ర్వాత చ‌క్క‌గా ప‌నిచేసేందుకు శ‌క్తి అవ‌స‌రం అవుతుంటుంది. ఈ శ‌క్తి విడుద‌ల కావాలంటే ఉద‌య‌మే ఆహారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అందుచేత బ్రేక్ ఫాస్టు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. చ‌క్క‌టి ఆహార‌పు అల‌వాట్ల‌ను కొన‌సాగించాలి. అందుకే ఆద‌ర్శ‌నీయ‌మైన టీచ‌ర్ల‌ను అంద‌రూ అభినందిద్దాం.

త‌రుచు క‌డుపు నొప్పి వ‌స్తోందా..!


సాధార‌ణంగా క‌డుపు నొప్పి అనే స‌మ‌స్య ను ప్ర‌తీ ఒక్క‌రూ ఎప్పుడో ఒక‌ప్పుడు అనుభ‌వించే ఉంటారు. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇది ఏర్పడుతుంది. చాలా సంద‌ర్భాల్లో క‌డుపు నొప్పి దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. ఇంట్లో వాడే చిట్కాల‌తో ఈ నొప్పి కి అడ్డుక‌ట్ట వేయ‌టానికి వీల‌వుతుంది. కానీ ఈ నొప్పి ని పూర్తిగా అశ్ర‌ద్ధ చేయ‌టం మాత్రం కూడ‌దు.

కొన్ని సార్లు క‌డుపు నొప్పితో పాటు విరేచ‌నాలు ఉంటాయి. అందులో రంగు క‌నిపించ‌వ‌చ్చు. అటువంట‌ప్పుడు ఈ నొప్పి విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ఇన్ ఫ్ల‌మేట‌రీ బౌల్ డిసీజ్ లో ఈ రెండు ల‌క్ష‌ణాలు ప్ర‌ధాన‌మైన‌వి. అంటే వీటితో పాటు బ‌రువు త‌గ్గ‌టం, చిరాకు, వంటి ల‌క్ష‌ణాలు ఉంటుంటాయి. అటువంట‌ప్పుడు మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌టం మంచిది కాదు. త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొంటే ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించేందుకు వీల‌వుతుంది. వ్యాధి ముదిరితే మాత్రం శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గ‌తంలో ఇది సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు కాలంలో మాత్రం స‌శాస్త్రీయంగా, సాఫీగా చేసేందుకు వీలవుతోంది. పేగుల్లో పూర్తిగా స‌మ‌స్య ఏర్ప‌డిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. దీన్ని క‌త్తిరించి ఆ భాగాన్ని తీసివేసి పేగుల్ని జ‌త చేసేస్తారు. ఆ త‌ర్వాత నుంచి జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగిపోతుంది. అందుచేత స‌మ‌స్య పదే ప‌దే త‌లెత్తుతున్న‌ప్ప‌డు నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఉంటే బాగుంటుంది.

ఇప్ప‌టికైనా రూటు మార్చుకోండి..!

ఒక ప‌ద్ద‌తికి అల‌వాటు ప‌డితే అంతా అదే మార్గంలో వెళ‌తారు. కానీ ఆ రూట్ లో వెళ్లేట‌ప్పుడు స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌ని తెలిస్తే, రూటు మార్చుకోవ‌టం మేలు.

చేతులు శుభ్ర ప‌రుచుకొనేందుకు స‌బ్బును వాడ‌టం ఎప్ప‌టినుంచో అల‌వాటైన విష‌యం. ఇంట్లో ఉన్న‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌తో ఈ అల‌వాటును కొన‌సాగించ‌టం కొంత వ‌ర‌కు ప‌ర్వాలేదు. పూర్తిగా మంచిద‌ని చెప్ప‌లేం. కానీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అంటే ఆఫీసుల్లో, హోట‌ల్స్ లో మాత్రం స‌బ్బు వాడ‌కం అంత స‌రి కాదు. కొంత మంది టాయిలెట్ కు వెళ్లి వ‌చ్చాక ఈ స‌బ్బును ఉప‌యోగించార‌నుకొందాం.  ఆ త‌ర్వాత ఆ స‌బ్బుతో మ‌నం చేతులు రుద్దుకొని, ఆహారం తీసుకోవ‌టం మొద‌లెడితే స‌బ్బును ఆశ్ర‌యించిన క్రిములు మ‌న చేతి ద్వారా మ‌న శ‌రీరంలోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అంతే కాకుండా వాష్ బేసిన్ ద‌గ్గ‌ర కొంత మేర నీరు నిల్వ ఉండే చాన్సు ఉంది. అక్క‌డ నీళ్ల‌లో స‌బ్బును ఉంచితే మాత్రం అది వ్యాధుల వ్యాప్తికి దారి తీస్తుంది. అందుచేత లిక్విడ్ హేండ్ వాష్ వాడుకోవ‌టం ఉత్త‌మం. అందుచేత ఆఫీసులు, హోట‌ల్స్ లో దీన్ని ఉప‌యోగించుకోవాలి. లేని ప‌క్షంలో సొంతంగా ఒక వాష్ బాటిల్ కూడా ఉంచుకోవ‌టం మేలు. అప్పుడు ఆయా ప్ర‌దేశాల్లో మ‌నం వీటిని వాడుకోవ‌చ్చు.

ఇలాంటి స‌మ‌యంలో రాళ్లు ప‌డితే..!

రాళ్ల గురించి ఆలోచిస్తే కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఇవి తెచ్చి పెట్టే చేటు ప‌రిణామాలు అటువంటివి.
శ‌రీరంలో రాళ్లు పేరుకోవ‌టం అన్న మాట విన‌గానే చాలా మందికి కిడ్నీల్లో రాళ్ల గురించి గుర్తుకొని వ‌స్తుంది. అందుచేత ఇత‌ర శ‌రీర భాగాల గురించి పెద్ద‌గా ఆలోచ‌న రాదు. కానీ కాలేయం నుంచి పైత్య ర‌సాన్ని గ్ర‌హించే  పైత్య ర‌స వాహిక (బైల్ డ‌క్ట్ ), పిత్తాశ‌యం (గాల్ బ్లాడ‌ర్‌) వంటి భాగాల్లో రాళ్లు పేరుకొన వ‌చ్చు.

స‌క్ర‌మంగా లేని ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి స‌రిగ్గా లేక పోవటం వంటి కార‌ణాలతో ఈ ప‌రిస్థితి త‌లెత్త‌వ‌చ్చు. విప‌రీతంగా క‌డుపు నొప్పి రావటం వంటి ల‌క్ష‌ణాల‌తో దీన్ని అనుమానించాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో నొప్పి వ‌చ్చే ప్ర‌దేశాన్ని బ‌ట్టి గుర్తించ వ‌చ్చు. స్కానింగ్ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు. మొద‌టి ద‌శ‌లోనే రాళ్ల‌ను గుర్తిస్తే మందులు వాడ‌టంతో చికిత్స చేయ‌వ‌చ్చు. రాళ్లు ఎక్కువ‌గా పేరుకొంటే మాత్రం ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. ఒక‌ప్ప‌టి కాలంతో పోలిస్తే మాత్రం ఈ ఆప‌రేష‌న్ చాలా తేలిక గా ఉంటున్నాయి. లాప‌రోస్కోపిక్ విధానాల‌తో పెద్ద‌గా గాటు పెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా త్వ‌రిత గ‌తిన ఆప‌రేష‌న్ చేయ‌టానికి వీలవుతోంది. పూర్తి సుర‌క్షితంగా, సునిశితంగా ఆప‌రేష‌న్ చేసేందుకు వీల‌వుతుంది. ఒక రోజు త‌ర్వాత పేషంట్ ను ఇంటికి పంపించేందుకు వీలవుతుంది. అందుచేత శ‌రీరంలోని జీర్ణ అవ‌య‌వాల్లో రాళ్లు ప‌డితే కంగారు ప‌డ‌కుండా నిపుణులైన వైద్యుల‌తో చికిత్స తీసుకోవాలి.

అంతా మీ చేతిలో ఉంది..!

ఏదో అనుకొంటాం కానీ చేతికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఈ చేతిని ఉప‌యోగించుకొనే తీరు ముఖ్యం.
ప్రతీ ఇంట్లో ఉమ్మడి వ‌స్తువుల్ని అంతా తాకాల్సిందే. ముఖ్యంగా డోర్ నాబ్స్ కానీ, టాప్స్ కానీ ఉప‌యోగించేట‌ప్పుడు వాటిని ప‌దే ప‌దే తాకాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో అయితే కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్రమే ఉప‌యోగిస్తుంటారు. ఆఫీసులు కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ చూసుకొన్నట్లయితే వీట‌ని అంతా ఉప‌యోగిస్తుంటారు.

మ‌ల మూత్ర విస‌ర్జన త‌ర్వాత లేదా రొంప‌తో బాధ ప‌డేట‌ప్పుడు ముక్కును ప‌దే ప‌దే చేతితో తుడుచుకొన్నప్పుడు చేతికి ఆ క్రిములు అంటుతాయి. ఈ క్రిములు వ్యాధుల్ని వ్యాపింప చేసే ల‌క్షణాల‌తో ఉంటాయి. ఈ చేతుల‌తో డోర్ నాబ్స్ కానీ, టాప్స్ కానీ ఉప‌యోగించిన‌ప్పుడు ఆ క్రిములు ఆయా వస్తువుల్ని ఆశ్రయిస్తాయి. దీంతో త‌ర్వాత కాలంలో ఆ వ‌స్తువుల్ని ఇత‌రులు వాడిన‌ప్పుడు వారి చేతుల మీద‌కు చేరి త‌ర్వాత ఆహారం తీసుకొనేట‌ప్పుడు ఆ చేతుల గుండా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
సాధ్యమైనంత వ‌ర‌కు డోర్ నాబ్స్, టాప్స్ సైజుల్ని జాగ్రత్తగా ఎంచుకోవ‌టం మేలు. బ‌హిరంగ ప్రదేశాల్లో వీటిని వాడేట‌ప్పుడు త‌గిన జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం తినేట‌ప్పుడు మాత్రం త‌ప్పనిస‌రిగా చేతుల్ని స‌బ్బు నీటితో క‌డుగుకోవ‌టం మ‌రిచిపోవ‌ద్దు. ఇది త‌ప్పనిస‌రిగా చేసుకోవాల్సిన అల‌వాటు.

ఒక వైపు పాడైపోతుంటే - ఈ పాపం ఎవ‌రిది..!

స‌హ‌జంగా ఏదైనా త‌ప్పు జ‌రిగిపోయాక‌, ఈ త‌ప్పు ఎందుకు జ‌రిగింది అనే దానిపై చ‌ర్చ న‌డుస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని గుర్తు చేసుకొంటున్నాం.
ఇటీవ‌ల కాలంలో కాలేయ స‌మ‌స్యలు ఎక్కువ‌గా బ‌య‌ట ప‌డుతున్నాయి. 40 సంవ‌త్సరాలు దాటిన వారిలో ఇటువంటివి గ‌మ‌నిస్తున్నాం.. ఇన్ ఫ్లమేష‌న్‌, సిర్రోసిస్‌, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయి. మాన‌వ శ‌రీరంలో అతి పెద్ద గ్రంథి గా దీన్ని చెప్పవ‌చ్చు. ఇందులో స‌మ‌స్యలకు అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి.

 కానీ మ‌ద్య పానం ముఖ్యమైన‌దిగా క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగే అల‌వాటు ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. శ్రామిక వ‌ర్గాలు త‌మ శ్రమ‌ను మ‌రిచిపోయేందుకు ఇదొక్కటే ఏకైక మార్గం అన్నట్లుగా వ్యవ‌హ‌రిస్తోంది. ఉద్యోగ వ‌ర్గాల్లో ఇది త‌ప్పనిస‌రి అల‌వాటుగా మారుతున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగ‌టం తో అందులోని కెమిక‌ల్స్ శ‌రీరంలోప‌ల‌కు ప్రవేశించి విష పదార్థాలుగా మార‌తాయి. ఈ విష ప‌దార్థాలు కాలేయంలో పోగు ప‌డి వినాశ‌నం సృష్టిస్తున్నాయి. దీంతో అనేక స‌మ‌స్యలు ఉద్భవిస్తున్నాయి. ఇంత‌టి అనారోగ్యాన్ని తెచ్చుపెట్టుకొంటున్నది స్వయంగా ఆయా వ్యక్తులే. దీన్ని గుర్తించుకోవాలి. మ‌ద్య పానం అలవాటు ను పూర్తిగా వ‌దులుకోవటం అత్యుత్తమ ఆరోగ్య అల‌వాటు గా గుర్తించుకోవాలి.

ఒక వైపు పాడైపోతుంటే - ఈ పాపం ఎవ‌రిది..!

స‌హ‌జంగా ఏదైనా త‌ప్పు జ‌రిగిపోయాక‌, ఈ త‌ప్పు ఎందుకు జ‌రిగింది అనే దానిపై చ‌ర్చ న‌డుస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని గుర్తు చేసుకొంటున్నాం.
ఇటీవ‌ల కాలంలో కాలేయ స‌మ‌స్యలు ఎక్కువ‌గా బ‌య‌ట ప‌డుతున్నాయి. 40 సంవ‌త్సరాలు దాటిన వారిలో ఇటువంటివి గ‌మ‌నిస్తున్నాం.. ఇన్ ఫ్లమేష‌న్‌, సిర్రోసిస్‌, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయి. మాన‌వ శ‌రీరంలో అతి పెద్ద గ్రంథి గా దీన్ని చెప్పవ‌చ్చు. ఇందులో స‌మ‌స్యలకు అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి.

కానీ మ‌ద్య పానం ముఖ్యమైన‌దిగా క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగే అల‌వాటు ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. శ్రామిక వ‌ర్గాలు త‌మ శ్రమ‌ను మ‌రిచిపోయేందుకు ఇదొక్కటే ఏకైక మార్గం అన్నట్లుగా వ్యవ‌హ‌రిస్తోంది. ఉద్యోగ వ‌ర్గాల్లో ఇది త‌ప్పనిస‌రి అల‌వాటుగా మారుతున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగ‌టం తో అందులోని కెమిక‌ల్స్ శ‌రీరంలోప‌ల‌కు ప్రవేశించి విష పదార్థాలుగా మార‌తాయి. ఈ విష ప‌దార్థాలు కాలేయంలో పోగు ప‌డి వినాశ‌నం సృష్టిస్తున్నాయి. దీంతో అనేక స‌మ‌స్యలు ఉద్భవిస్తున్నాయి. ఇంత‌టి అనారోగ్యాన్ని తెచ్చుపెట్టుకొంటున్నది స్వయంగా ఆయా వ్యక్తులే. దీన్ని గుర్తించుకోవాలి. మ‌ద్య పానం అలవాటు ను పూర్తిగా వ‌దులుకోవటం అత్యుత్తమ ఆరోగ్య అల‌వాటు గా గుర్తించుకోవాలి.

ఈ మంగ‌ళ‌వారం ప్రత్యేక‌త మీకు తెలుసా..!

ఈ మంగ‌ళ‌వారానికి ఒక ప్రత్యేక‌త ఉంది. దీనికి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉంది.

మాన‌వ శ‌రీరంలో కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి. ఇవి చేసే పని ఇత‌ర అవ‌య‌వాలు చేయ‌లేవు. అటువంటి కీల‌క అవ‌య‌వాలు పాడైతే ఒక‌ప్పుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఉండేది. ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి అయ్యాక ఈ ప‌రిస్థితి మారింది. మూత్రపిండాలు, కాలేయం వంటి భాగాలు పాడైతే వాటిని మార్పిడి చేసే టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. ముఖ్యంగా కాలేయం చేసే ప‌నిని , ఇత‌ర అవ‌య‌వాలు చేయ‌లేవు. పూర్తిగా ఈ అవ‌య‌వం పాడైపోతే మాత్రం దీన్ని మార్చాల్సి ఉంటుంది. అప్పుడు ఇత‌రుల నుంచి కాలేయ భాగాన్ని సేక‌రించి మార్పిడి చేయ‌వ‌చ్చు. దీన్ని సుశిక్షితులైన స‌ర్జన్ లు మాత్రమే చేయ‌గ‌ల‌రు. పాశ్చాత్య దేశాల్లో ఉండేఈ టెక్నాల‌జీ ఇప్పుడు హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇంత‌కీ ఇదంతా ఎందుకంటే... ఈ మంగ‌ళ‌వారాన్ని ఆర్గాన్ డొనేష‌న్ డే గా పాటిస్తున్నారు.

ఈరోజు ప్రత్యేక‌త మీకు తెలుసా..!

ఇవాళ ప్రపంచ హెప‌టైటిస్ డే. ప్రపంచాన్ని క‌బ‌ళించి వేస్తున్న ప్రమాద‌క‌ర వ్యాధుల్లో ఒక‌టిగా గుర్తింపు పొందిన హెప‌టైటిస్ పై ఇవాళ అవ‌గాహ‌న తెచ్చుకోవాల్సి ఉంది.
మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. జీర్ణ వ్యవ‌స్థలో ఇది చురుకైన పాత్ర పోషిస్తుంది. ఉద‌ర కోశంలో కుడి వైపు పై భాగంలోఉంటుంది. చూసేందుకు పెద్దదిగా కనిపిస్తూ జీవ‌న క్రియ‌ల్లో ముఖ్య భూమిక పోషించును. చాలామంది ఇది జీర్ణ క్రియ‌లో మాత్రమే ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవ‌న క్రియ‌ల్లో భూమిక పోషిస్తుండ‌టం వ‌ల్ల కాలేయాన్ని ప్రధాన అవ‌య‌వంగా చెబుతారు.
కాలేయం జీర్ణ వ్యవ‌స్థలో ప్రధానంగా ఉప‌యోగ‌పడుతుంది. కాలేయంలో పైత్యర‌సం త‌యార‌వుతుంది. ఇందులోఎటువంటి ఎంజైమ్ లు ఉండ‌వు. అయిన‌ప్పటికీ ఇందులో ఉండే బైలిరుబిన్‌, బైలివిర్డిన్ అనే వ‌ర్ణక ప‌దార్థాలు ముఖ్యమైన‌వి. ఇవి కాలేయ వాహిక ద్వారా ఆంత్ర మూలంలోకి స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని క‌ఠిన‌ ప‌దార్థాల్ని విచ్ఛిన్నం చేయ‌టంలో ఉప‌క‌రిస్తాయి. దీంతో పాటు మ‌లం త‌యార‌య్యే స‌మ‌యంలో పెద్ద పేగు ద్వారా అక్కడ‌కు చేరుకొని .. దానికి ప‌సుపు రంగును క‌లిగిస్తాయి.
శ‌రీరంలో ప్రస‌ర‌ణ వ్యవ‌స్థకు ర‌క్తం మూలం అన్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు అనే రెండు ప్రధాన క‌ణాల స‌మ్మేళ‌న‌మే ర‌క్తం అన‌వ‌చ్చు. ఇందులో అధిక భాగం ఎర్ర ర‌క్త క‌ణాల‌దే. హీమో గ్లోబిన్ అనే వ‌ర్ణకం ఉండుట చేత వీటికి ఎర్ర ర‌క్త క‌ణాలు అనే  పేరు వ‌చ్చింది. ఇవి శాశ్వత కణాలు కానే కావు. ప్రతీ 120 రోజుల‌కు ఒకసారి ఈ ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోతాయి. మ‌ళ్లీ కొత్త ర‌క్త క‌ణాలు పుట్టుకొని వ‌స్తాయి. ఈ క్రమంలో ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోవ‌టం అనే ప్రక్రియ కాలేయంలో జ‌రుగుతుంది. కాలేయ క‌ణాల వేదిక‌గా  ఈ ఘ‌ట్టం చోటు చేసుకొంటుంది. అయితే ఈ వ్యర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లకుండా కాలేయంలోనే పోగు ప‌డితే దాన్ని కామెర్లుగా వ్యవ‌హ‌రిస్తారు.

కామెర్లకు చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. ఒక‌రకం కామెర్లకు క‌లుషిత నీరు, కలుషిత ఆహారం కార‌ణాలు కాగా, మ‌రో ర‌కం కామెర్లకు అర‌క్షిత ర‌క్తాన్ని ఎక్కించ‌టం, అర‌క్షిత శృంగారం కార‌ణాలుగా చెబుతారు. ఇందులో రెండో ర‌కం కామెర్లు ప్రమాద‌క‌రం గా గుర్తించుకోవాలి.
కామెర్లను ప్రధానంగా క‌ళ్లు ప‌చ్చ ప‌డ‌టం, మూత్రం ప‌చ్చగా మార‌టంతో గుర్తిస్తారు. దీన్ని నిర్ధారించేందుకు మూత్రం, రక్తం ప‌రీక్షలు అవ‌స‌రం అవుతాయి. ఒక‌సారి కామెర్లు నిర్ధార‌ణ అయ్యాక ఆల‌స్యం చేయ‌కుండా నిపుణుల సాయంతో చికిత్స తీసుకోవాలి. కామెర్లకు నాటు మందులు వాడుతుంటారు. ఇది స‌రి కాదు. శాస్త్రీయ‌మైన చికిత్స త‌ప్పనిస‌రి అని గుర్తించుకోవాలి. మ‌ద్యం తాగ‌టం, క‌లుషిత నీరు వాడ‌టం వంటి అల‌వాట్లకు దూరంగా ఉండాలి. సుర‌క్షిత ర‌క్తం, సుర‌క్షిత శృంగారం ముఖ్యం అని గ‌మ‌నించాలి.

హైద‌రాబాద్‌లో జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ

గ‌తంతో పోలిస్తే ఆధునిక కాలంలో కాలేయ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయ‌ని సీనియ‌ర్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. అల్సర్ లు, కామెర్లు, సిర్రోసిస్‌, క్యాన్సర్  వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయ‌ని వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలితో ఏర్పడే ఒత్తిళ్లు, ఒడిదుడుకుల జీవితంతో పాటు మద్యపానం వంటి చెడు అల‌వాట్లు ఇందుకు కార‌ణం అవుతున్నాయని వివ‌రించారు. జీర్ణకోశ కాలేయ వ్యాధుల‌పై న‌గ‌ర వాసుల‌కు అవ‌గాహ‌న కార్యక్రమం ఏర్పాటైంది. హైద‌రాబాద్ దోమ‌ల్ గుడా లోని సాయివాణి  ఆస్పత్రి ప్రాంగ‌ణంలో జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్      గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ అండ్ లివ‌ర్ డిసీజెస్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన అవ‌గాహ‌న కార్యక్రమంలో జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధులు విజ్రంభిస్తున్న తీరు ని వైద్య నిపుణులు వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలిలో ఒత్తిళ్లు, నిర్ణీత స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌టం , ఒకే చోట కూర్చొని ఎక్కువ సేపు ప‌నిచేయ‌టం, హైరానా ప‌డ‌టం ఎక్కువ‌గా జ‌ర‌గుతోంది. దీనికి తోడు పొగ తాగ‌టం, మ‌ద్యం తీసుకోవటం వంటి అల‌వాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కార‌ణాల‌తో జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు ఎక్కువ‌గా విజృంభిస్తున్నాయి. శ‌రీరంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించే వ్య‌వ‌స్థ అయిన జీర్ణ వ్యవ‌స్థ కు స‌మ‌స్యలు ఏర్పడితే ఇత‌ర అవ‌య‌వ వ్యవ‌స్థ కూడా పాడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటువంటి రోగాల్ని ముందుగానే గమ‌నించి స‌మ‌ర్థులైన వైద్య నిపుణుల ద‌గ్గర చికిత్స చేయించుకొంటే స‌మ‌స్యల్ని నివారించ‌వ‌చ్చు. 
జాతీయ జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధుల వైద్య విజ్ఞాన సంస్థ వివ‌రాల్ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ ఆర్‌. వి. రాఘ‌వేంద్ర రావు వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధుల్ని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన అత్యాధునిక డ‌యాగ్నస్టిక్ సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. రోగుల‌కు మెరుగైన చికిత్స అందించేందుకు జాతీయ అంత‌ర్జాతీయ వైద్య సంస్థ ల్లో శిక్షణ పొందిన డాక్టర్ సేతుబాబు, డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్‌, డాక్టర్ వాసిఫ్ అలీ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఆకాష్ చౌదురి అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఈ వైద్య బృందం ఎప్పటిక‌ప్పుడు రోగుల్ని ప‌రీక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుంటుంది. 
జీర్ణ కోశ వ్యాధుల చికిత్స కు 24 గంట‌లూ వైద్య సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్ వెల్లడించారు. కాలేయ వ్యాధుల‌కు ప్రత్యేక యూనిట్ తో పాటు సుశిక్షితులైన సిబ్బంది తో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంద‌ని వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులకు అందుబాటు ధ‌ర‌ల్లో అత్యాధునిక చికిత్సను అందించ‌ట‌మే త‌మ ల‌క్ష్యమ‌ని ఆయ‌న చెప్పారు. 
జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధుల‌కు జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ ను అందుబాటులోకి తేవ‌టం వెనుక  వైద్య నిపుణులు కృషి ఉంది. ఈ కృషి ఫ‌లితంగా అత్యాధునిక అద్భుత వైద్య సేవ‌లు హైద‌రాబాద్‌లోని సాయివాణి సూప‌ర్ ష్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగ‌ణంలోకి అందుబాటులోకి వ‌చ్చాయి.

త‌ర‌చు మ‌న ఇంట్లో దొర్లే త‌ప్పులు..!

ఇంట్లో త‌ర‌చు కొన్ని త‌ప్పులు దొర్లుతుంటాయి. వీటిని గ‌మ‌నించుకొని దిద్దుకొంటే మంచిది. లేదంటే ఆ త‌ప్పుల‌కు మ‌న‌మే న‌ష్టపోవాల్సి ఉంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు ఇంట్లో వంట చేసేట‌ప్పుడు ఎంత‌మందికి అవ‌స‌ర‌మో లెక్క వేసుకొని సుమారుగా వంట చేస్తుంటారు. అటువంటప్పుడు ఒక్కోసారి ఆ వంట చేసిన ప‌దార్థాలు మిగిలిపోతుంటాయి. వీటిని ఏం చేయాల‌నేది స‌మ‌స్య గా మారుతుంది. ఒక్కోసారి అనుకోకుండా ఇంటి ద‌గ్గర ఆహారం ఉన్నప్పటికీ, బ‌య‌ట ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సంద‌ర్భాల్లో ఈ చిక్కుల్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. చాలా మంది దీన్ని ఫ్రిజ్ లో దాచి త‌ర్వాత తీసుకొంటారు.

 ఇటువంట‌ప్పుడు మ‌ళ్లీ ఉప‌యోగించేట‌ప్పుడు ఆ ఆహారం ఎలా ఉందో గ‌మ‌నించుకొని తీసుకోవాలి. క‌క్కుర్తి ప‌డి ఎలా ఉన్నా లాగించేస్తే ఇబ్బంది త‌ప్పదు. మ‌రి కొంద‌రు మాత్రం ఆహారం మిగిలిపోతోంద‌ని కాస్త ఎక్కువ తినేస్తుంటారు. దీంతో అజీర్ణ స‌మ‌స్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళ‌లు ఈ పొదుపు చ‌ర్యలు పాటిస్తుంటారు. మ‌హిళ‌ల్లో శ‌రీరం పెర‌గ‌టానికి ఇది కూడా ఒక కార‌ణంగా గుర్తించారు. అందుచేత ఆహారాన్ని వృధా చేయ‌కూడ‌ద‌నే వాస్తవాన్ని అంతా ఒప్పుకొంటారు. కానీ ఇటువంటి త‌ప్పుల‌తో ఇబ్బంది త‌ప్పద‌ని గుర్తించాలి.

చిన్న చిన్న జాగ్రత్తల‌తో పెద్ద పెద్ద స‌మ‌స్యల్ని త‌ప్పించుకోవ‌చ్చు..!

చిన్న పాటి జాగ్రత్తల‌తో పెద్ద స‌మ‌స్యల్ని తేలిగ్గా త‌ప్పించుకోవ‌చ్చు. అయ్యో ఇది చిన్న విష‌య‌మే క‌దా  అనిపించ‌వ‌చ్చు. కానీ దాని తీవ్రత ఎక్కువ‌గా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు కామ‌న్ ఏరియాలో ఉన్న డోర్ నాబ్ లు, డోర్ హేండిల్స్ ను అంద‌రూ వాడుతుంటారు. ముఖ్యంగా ఆఫీసులు, హోట‌ల్స్ లో ఉండే వాష్ రూమ్స్ ను అంతా వాడుకొంటారు. అటువంట‌ప్పుడు వారు టాయ్ లెట్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు చేతుల్ని స‌రిగ్గా శుభ్రం చేసుకొని ఉండ‌వ‌చ్చు. లేదా చేసుకోకుండా ఉండ‌వ‌చ్చు. అటువంటి వారు డోర్ నాబ్స్, డోర్ హేండిల్స్ తీసిన‌ప్పుడు ఆ చేతుల్ని ఉండే క్రిములు వాటికి అంటుకొంటాయి. వాటిని మ‌నం వాడుతున్నప్పుడు మ‌న చేతికి అవి అంటుకొంటాయి. అందుచేత చేతిని ఆ క్రిములు ఆశ్రయిస్తాయి. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని సక్రమంగా శుభ్రం చేసుకోక‌పోతే ఆ చేతుల‌తో క్రిములు క‌డుపులోకి ప్రవేశిస్తాయి. క‌డుపులో అవి చేసే దుష్ప్రభావం మొద‌లై పోతుంది. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవ‌టం మ‌రిచిపోకూడ‌దు.

ఈ రోజు ప్రత్యేక‌త మీకు తెలుసు క‌దా...!


క్యాలండ‌ర్ లో కొన్ని రోజుల‌కు ఒక్కో ప్రత్యేక‌త ఉంటుంది. ఆయా రోజుల్లో ఆయా ప్రత్యేక‌త‌ల‌ను గుర్తు చేసుకొనే వెసులుబాటు క‌లుగుతుంది. ఈ సంద‌ర్భంగా ఇవ్వాల్టి ప్రత్యేక‌త‌ను మీకు గుర్తు చేస్తున్నాం.
ప్రతీ ఏటా జూలై ఒక‌టో తేదీన డాక్టర్స్ డే గా పాటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మీకు డాక్టర్స్ క‌మ్యూనిటీ త‌ర‌పున శుభాకాంక్షలు..

ప్రముఖ వైద్యులు డాక్టర్ బిద‌న్ చంద్ర రాయ్ జ‌యంతి మ‌రియు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ రోజున డాక్టర్స్ డే గా పాటిస్తున్నాం. వైద్యుల్లో దృవ తార‌గా డాక్టర్ రాయ్ ను చెబుతారు. భార‌త్ లో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స్థాపించి వైద్యుల స‌మైక్యత కోసం కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా వ్యవ‌హ‌రించారు. ఆయ‌న సేవ‌ల‌కు గాను కేంద్ర ప్రభుత్వం భార‌త ర‌త్న తో స‌త్కరించింది.
డాక్టర్స్ డే సంద‌ర్భంగా ఒక ముఖ్య విష‌యాన్ని గుర్తు చేసుకొందాం..స‌మాజంలో క‌నిపించే వ్యాధుల్లో మూడు నుంచి నాలుగో వంతు దాకా వ్యాధుల్ని ముందుగానే నివారించ‌వ‌చ్చు. మాన‌వ చ‌ర్యల కార‌ణంగా ఈ రోగాలు పెచ్చు మీరుతున్నాయి. పొగ తాగటం, మ‌ద్యం తీసుకోవ‌టం, గుట్కాలు న‌మ‌ల‌టం వంటి చెడు అల‌వాట్లకు దూరంగా ఉండాలి. ఆహార‌పు అల‌వాట్లు క్రమ‌బ‌ద్దీక‌రించుకోవాలి. త‌గిన వ్యాయామం, స‌రిప‌డ విశ్రాంతి, ఆందోళ‌న‌లు లేని జీవ‌నాన్ని అల‌వర్చు కోవాలి. స‌మాజ‌మంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల‌ని కోరుకొంటూ.. మ‌రోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు....

ఈ సీజ‌న్ లో ఈ సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు సుమా..!

జూలై నెల వ‌చ్చేసిందంటే రుతుప‌వ‌నాలు ప్రవేశిస్తుంటాయి. ఈ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వ‌ర్షాలు ప‌డుతుండ‌టం స‌హ‌జం. వాన‌లు ప‌డేట‌ప్పుడు దీనికి అనుగుణంగా కొన్ని స‌మ‌స్యలు పుట్టుకొస్తాయి.
వానా కాలంలో తాగునీటితో పాటు క‌లుషిత నీరు కలిసిపోయే అవ‌కాశం ఉంటుంది. అటువంటప్పుడు క‌లుషిత నీటిలోఉండే క్రిములు శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. చాలా జీర్ణ కోశ వ్యాధుల‌కు క‌లుషిత నీరు కార‌ణం కావ‌చ్చు. ముఖ్యంగా కామెర్లు సోకేందుకు ఎక్కువ‌గా చాన్సు ఉండే సీజ‌న్ ఇది. క‌లుషిత నీరు ద్వారా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ సంక్రమిస్తాయి. ఇది మొద‌ల‌య్యాకే వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు లేదా కొద్ది పాటి స‌మ‌యం తీసుకోవ‌చ్చు. కానీ అన‌ర్థం మాత్రం ఒకేలా ఉంటుంది.

 కాలేయంలో తిష్ట వేసిన క్రిములు అక్కడి జీవ‌న క్రియ‌ల‌కు ఇబ్బంది క‌లిగిస్తాయి. దీంతో శ‌రీరంలో వ‌ర్ణకాలు ప‌చ్చగా మారుతాయి.అందుకే దీన్ని పచ్చ కామెర్లు గా పిలుస్తారు. కొన్ని ప్రాంతంలో దీన్ని ప‌సిరిక‌లుగా చెబుతారు. కామెర్లు లేక ప‌సిరిక‌లకు ఆధునిక వైద్యంలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంద‌ని గుర్తించుకోవాలి. నాటు మందుల‌తో స‌రిపెట్టుకొనే కంటే శాస్త్రీయ‌మైన చికిత్స తీసుకోవ‌టం మేల‌ని తెలుసుకోవాలి.
ఎప్పుడైనా వ్యాధి వ‌చ్చాక చికిత్స తీసుకొనే క‌న్నా, వ్యాధి రాకుండా జాగ్రత్త ప‌డ‌టం మేలు. అందుకే ఇటువంటి రోగాలు రాకుండా సుర‌క్షిత తాగునీటిని తీసుకోవాలి. అన్ని వేళ‌లా కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. లేదంటే ఫిల్టర్ ద్వారా క్రిముల్ని దూరం పెట్టవ‌చ్చు. ఇటువంటి తేలిక‌పాటి జాగ్రత్తల‌తో ఎన్నో ప్రమాద క‌ర‌మైన వ్యాధుల్ని నివారించుకోవ‌చ్చు.

ఫుడ్ విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

ఫుడ్ తీసుకొనేట‌ప్పుడు అంద‌రూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కడుపులో అన్నింటినీ కుక్కేసుకొని త‌ర్వాత బాధ ప‌డేకంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవ‌టం మేలు.

ముఖ్యంగా రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారు ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తినేట‌ప్పుడు మనం నెమ్మదిగా న‌మిలి మింగుతుంటాం. అప్పుడు ఆహార‌పు ముద్దలు ... ఆహార వాహిక‌లోకి జార‌తాయి. అక్కడ ఉండే కండ‌రాలు నిర్దిష్టమైన చ‌ల‌నాలు చూపుతాయి. అంటే సంకోచ వ్యాకోచాల‌కు లోన‌వుతాయన్న మాట. అప్పుడు ఆహార‌పు ముద్ద నెమ్మదిగా కింద‌కు జారిపోయి జీర్ణాశ‌యంలోకి ప్రవేశిస్తుంది. ఈ కండ‌ర సంకోచాలు ఒకే వైపుకి ఉండ‌టం వ‌ల‌న ఆహారం కింద‌కు వెళుతుంది త‌ప్పితే మ‌ళ్లీ తిరిగి వెన‌క్కి రావ‌టం జ‌ర‌గ‌దు. కానీ రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారికి మాత్రం ఈ కండ‌ర చ‌ల‌నాల్లో స‌మ‌స్య ఉండ‌టంతో ఆహారం వెన‌క్కి వ‌స్తుంటుంది. అంటే ఆహారం తిన్న త‌ర్వాత కొంత‌మందిలో తేన్పులు రావ‌టం, కొంత మందిలో గ్యాస్ రావ‌టం, మరికొంద‌రిలో ఆహార‌పు ముద్దలు వెనక్కి రావటం జ‌రుగుతుంటాయి.
ఇటువంటి స‌మ‌స్య ఉన్న వారు ఆహారం విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా వేడెక్కించిన వేపుడుల‌కు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువ‌గా తాగ‌టం మంచిది కాదు. క్రమం త‌ప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. రాత్రి భోజ‌నం త‌ర్వాత వెంట‌నే నిద్రకు ఉప‌క్రమించ‌రాదు. బోజ‌నం త‌ర్వాత 2 లేక 3 గంట‌ల పాటు విరామం ఉండాలి. ప‌డుకొనేట‌ప్పుడు మిగ‌తా శ‌రీర భాగాల‌తో పోలిస్తే త‌ల భాగం ప10 డిగ్రీల ఎత్తు ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి నియ‌మాలు అంద‌రికీ మంచిదే అని గుర్తుంచుకోవాలి.

ఈ కాలం యువ‌తలో ఈ ల‌క్షణం ఉంటే జాగ్రత్త..!

యువ‌త ఈ మ‌ధ్య కాలంలో ఫ్రెండ్స్ మోజులో ప‌డుతున్నారు. స్నేహితులు చెప్పిన‌ది విన‌టం, వాళ్లు చేసేది చేయ‌టం వంటివి చేస్తున్నారు. దీంతో కొన్ని సార్లు మంచి, కొన్ని సార్లు చెడు జ‌రుగుతున్నాయి.

దుర‌ల‌వాట్లలో ఇటీవ‌ల కాలంలో గుట్కా న‌మ‌లటం ఎక్కువ అయింది. ప‌ల్లెటూర్లలో పొగాకు ను ముక్కలు చేసుకొని న‌మిలేవారు. అది ప‌ల్లె వాసుల అల‌వాటు గా ఉండేది. ఇప్పుడు గుట్కా న‌మ‌ల‌టం మాత్రం ఫ్యాష‌న్ అయిపోయింది. ర‌క ర‌కాల పేర్లతో దొరుకుతున్న ఈ పొగాకు ఉత్పత్తి... ప్రమాద‌క‌ర‌మైన‌దిగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ ప్యాకెట్ ల పైన కూడా ప్రభుత్వ సూచ‌న మేర‌కు హెచ్చరిక లు ముద్రిస్తున్నారు. ఇటువంటి ఉత్పత్తుల‌ను క్రమం త‌ప్పకుండా న‌ములుతుండ‌టం వ‌ల‌న నోటిలో పుండ్లు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమేణా అల్సర్ లుగా ఏర్పడుతున్నాయి. ఇవి ముదిరి క్యాన్సర్ కు దారి తీసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కొంత మంది ఈ అల‌వాటు తో ప్రాణాలు పోగొట్లుకొన్నట్లు గుర్తించారు. మొద‌ట్లో ఆస‌క్తి క‌రంగా అనిపించిన ఈ అల‌వాటు త‌ర్వాత కాలంలో విడ‌దీయ‌రాని అల‌వాటు అయిపోతోంది.

పేగు టీబీ - అవ‌గాహ‌న‌

టీబీ అంటే ట్యూబ‌ర్ క్యులోసిస్ అని అర్థం. సాధార‌ణంగా ఊపిరితిత్తుల‌కు సోకే దీర్ఘకాలిక వ్యాధిగా దీని గురించి చాలా మందికి తెలుసు. బ్యాక్టీరియా క్రిముల సంక్రమించ‌టంతో ఈ రోగం అంటుకొంటుంది.  ఈక్రిములు  ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి శ్వాస ప్రక్రియ‌లో ఇబ్బంది పెడుతుంటాయి. తీవ్రమైన ద‌గ్గు, బ‌రువు త‌గ్గిపోవటం వంటి ల‌క్షణాలు గోచ‌రిస్తాయి.

అటువంటి టీబీ కొన్నిసార్లు పేగుల‌కు కూడా సోకుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఇన్ ఫెక్షన్ పేగుల‌కు వ్యాపించ‌వ‌చ్చు. లేదా టీబీ కి సంబంధించిన క‌ళ్లె ను మింగిన‌ప్పుడు - ఆ క్రిములు పేగుల్లో ప్రవేశిస్తాయి. అప్పుడు అక్కడ వ్యాది ఏర్పడుతుంది. ఇది దీర్ఘ కాలికంగా ప‌రిణ‌మించవ‌చ్చు. బ‌రువు త‌గ్గిపోవటం, క‌డుపులో నొప్పి వంటి ల‌క్షణాల్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. జ్వరం కూడా వ‌స్తుంటుంది. పేగుల్లో టీబీ సోకిన‌ట్లు గ‌మ‌నిస్తే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. క‌చ్చిత‌మైన మందుల్ని వాడ‌టంతో పేగు టీబీ కి చికిత్స దొర‌కుతుంది. పేగు టీబీ అసాధార‌ణ వ్యాధి కాద‌ని గుర్తించుకోవాలి.

కుటుంబ చ‌రిత్ర కూడా ముఖ్యమే..ఇటువంటి చోట్ల అవ‌స‌రం కూడా..!

ఒక వ్యక్తి గురించి తెలుసుకొనే ముందు కుటుంబ చ‌రిత్ర కూడా ప‌ట్టించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సారి దీనికి ప్రాధాన్యం ఉంటుంది. మ‌రీ వంశంలోని త‌ర త‌రాల్ని ఏక‌రువు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు కాని ద‌గ్గర సంబంధీకుల విష‌యం తెలుసుకోవాలి.

ఆరోగ్యం విష‌యంలో కుటుంబ స‌భ్యుల ఆరోగ్య చ‌రిత్ర తెలుసుకోవాలి. చిన్న వ‌య‌స్సులోనే పేగు క్యాన్సర్ తో ఎవ‌రైనా చ‌నిపోతే సంబంధిత కుటుంబ స‌భ్యులు కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది జ‌న్యుపర‌మైన మార్పుల‌తో వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అంటే ఇదే స‌మ‌స్య సంబంధిత కుటుంబ స‌భ్యుల జ‌న్యువుల్లో కూడా దాక్కొని ఉండ‌వ‌చ్చు. అది బ‌య‌ట ప‌డితే మాత్రం క్యాన్సర్ గా ఏర్పడ‌వ‌చ్చు. పేగులో ఏర్పడే ఈ స‌మ‌స్యను హెరిడిట‌రీ పాలీపోసిస్ కొలై అని పిలుస్తారు. అంటే పేగుల్లో పాలిప్స్ మాదిరిగా ఏర్పడ‌తాయ‌న్న మాట‌. ఇటువంటి పేగు క్యాన్సర్ అనుమానం క‌లిగితే కొలినోస్కోపీ ప‌రీక్ష ద్వారా తెలుసుకొనేందుకు వీల‌వుతుంది. కుటుంబంలో ఎవ‌రైనా పేగు క్యాన్సర్ కు గురైతే మాత్రం మిగిలిన స‌భ్యులు కూడా అనుమానం క‌లిగిన‌ప్పుడు వెంట‌నే స్పందిస్తే మేలు. ఒక వేళ ఇది నిర్ధారణ అయితే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్య చికిత్సల సాయంతో మెరుగైన చికిత్స పొంద‌వ‌చ్చు. క్యాన్సర్  ప్రారంభ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ విధానాల‌తో స‌రిచేయ‌వ‌చ్చు. వ్యాధి ముదిరితే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్సలు అవ‌స‌రం అవుతాయి. అటువంట‌ప్పుడు రోగికి నాణ్యత‌తో కూడిన శేష జీవితాన్ని అందించేందుకు వీల‌వుతుంది.

న‌గ‌ర వాసుల‌కు క్యాన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువా..!

న‌గ‌ర వాసుల‌కు క్యాన్సర్ చాన్సెస్ ఎక్కువ అని నేరుగా చెప్పేందుకు వీలు లేదు. కానీ కొన్ని కార‌కాలు మాత్రం ఇందుకు దోహ‌ద‌ప‌డుతుంటాయి అని చెప్పవ‌చ్చు.

క్యాన్సర్ అంటే అవాంఛ‌నీయ క‌ణ‌జాలం ఒక్క చోట పేరుకొని పోవ‌టం అనుకోవ‌చ్చు. ఈ విధంగా పేరుకొన్న క‌ణ‌జాలం స‌జీవ క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేయ‌టం వ‌ల‌న స‌మ‌స్య ఏర్పడుతుంది. క్రమేణా ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇందులో క‌ణాల్లో ఉండే డీఎన్ ఎ లో ఆక‌స్మికంగా త‌లెత్తే మార్పుల కార‌ణంగా ఉత్పరివ‌ర్తనం (మ్యూటేష‌న్ ) చెంద‌టంతో క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇందుకు ప్రధానంగా వాతావ‌ర‌ణ మార్పులు లేక వాతావ‌ర‌ణ కాలుష్యం ను చెబుతారు. దీంతో పాటు పొగ తాగ‌టం, మ‌ద్యం తీసుకోవ‌టం వంటి దుర‌ల‌వాట్లను పేర్కొంటారు. వీటి కార‌ణంగా క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. న‌గ‌రాల్లో ఉండే ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా కాలుష్యానికి గుర‌వ‌టం తో పాటు న‌యా అల‌వాట్ల పేరుతో చెడు అల‌వాట్లకు బానిస అవ‌టం జ‌రుగుతుంటుంది. దీంతో క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చని చెబుతారు. అంతే కానీ, క్యాన్సర్ కు ప‌ట్టణ వాసులు లేక ప‌ల్లె వాసులు అన్న తేడా మాత్రం ఉండ‌దు సుమా..!

వానా కాలంలో ఈ జాగ్రత్త త‌ప్పనిస‌రి..!

వాన‌లు మొద‌ల‌య్యాక నీటి స‌ర‌ఫ‌రాలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోచోట తాగునీటి గొట్టాలు ప‌గిలిన‌ప్పుడు క‌లుషిత నీరు అందులో ప్రవేశిస్తుంది. లేదా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అక్కడ సుర‌క్షితం కాని నీటిని ఒక్కో సారి తీసుకోవాల్సి వ‌స్తుంది. సామూహిక ప్రదేశాల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా సుర‌క్షితంగా ఉండ‌క పోవ‌చ్చు. ఇటువంటి సంద‌ర్భాల్లో తాగునీరు క‌లుషితం కావ‌చ్చు. అంటే తీసుకొనే నీటిలో కాలుష్య కార‌క సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు ఉండ‌వ‌చ్చు. వీటితో ప్రమాద‌క‌ర‌మైన డ‌యేరియా తో పాటు కామెర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. ఈ రెండు ర‌కాల క్రిములతో జీర్ణ వ్యవ‌స్థ లోని కాలేయంలో క‌ణ‌జాలం పాడవుతుంది. ఫ‌లితంగా కామెర్లు సోక‌వ‌చ్చు. అందుచేత ఈ సీజ‌న్ లో సుర‌క్షిత‌మైన తాగునీటిని తీసుకోవాలి.

 అన్ని వేళ‌లా కాచి చ‌ల్లార్చి, వ‌డ‌గ‌ట్టిన తాగునీరు ఉత్తమం. ఇది సాధ్యం కాక‌పోతే క‌నీసం ప్యూరిఫ‌యిర్ల ద్వారా అయినా సుర‌క్షిత తాగునీటిని తీసుకోవాలి. అనుమానం ఉన్న చోట్ల, వెసులు బాటు క‌లిగిన వారు హెప‌టైటిస్ కు వ్యాక్సీన్ దొర‌కుతుంది. దీన్ని ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు.  కొంత‌మంది ఈ సీజ‌న్ లో పానీ పూరి వంటివి ఎక్కువ తీసుకొంటారు. అటువంటి చోట దొరికే నీరు ఎటువంటిదో తేలిగ్గా తెలిసిపోతుంది. బ‌య‌ట హోట‌ల్స్ లో కూడా స‌రైన నీరు ఇస్తున్నారో , లేదో అక్కడ ప‌రిస్థితుల్ని గ‌మ‌నిస్తే అర్థం అయిపోతుంది.  క్రమం త‌ప్పకుండా క‌లుషిత నీరు తీసుకోంటే ఇబ్బంది ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

పిల్లల్లో త‌లెత్తే మ‌రో స‌మ‌స్య..!

పిల్లలు పుట్టిన వెంట‌నే త‌ల్లి నుంచి సుర‌క్షితంగా వేరు చేస్తారు. ఈ క్రమంలో బొడ్డును క‌త్తిరించి వేరు చేయ‌టం జరుగుతుంది. ఈ స‌మ‌యంలో సుర‌క్షిత‌మైన సాధ‌నాన్ని వాడాల్సి ఉంటుంది.లేదంటే దీని నుంచి ఇన్ ఫెక్షన్ త‌లెత్తే చాన్సు ఉంది. వాస్తవానికి తల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడు ఈ మార్గం ద్వారానే ఆహారం, ఆక్సిజ‌న్ మొద‌లైన‌వి శిశువుకి అందుతుంటాయి.

 ఇది బిడ్డ శ‌రీరంలోని కాలేయ ప్రాంతంలోని వాహ‌క ర‌క్త నాళాల ద‌గ్గర అతికి ఉంటుంది. ప్రస‌వం స‌మ‌యంలో ఇన్ ఫెక్షన్ త‌లెత్తిన‌ప్పుడు ఇది శిశువు కి వ్యాపిస్తుంది. చిన్నారి శ‌రీరంలోని వాహ‌క ర‌క్త నాళాల‌కు ఇది సోకుతుంది. అప్పుడు శిశువు పెద్ద అయ్యే కొద్దీ స‌మ‌స్యలు ఏర్పడుతాయి. ర‌క్త ప్రసారంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని ఎక్స్ ట్రా హెపాటిక్ పోర్టల్ వీన్ అబ్ స్ట్రక్షన్ అని పిలుస్తారు. ఇటువంటి స‌మ‌స్యలు రాకుండా వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో సుర‌క్షిత ప్రసావానికి ప్రయ‌త్నించాలి.

వాళ్లకు లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తోందా..!

ప‌చ్చ కామెర్లు వ‌స్తే లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తుంది అని సామెత ఉంది. ఇది ఎందుకు పుట్టిందంటే కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు క‌ళ్లు ప‌చ్చగా మార‌తాయి. దీంతో అన్నీ ప‌చ్చగా క‌నిపిస్తుంటాయ‌ని చెబుతారు. వాస్తవానికి క‌ళ్ల లో బైలిరూబిన్ అనే వ‌ర్ణ కం పేరుకొని పోవ‌టం వ‌ల‌న ఈ ప‌రిస్థితి ఏర్పడుతుంది. సాదార‌ణంగా క‌ళ్లు ప‌చ్చబ‌డిన‌ప్పుడే కామెర్లుగా చెబుతారు.

అయితే ఇక్కడ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. కామెర్ల వ్యాధి కి త‌గిన చికిత్స తీసుకొంటే కొన్ని రోజుల‌కే త‌గ్గిపోతుంది. ఒక్కో సారి శ‌రీరంలో వ్యాధి త‌గ్గిపోయినా కూడా క‌ళ్లకు ఉండే ప‌చ్చద‌నం త‌గ్గదు. దీనికి కార‌ణం ఏమిటంటే అక్కడ పేరుకొన్న బైలిరూబిన్ వ‌ర్ణకం పూర్తిగా తొల‌గిపోవ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి 3-4 వారాల స‌మ‌యం ప‌డుతుంది. అంటే అటువంట‌ప్పుడు శ‌రీరంలో కామెర్లు త‌గ్గిపోయినా, క‌ళ్లలో మాత్రం ప‌చ్చద‌నం నిలిచే ఉంటుంది.

రాళ్లతో ఎప్పటికీ స‌మ‌స్యే..!

జీర్ణ వ్యవ‌స్థ లో క్లోమం, పిత్తాశ‌యం వంటి భాగాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ అవాంచ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోయి రాళ్లు గా మార‌తాయి. ఈ రాళ్లు అక్కడ జీర్ణ ఎంజైమ్ ల ప్రసారానికి అడ్డు త‌గులుతూ ఉంటాయి. దీంతో అక్కడ స్రావ‌కాలునిలిచిపోతాయి. దీంతో నొప్పి ఏర్పడుతుంటుంది. రెండు భాగాల్లో రాళ్లు ఏర్పడ‌టం, వాటి విధానం వేర్వేరుగా ఉంటాయి. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగ్గా లేక‌పోవ‌టం, జ‌న్యు ప‌ర‌మైన తేడాలు ఉండ‌టం, మ‌ద్యం వంటి చెడు అల‌వాట్లు, హార్మోన్‌ల అస‌మ‌తుల్యత వంటివి స్థూలంగా కార‌ణాలు అని చెప్పవ‌చ్చు.

 తీవ్రమైన నొప్పిని ప్రధానంగా చెప్పవ‌చ్చు. వాంతులు, నిద్ర ప‌ట్టక‌పోవ‌టం వంటివి కార‌ణాలుగా చెప్పవ‌చ్చు. స‌రైన డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ర‌క్త ప‌రీక్ష, సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ వంటి ప‌రీక్షల‌తో నిర్ధారించ‌వ‌చ్చు. రాళ్లను పూర్తిగా వ‌దిలించుకోవ‌టమే ఈ స‌మ‌స్యకు అంతిమ ప‌రిష్కారం అని గుర్తుంచుకోవాలి. మందులు వాడితే త‌గ్గని సందర్భాల్లో ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంటుంది. నిపుణులైన స‌ర్జన్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అధునాత‌న ప‌రికరాలు అందుబాటులోకి రావ‌టంతో లాప‌రోస్కోపిక్ విధానాల‌తో నూటికి నూరు శాతం విజ‌యవంతం అయ్యేట్లుగా శ‌స్త్ర చికిత్సలు చేయ‌టానికి వీల‌వుతోంది.

క‌డుపులో నొప్పి వ‌స్తే కంగారు ప‌డాలా..!

క‌డుపులో నొప్పి అన్నది చాలా మంది ఎప్పుడో ఒక‌ప్పుడు ఎదుర్కొనే స‌మ‌స్య. చాలా సార్లు అది దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. విరోచ‌నాలు అయిన‌ప్పుడు లేదా, జీర్ణం స‌రిగ్గా కాన‌ప్పుడు లేదా ప‌డని ప‌దార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి త‌లెత్తుతుంది. కొన్ని సార్లు సాధార‌ణ చిట్కాల‌తో కూడా ఇది త‌గ్గిపోతుంటుంది. అందుచేత క‌డుపులో నొప్పి అంటే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, కొన్ని సార్లు మాత్రం నొప్పి విప‌రీతంగా వ‌స్తున్నా, లేక తీవ్రంగా నొప్పి బాధిస్తున్నా మాత్రం ఆలోచించాల్సిందే. ఆ నొప్పి వ‌స్తున్న ప్రాంతాన్ని బట్టి క‌డుపులో ఆయా ప్రాంతంలో ఉండే అవ‌య‌వంలో ఇబ్బంది ఏర్పడి ఉంటుంద‌ని ఊహించ‌వ‌చ్చు. అందుచేత‌నే అక్కడ నొప్పి వ‌స్తుంద‌ని ఒక సాధార‌ణ అంచ‌నా కు రావ‌చ్చు.

క‌డుపు మ‌ధ్య లో నొప్పి వ‌చ్చి, కింద‌కు కుడివైపు కు వ్యాపిస్తే అపెండిక్సు నొప్పి అంటారు. అంటే అపెండిక్సు (తెలుగులో ఉండుకం అంటారు.) ఎడ‌మ వైపు కింది భాగంలో నొప్పి వ‌చ్చి కుడి వైపుకి వ్యాపిస్తే పేగు నొప్పి అని చెబుతారు. కుడి వైపు పై భాగంలో నొప్పి వ‌స్తే కాలేయం లేదా పిత్తాశ‌య‌పు నొప్పిగా, ఎడ‌మ వైపు వ‌స్తే క్లోమంలో స‌మ‌స్యగా చెప్పవ‌చ్చు. ఇది ఒక అంచ‌నా మాత్రమే. క‌చ్చితంగా నొప్పి కి కార‌ణం తెలుసుకోవాలంటే డ‌యాగ్నస్టిక్ ప‌రీక్షలు చేయించుకోవాలి. నిపుణులైన వైద్యుల సాయంతో ప‌రీక్ష చేయించుకోవాలి.

చేతుల శుభ్రత‌.. దాని ప్రాధాన్యం..!

చేతులతో చాలా ప‌నులు చేస్తుంటాం. ఇత‌ర జంతువుల‌తో పోలిస్తే కేవ‌లం మాన‌వునికి మాత్రమే చేతులు ఉన్నాయి. వాటిని ఉప‌యోగించుకోవ‌టం మాన‌వునికే సాధ్యం.

భార‌త దేశంలో దాదాపుగా అంద‌రూ చేతితోనే భోజ‌నం చేస్తారు. స్పూన్‌లు, ఫోర్కులు ఉప‌యోగించ‌టం త‌క్కువ‌. అందుచేత చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చేతులను అంటుకొని ఉన్న క్రిములు శ‌రీరంలోకి చేర‌తాయి. చేతులు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎక్కడ ప‌డితే అక్కడ వేస్తుంటారు. ఇది మంచిది కాదు. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో చేతుల్ని ఉప‌యోగించుట త‌గ్గించుకోవాలి. అస‌లు అంత‌క‌న్నా మంచి అల‌వాటు ఏమిటంటే భోజ‌నానికి ముందు, వంట‌కు ముందు అర‌చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు ఎప్పటిక‌ప్పుడు గోళ్లను పూర్తిగా క‌త్తిరించుకోవాలి. లేదంటే గోళ్లకు దిగువ‌న క్రిములు దాక్కొని ఉంటాయి. చేతులు పై పైన క‌డిగేసుకొని వెళ్లిపోతే అక్కడ దాగి ఉన్నక్రిములు శ‌రీరంలోకి ప్రవేశించే చాన్సు ఉంటుంది. దీంతో స‌మ‌స్యలు తలెత్తుతాయి. అందుచేత భోజ‌నం, వంట‌కు ముందు...మ‌ల విస‌ర్జన‌, వాహ‌నాలు, ఇళ్లు శుభ్రం చేసిన త‌ర్వాత చేతుల్ని స‌బ్సు లేక లిక్విడ్ తో క‌డుక్కోవాలి.

ఆ సంగ‌తి తెలిస్తే క‌డుపు మండిపోతోంది..!

క‌డుపు మంట అంటే చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. ఎందుచేత ఈ మంట వ‌స్తోందో తెలుసుకొంటే అస‌లు విష‌యాలు అర్థం అవుతాయి. లేదంటే స‌మ‌స్య పెద్దది అవుతుంది.
క‌డుపు లో అల్సర్ లు ఏర్పడిన‌ప్పుడు మాత్రం ఈ మంట తీవ్రంగా ఉంటుంది. జీర్ణాశ‌యం పొర‌ల్లో కానీ, ఆంత్ర మూలం (డుయోడిన‌మ్ ) పొర‌ల్లో కానీ ఇది ఏర్పడుతు ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన కార‌ణం ఉండ‌క పోవ‌చ్చు. హెలికో బాక్టర్ పైలోరీ వంటి బ్యాక్టీరియాల సంక్రమ‌ణ తో కానీ, ఎక్కువ‌గా పెయిన్ కిల్లర్స్ వాడ‌కంతో కానీ, స‌రైన ఆహార‌పు అల‌వాట్లు లేక‌పోవ‌టంతో కానీ ఇవి ఏర్పడుతుంటాయి. ఆల్కహాల్  ఎక్కువ‌గా తీసుకోవ‌టం, కాలేయంలో స‌మ‌స్య‌లు ఉన్నా కూడా ఇందుకు కార‌ణం అవుతుంటాయి.

 క‌డుపులో విప‌రీతంగా ముఖ్యంగా మ‌ధ్య లో కానీ, ఎగువ భాగంలో కానీ విప‌రీతంగా మంట పుడుతుంది. గుండెల్లో కూడా మంట ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. ఆహార‌పు అల‌వాట్లు మార్చుకోవ‌టం, దుర‌ల‌వాట్లు వ‌దిలేసుకోవ‌టంతో పాటు నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకొంటే ఈ మంట స‌మ‌స్య త‌గ్గుతుంది. మందుల‌తో పాటు కొన్ని సార్లు చిన్న పాటి ఆప‌రేష‌న్ కూడా అవ‌స‌రం అవుతుంది. అందుచేత ప్రమాద తీవ్రత‌ను బ‌ట్టి వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
అల్సర్ ఉంద‌ని తెలియ‌గానే క‌డుపులో ఆందోళ‌న తెచ్చుకోకూడ‌దు. దీంతో మంట‌, ఆందోళ‌న మ‌రింత పెరుగుతుంది. స్థిమితంగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

చిన్నారుల్లో కామెర్లు ప్రమాద‌క‌ర‌మా.. కాదా..!

అప్పుడే పుట్టిన ప‌సివాళ్లకు కామెర్లు వ‌స్తుంటాయి. చాలా మందిలో ఇది క‌నిపిస్తుంటుంది. వీటిని బాల కామెర్లు అంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది 2,3 వారాల్లో త‌గ్గిపోతుంది. ఒక్కో సారి మాత్రం ఈ కామెర్లు త‌గ్గకుండా కొన‌సాగుతాయి. వాస్తవానికి అప్పుడే పుట్టిన ప‌సివాళ్లలో అన్ని అవ‌య‌వాలు పూర్తిగా విచ్చుకోవు. నిదానంగా ఆయా శ‌రీర భాగాలు చురుగ్గా పుంజుకొంటాయి. ఈ విస్తరించే క్రమంలో కామెర్లు ఉంటే కాలేయం స‌క్రమంగా రూపు దిద్దుకోదు. అటువంట‌ప్పుడు వెంట‌నే మేలుకోక‌పోతే ఇబ్బంది త‌ప్పదు. దీన్ని ఎక్సట్రా హెపాటిక్  బిలియ‌రీ అట్రాజియా అంటారు. ఈ స‌మ‌స్యను సాధ్యమైనంత తొంద‌ర‌గా స‌రిదిద్దాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించాలి. లేదంటే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకొక విష‌యం ఇక్కడ స్పష్టం చేయాల్సి ఉంది. చిన్నారుల‌కు వ‌చ్చిన అన్ని కామెర్లు ఇంత‌టి ప్రమాదం కానే కాదు. చాలావ‌ర‌కు కామెర్లు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. ఒక వేళ కొన‌సాగితే మాత్రమే చికిత్స అవ‌స‌రం అని గుర్తించాలి.

కొవ్వెక్కిందా..! అన్న స్టేట్ మెంట్ లో త‌ప్పేంటి..?

కొవ్వు అన్న ప‌దం వాస్తవానికి నెగ‌టివ్ షేడ్ లో వాడ‌తారు. అందుచేత‌నే కొవ్వెక్కిందా.. అన్న మాట అంటే ఎవ‌రికైనా కోపం వ‌స్తుంది. నిజానికి కొవ్వు పెర‌గ‌టం అన్న ది అనారోగ్య సూచ‌కం కాబ‌ట్టి ఈ ర‌క‌మైన పద ప్రయోగం పుట్టి ఉండ‌వ‌చ్చు.

శ‌రీరంలో కొవ్వు ప‌దార్థాలు పెరిగితే.. అవి విభిన్న శ‌రీర అవ‌య‌వాల్లో డిపాజిట్ అయిపోతాయి. కాలేయంలో ఈ ర‌క‌మైన కొవ్వు ప‌దార్థాలు పేరుకొంటే ఫ్యాటీ లివ‌ర్స్ గా చెబుతారు. ఈ కొవ్వు క‌ణ‌జాలం కార‌ణంగా కాలేయం ప‌ని తీరు దెబ్బతింటుంది. అంతే గాకుండా అక్కడ ప్రస‌ర‌ణ‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో మ‌రిన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. కాలేయంలో కొవ్వులు పేరుకొన్నట్లు గుర్తిస్తే మాత్రం వెంట‌నే మేలుకోవాలి. త‌గిన చ‌ర్యలు తీసుకోవ‌టం ద్వారా వీటిని వ‌దిలించుకోవాలి. లేదంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ప‌రిస్థితిని నాలుగు ద‌శ‌లుగా చెబుతారు. గ్రేడ్ 1,2 ద‌శ‌ల్లో ఉంటే మాత్రం శారీర‌క వ్యాయామంతో రిలీఫ్ ఏర్పడుతుంది. నూనెలు, వేపుళ్లు త‌గ్గించి వాడ‌టం వంటి చ‌ర్యలు తీసుకోవాలి. గ్రేడ్ 3,4 ద‌శ‌ల‌కు వెళితే మాత్రం మందులు వాడాల్సి ఉంటుంది. లేదంటే అవాంఛిత ప‌దార్థాలుగా మారి ప్రస‌ర‌ణ‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది క్రమంగా లివ‌ర్ సిర్రోసిస్ అనే వ్యాధి కి దారి తీస్తుంది. అప్పుడు మ‌రింత చికిత్స అవ‌స‌రం అవుతుంది.

ప్రతీరోజూ తాగ‌టం మంచిదే.. ఎలాగంటారా..!

తాగ‌టం అన్నది ఎప్పటినుంచో ఉన్న అల‌వాటు. దీని ప్రభావం ఏమిటి, ఎలా ఉంటుంది అన్నది మాత్రం త‌ప్పకుండా గ‌మ‌నించాల్సిందే సుమా..! చూసుకోకుండా ఎడా పెడా తాగేయ‌టం మాత్రం మంచిది కాదు.

అయితే ఈ తాగ‌టం అన్నది నీరు తాగ‌టం గురించి సుమా..! అంతే కానీ ఏమాత్రం అపార్థం చేసుకోవ‌ద్దు. ప్రతీరోజు క్రమం త‌ప్పకుండా నీటిని త‌గుపాళ్ల లో తాగ‌టం మంచి అల‌వాటు. ఎందుచేత‌నంటే శ‌రీరంలో దాదాపు 60 శాతం దాకా నీటితో నిర్మిత‌మై ఉంటుంది. ఇందులో కండ‌రాలు 75శాతం, మెద‌డు 90 శాతం, ఎముక‌లు 20 శాతం, ర‌క్తం 80 శాతం దాకా నీటిని క‌లిగి ఉంటాయి. శ‌రీరంలోని ఈ ద్రవాలు జీర్ణ క్రియ‌, శోష‌ణ‌, ప్రస‌ర‌ణ‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య క్రియ‌ల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుచేత నీటిని తాగ‌టం ద్వారా ఈ శ‌రీర ద్రవాల్ని స‌మతౌల్యంతో ఉంచేందుకు వీల‌వుతుంది. రోజుకి స‌రిప‌డా నీటిని తీసుకొంటే ఈ ప్రక్రియ‌లు స‌జావుగా సాగుతాయి. ముఖ్యంగా వేస‌విలో ఈ నీటి అవ‌స‌రం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. అంతేగాకుండా అధిక క్యాల‌రీల‌ను నివారించ‌టంలో కూడా ముఖ్య పాత్ర వ‌హిస్తుంది. చ‌ర్మం తేజోవంతంగా ఉండేందుకు, కండ‌రాలు ప‌టిష్టంగా ఉండేందుకు కూడా నీరు చాలా అవ‌స‌రం అవుతుంది. మూత్ర పిండాల వంటి అవ‌య‌వాలు స‌క్రమంగా పనిచేయ‌టంలో నీరు చురుకైన పాత్ర పోషిస్తుంది.

ఎండాకాలంలో ఈ సంగ‌తి గుర్తుంచుకోండి..!

ఎండా కాలం వ‌చ్చిందంటే ఉష్ణోగ్రత‌లు పెరిగిపోతాయి. ఈ సారి సీజ‌న్ లో ఏప్రిల్ నెల‌లోనే ఎండ‌లు మండిపోతున్నాయి. ఎండ‌లు భ‌గ భ‌గ లాడిస్తుంటే బ‌య‌ట తిరిగే వారు అల్లాడిపోతున్నారు.
ఎండ‌లో తిరిగేట‌ప్పుడు ఒక చిన్న జాగ్రత్త ను మిస్ అవుతుంటాం.

కొంత‌మందికి కూల్ వాట‌ర్ తాగే అల‌వాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారు ఎండా కాలంలో కూల్ వాట‌ర్ మ‌రింత‌గా తాగేస్తుంటారు. బాగా ఎండ‌లో తిరిగి వ‌చ్చాక శ‌రీర భాగాల‌న్నీ వేడెక్కి ఉంటాయి. అంత మాత్రాన పూర్తిగా చ‌ల్లగా ఉండే కూల్ వాట‌ర్ తీసుకోవ‌టం స‌రికాదు. అప్పటి దాకా బాగా ఎండ‌గా ఉండ‌టంతో ఒక్క సారిగా కూల్ వాట‌ర్ లోప‌లికి వెళితే శ‌రీరం అంత త్వర‌గా ఎడ్జస్ట్ కావ‌టం క‌ష్టం అవుతుంది. అందుచేత ఒక వేళ ఎండ‌లో తిరిగి వ‌స్తే కాస్సేపు శ‌రీరం స్థిమిత ప‌డే దాకా ఉండి, ఆ త‌ర్వాత చ‌ల్లటి నీరు తీసుకోవచ్చు. బాగా చల్లగా ఉండే కూల్ వాట‌ర్ ప‌దే ప‌దే తాగ‌టం స‌రికాద‌నే చెప్పాలి. అందుచేత కూల్ వాట‌ర్ తీసుకొనేట‌ప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
వాస్తవానికి మాన‌వుల్లో ఉష్ణోగ్రత‌లు ఎక్కువ‌గా ఉన్నప్పుడు స‌ర్దుబాటు వ్యవ‌స్థ శ‌రీరంలోప‌లే ఉంటుంది. బ‌య‌ట ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు లోప‌లే దానికి త‌గిన‌ట్లుగా స‌ర్దు బాటు జ‌రిగిపోతుంది. అందుచేత‌నే ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోయినా శ‌రీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగానే ఉంటుంది. అంత మాత్రం చేత మ‌నం .. ఎంత‌టి ఎండ‌ల్లో తిరిగేసినా ఫ‌ర్వాలేదు అనుకోవ‌ద్దు సుమా..! అందుచేత సాధ్యమైనంత వ‌ర‌కు  ఎండ బారిన ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేక‌పోతే మాత్రం వ‌డ‌దెబ్బ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రయాణంలో స‌మ‌స్య ఉంటే ఇదిగో ప‌రిష్కారం..!

ప్రయాణం చేసేట‌ప్పుడు ఎటువంటి స‌మ‌స్య ఉండ‌కూడ‌ద‌ని, సాఫీగా సాగిపోవాల‌ని కోరుకొంటారు. ప్రయాణంలో ఇబ్బంది ఏర్పడితే మాత్రం చికాకు త‌ప్పదు.

కొంత‌మందిలో ప్రయాణంలో ఉన్నప్పుడు విరేచ‌నాలు ఎక్కవ అవుతుంటాయి. చాలా సార్లు ఈ విరేచ‌నాల‌కు అప‌రిశుభ్రమైన ఆహారం తిన‌టం లేదా అప‌రిశుభ్రమైన నీటిని తాగ‌టం కార‌ణం అవుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు అన్ని వేళ‌లా శుభ్రమైన ఆహారం కానీ, శుచి అయిన నీరు కానీ దొర‌క‌దు. అందుచేత దొరికిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారంతో స‌మ‌స్యలు వ‌చ్చి ప‌డ‌తాయి. దీనికి తోడు ప్రయాణం చేసేట‌ప్పుడు, ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్నప్పుడు కూడా విరేచ‌నాల స‌మ‌స్య వెంటాడుతు ఉంటుంది.
గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఈ స‌మ‌స్య కు తేలికైన ప‌రిష్కారం దొర‌కుతోంది. గ‌తంలో యాంటి బ‌యాటిక్స్, ఇత‌ర మందులు వాడాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ప్రో బ‌యాటిక్స్ మందుల‌తో తేలిగ్గా ప‌రిష్కారం ల‌భిస్తోంది. ప్రయాణంలో ఉన్నప్పుడు రోజు ఒక మాత్ర వేసుకొన్నా చ‌క్కగా ప‌ని చేస్తుంది. పైగా ఇవి అన్ని మందుల షాపుల్లో దొర‌కుతున్నాయి. ముందుగానే వైద్యుడ్ని సంప్రదించి ఎటువంటి మందులు వేసుకోవాలో తెలుసుకొంటే ప్రయాణాలు సాఫీ గా చేసి రావ‌చ్చు.

అన్ని స‌మ‌స్యల‌కూ *విడ‌గొట్టడ‌మే * ప‌రిష్కార‌మా..! విడ‌గొడితే స‌మ‌స్య తీరిపోతుందా..!

స‌మ‌స్య ఏర్పడిన‌ప్పుడు అది ఎందుకు ఏర్పడింది.. ఎందు వ‌ల‌న ఈ స‌మ‌స్య పెరుగుతోంది... దీనికి మూలం ఏమిటి.. అన్నది ఆలోచించాలి.. అప్పుడు ప‌రిష్కారం సాధ్యం అవుతుంది..!

ఇటీవ‌ల కాలంలో కాలేయ క్యాన్సర్ వ్యాధి గురించి త‌ర‌చు వింటున్నాం. కాలేయానికి సోకే తీవ్రమైన వ్యాదుల్లో క్యాన్సర్ ఒక‌టి. ఒక‌ప్పుడు క్యాన్సర్ వ‌స్తే చికిత్స అసాద్యం అనుకొనే వారు. కానీ ఆధునిక ప‌రిశోధ‌న‌ల‌తో క్యాన్సర్ కు చికిత్స ల‌భిస్తోంది. ఇందులో ముఖ్యమైన‌ది రేడియో ఫ్రీక్వన్సీ అబ్లేష‌న్ (ఆర్‌.ఎఫ్‌.ఎ.). ఇందులో భాగంగా విద్యుత్ శ‌క్తి ద్వారా వేడిని ర‌గులుస్తారు. ఈ వేడి తో కాలేయంలోని క్యాన్సర్ క‌ణితిని విడ‌గొట్టడం జ‌రుగుతుంది. అక్కడ ఉన్న రోగ కార‌క క‌ణ‌జాలాన్ని విచ్చిన్నం చేసే విధాన‌మే ఈ ఆర్‌.ఎఫ్‌.ఎ. గ‌తంలో ఈ విధానంపై కొన్ని అపోహ‌లు ఉండేవి. అన్ని ర‌కాల క్యాన్సర్ ల‌కు ఈ విడ‌గొట్టే ఆర్.ఎఫ్‌.ఎ. విధాన‌మే ప‌రిష్కార‌మా.. అన్న ప్రశ్న త‌లెత్తేది. అన్నింటికీ ఇది ప‌రిష్కారం అని చెప్పలేం కానీ చాలా ర‌కాల కాలేయ క్యాన్సర్ ల‌కు ఇది స‌మ‌ర్థమైన ప‌రిష్కారం అని చెప్పుకోవ‌చ్చు. నిపుణులైన వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో చేసే ఆర్‌.ఎఫ్‌.ఎ. స‌ర్జరీ తో చాలా వ‌ర‌కు సైడ్ ఎఫెక్టులు లేకుండా ప‌రిష్కారం సాధించుకోవ‌చ్చు. క్యాన్సర్ ను గుర్తించిన వెంట‌నే చికిత్స చేయించుకోవ‌టం ముఖ్యం అని గుర్తించుకోవాలి. ఒకే సారి పూర్తిగా నివార‌ణ కాక‌పోతే కొన్ని సిట్టింగ్ ల ద్వారా ప‌రిష్కారాన్ని సాధించ‌వ‌చ్చు. మ‌రికొన్ని సార్లు ఆప‌రేష‌న్ తో పాటు ఇత‌ర ర‌కాల థెరపీల‌ను వినియోగించాల్సి ఉంటుంది.

నాటు ప‌ద్దతి ఎప్పటికైనా స‌మ‌స్యే..!


ఏ విష‌యం అయినా శాస్త్రీయంగా ఆలోచిస్తే చ‌క్కటి ప‌రిష్కారం దొర‌కుతుంది. నాటు ప‌ద్దతిలో ఎదుర్కొంటే మాత్రం ఇబ్బంది త‌ప్పదు.

జీర్ణ వ్యవ‌స్థ లో ఇబ్బంది పెట్టే కామెర్లు వంటి వ్యాధుల‌కు కొంత మంది వైద్యం చేయించుకొనేందుకు ఇష్టం చూప‌రు. నాటు ప‌ద్దతిలో మూలిక‌లు, చెక్క మందును వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. దీని కార‌ణంగానే కామెర్లు న‌యం అవుతాయని న‌మ్ముతారు. వాస్తవానికి కొన్ని ర‌కాల కామెర్లు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. మందులు వాడినా, వాడ‌క‌పోయినా త‌గ్గిపోతాయి. ఇటువంట‌ప్పుడు మూలిక‌లు, చెక్క మందులు వంటివి వాడిన‌ప్పుడు స‌హ‌జంగా ఉండే శ‌రీర వ్యాధి నిరోధ‌క శ‌క్తితో నివార‌ణ అయిపోతుంది. కానీ వీటి వ‌ల‌న‌నే కామెర్లు త‌గ్గాయ‌ని భావిస్తారు. దీని గురించి ప్రచారం చేస్తుంటారు. కానీ, మిగిలిన ర‌కాల కామెర్లు సోకిన‌ప్పుడు క‌చ్చితంగా చికిత్స అవ‌స‌రం అవుతుంది. అటువంటి సంద‌ర్భాల్లో ఈ నాటు ప‌ద్దతి అవ‌లంబించ‌టం వ‌ల‌న వ్యాధి ముదిరిపోతుంది. అంతిమంగా నివార‌ణ క‌ష్టత‌రం అవుతుంది. అందుచేత కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు స‌రైన వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవ‌టం మంచిది.

ఉగాది విశిష్టత తెలుసుకోవాల్సిందే..!

ఉగాది అన‌గానే అంద‌రికీ గుర్తుకొని వ‌చ్చేది ఉగాది ప‌చ్చడి. ఆ రోజున త‌ప్పనిస‌రిగా ప‌చ్చడి తిన‌టం తెలుగు వారి సాంప్రదాయం. దీన్నే క‌న్నడంలో బేవు బెళ్ల అని పిలుస్తారు.

ఉగాది ప‌చ్చడిలో చేదు, తీపి, కారం, పులుపు, ఉప్పు, వ‌గ‌రు అనే ఆరు ర‌కాల రుచులు ఉంటాయి. ఇందుకోసం వేప పూవు, బెల్లం, మిర్చి, ఉప్పు, చింత‌పండు, మామిడి కాయ ఉప‌యోగిస్తారు. ఈ ఆరు ర‌కాల ప‌దార్థాల్లోనూ ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని త‌గినంత‌గా జోడించి త‌యారు చేసిన ప‌చ్చడి తిన‌టం ద్వారా వీటిలోని ఔష‌ధ గుణాలు శ‌రీరానికి అందుతాయి. ముఖ్యంగా చేదు, వ‌గ‌రు వంటి రుచుల్ని విడిగా తినేందుకు జ‌నం ఇష్ట ప‌డ‌రు. తీపి, కారం, ఉప్పు ఎక్కువ‌గా లాగిస్తుంటారు. వీటిని ఎక్కువ‌గా తిన‌టం తో ఎంత‌టి స‌మ‌స్యో, చేదు వ‌గ‌రు ని వ‌దిలేయటం అటువంఇ స‌మ‌స్యకు దారి తీస్తుంది. అందుచేత ఇటువంటి సంద‌ర్భాల్లో ఆయా రుచుల్ని ప‌రిచ‌యం చేసేందుకు పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగ‌ని ఈ ప‌చ్చడిని విప‌రీతంగా తింటే మాత్రం చేటు త‌ప్పదు సుమా..!

పెద్ద గ్రంథిలో పెద్ద స‌మ‌స్య వ‌చ్చినా బెంగ ప‌డ‌వ‌ద్దు సుమా..!

మాన‌వ శ‌రీరంలోని అతి పెద్ద గ్రంథిగా కాలేయాన్ని చెబుతారు. దీనికి వ‌చ్చే అనేక స‌మ‌స్యల్లో తీవ్రమైన‌ది మాత్రం కాలేయ క్యాన్సర్ . స‌హ‌జంగానే క్యాన్సర్ అంటేనే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. క్యాన్సర్ అనేది ప్రమాద‌క‌ర‌మైన వ్యాధి అన‌టంలో సందేహం లేదు. అంత మాత్రాన క్యాన్సర్ వ‌స్తే చికిత్స లేదు అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విష‌యంలో అప్పుడు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వ‌చ్చాయి.

స‌హ‌జంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధార‌ణ‌లో ఏ ద‌శ‌లో ఉంద‌న్నది ప్రధానం. క్యాన్సర్ వ్యాధి విస్తర‌ణ ను 4ద‌శ‌లుగా చెబుతారు. మొద‌టి ద‌శలో క్యాన్సర్ ఉంటే ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా వ్యాధిని నిర్మూలించ‌వ‌చ్చు. రెండు, మూడు ద‌శ‌ల్లో ఉంటే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ అవ‌స‌రం అవుతాయి. నాలుగో ద‌శ లో మాత్రం రోగి శేష జీవితం సాఫీగా జ‌రిగేపోయేట్లుగా చేయ‌టానికి వీల‌వుతుంది. కాలేయ క్యాన్సర్ కు ఇత‌మిత్థమైన కార‌ణం అంటూ లేదు. కానీ దుర‌ల‌వాట్ల తో స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి మ‌ద్యం తాగే అల‌వాటుకి దూరంగా ఉండ‌టం, హెప‌టైటిస్ రాకుండా జాగ్రత్త ప‌డ‌టం వంటివి చూసుకోవాలి.

చిన్న స‌మ‌స్యను తేలిగ్గా తీసుకోవ‌ద్దు. కొన్ని సార్లు పెద్ద ఇబ్బందిని తెచ్చి పెడ‌తాయి. ఉదాహ‌ర‌ణ‌కు..!

చాలా మంది చిన్న చిన్న స‌మ‌స్యల‌ను తేలిగ్గా తీసుకొంటారు. అవి పెద్ద ఇబ్బందిగా మారిన‌ప్పుడు మాత్రం అయ్యో, ముందుగానే  మేలుకోలేక పోయామే అని బాధ ప‌డ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌డుపులో నొప్పి వ‌స్తుంటే ఏదో చిన్న విష‌య‌మే క‌దా అని వ‌దిలేస్తుంటారు. అస‌లు ఈ నొప్పి ఎందుకు వ‌స్తోందో తెలుసుకొని దానికి చికిత్స తీసుకోవాలి. ఈ మ‌ధ్య కాలంలో చిన్న పిల్లల్లో.. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి చెందిన పిల్లల్లో ఈ నొప్పి క‌నిపిస్తోంది. ఇటువంటి కేసుల్ని చూసిన‌ప్పుడు చాలా మందిలో క్లోమం (పాన్ క్రియాస్‌) లో రాళ్లు ఏర్పడిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఈ రాళ్లను ముందుగానే గుర్తిస్తే చికిత్స తేలిక అవుతుంది.

పెద్దల్లో ముఖ్యంగా ఆల్కహాల్ తాగే అల‌వాటు ఉన్నవారిలో ఇటువంటి స‌మ‌స్య ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ మ‌ధ్య కాలంలో పిల్లల్లో కూడా ఇది త‌లెత్తుతోంది. క్లోమంలో రాళ్లను గుర్తిస్తే ఇప్పుడు అధునాతన చికిత్స లు అందుబాటులోకి వ‌చ్చాయి. లిథో ట్రిప్సి విధానాలు, అవ‌స‌ర‌మైతే ఎల్ పీ జీ ఆప‌రేష‌న్ ద్వారా ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌వ‌చ్చు. నిపుణులైన వైద్యులు అధునాతన టెక్నాలజీతో తేలిగ్గా ఇటువంటి చికిత్స లు చేయ‌గ‌లుగుతున్నారు.